అన్వేషించండి

Chiranjeevi - Venkatesh: మన శంకర వరప్రసాద్ గారు... అక్టోబర్ నుంచి షూటింగ్‌కు వెంకటేష్ గారు!

Mana Shankara Vara Prasad Garu Update: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'. ఇందులో విక్టరీ వెంకటేష్ ఓ రోల్ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu). ఇందులో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రత్యేక పాత్రను సందడి చేయనున్నారు. చిరు సినిమాకు ముందు వెంకీ హీరోగా 'సంక్రాంతికి వస్తున్నాం'తో భారీ విజయం అందుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.‌ దానికి ముందు ఆయన హీరోగా 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' వంటి కమర్షియల్ సక్సెస్‌లు తీశారు. చిరు - వెంకీ మధ్య స్నేహం ఉండటం, అలాగే దర్శకుడితో మంచి అనుబంధం కారణంగా 'మన శంకర వర ప్రసాద్' సినిమాలో ప్రత్యేక పాత్ర చేయడానికి వెంకీ ఓకే చెప్పారు. మరి ఆ సినిమా చిత్రీకరణలో ఎప్పటి నుంచి పాల్గొంటారో తెలుసా? 

అక్టోబర్ నుంచి చిరు సెట్స్‌కు వెంకటేష్!
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇటీవల 'మన శంకర వర ప్రసాద్ గారు' టైటిల్‌ విడుదల చేశారు. సినిమా పేరును వెంకీ వాయిస్ ద్వారా పరిచయం చేశారు. ఆల్రెడీ వెంకటేష్ షూటింగ్ స్టార్ట్ చేశారా? అంటే... 'లేదు' అని చెప్పాలి. మరి ఎప్పటి నుంచి షూటింగ్ మొదలు పెడతారు? అంటే అక్టోబర్ నెల నుంచి చిత్రీకరణలో వెంకీ గారి జాయిన్ అవుతారని 'కిష్కిందపురి' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో షైన్ స్క్రీన్స్ నిర్మాణ సంస్థ అధినేత సాహు గారపాటి తెలిపారు. చిరు సినిమా నిర్మాతలలో ఆయన ఒకరు.

సెప్టెంబర్ 5 నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రీకరణ కొంత పూర్తి అయ్యింది. ఆల్మోస్ట్ ఫస్ట్ ఆఫ్ కంప్లీట్ చేశారని టాక్. హైదరాబాద్‌తో పాటు డెహ్రాడూన్ సిటీ, కేరళ రాష్ట్రంలో కొంత చిత్రీకరణ చేశారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి హైదరాబాద్‌లో సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. 

Also Read: 'కిష్కిందపురి' ట్రైలర్ లాంచ్ హైలైట్స్... రింగుల జుట్టుకు హారర్ సినిమా ఛాన్సులు అంటున్న అనుపమ... గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పిన హీరో బెల్లంకొండ

చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాలో కేథరిన్ త్రెసా, మురళీధర్ గౌడ్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ సాహు గారపాటితో పాటు చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: నాగార్జున పెద్ద కోడలు అంటే నమ్మగలమా? నాగచైతన్య భార్య ఎంత సింపుల్‌గా వంట చేసిందో ఫోటోల్లో చూడండి

టాప్ హెడ్ లైన్స్

OM Trailer Review : O.M ట్రైలర్ వచ్చేసింది - ధనుష్ మాస్ యాక్షన్... టైటిల్ ఛేంజ్ చేశారుగా!
O.M ట్రైలర్ వచ్చేసింది - ధనుష్ మాస్ యాక్షన్... టైటిల్ ఛేంజ్ చేశారుగా!
Dada Dhamaka Song : దాదా ధమాకా సాంగ్ వచ్చేసింది - బాలయ్య పాడిన పాట విన్నారా?
దాదా ధమాకా సాంగ్ వచ్చేసింది - బాలయ్య పాడిన పాట విన్నారా?
Obsession OTT : రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
Gautam Gambhir Fire: బ్యాటర్లపై గంభీర్ ఫైర్.. ఆడలేని బంతులంటూ ఏవీ ఉండవంటూ ఘాటు విమర్శలు
బ్యాటర్లపై గంభీర్ ఫైర్.. ఆడలేని బంతులంటూ ఏవీ ఉండవంటూ ఘాటు విమర్శలు
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Bigg Boss Season 10 Today November 13th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Embed widget