Sankranthiki Vasthunam: 'మీనూ'తో వెంకీ మామ చిలిపి లవ్ స్టోరీ... అదీ భార్య ముందే - 'సంక్రాంతికి వస్తున్నాం' సెకండ్ సాంగ్ విన్నారా?
Meenu Lyrical Video: వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' నుంచి సెకండ్ సాంగ్ 'మీనూ' లిరికల్ వీడియో రిలీజ్ అయ్యింది.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సినిమాలోని మొదటి పాట రిలీజ్ అయ్యి, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'మీనూ'ను రిలీజ్ చేశారు.
'మీనూ' సాంగ్ వచ్చేసింది
వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. బ్లాక్ బస్టర్ మెషిన్ గా పిలుచుకునే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ 'మీనూ' సాంగ్ ప్రోమోను వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ప్రోమో ఆసక్తికరంగా ఉండడంతో ఫుల్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు వెంకీ మామ అభిమానులు. తాజాగా 'మీనూ' సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ పాట లిరిక్స్ అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులకు ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యింది.
భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు కంపోజ్ చేసిన మ్యూజిక్ వినసొంపుగా ఉంది. ఇక ఈ పాటకు అనంత్ శ్రీరామ్ రాసిన సాహిత్యం బాగుంది. ప్రణవి ఆచార్యతో కలిసి బీమ్స్ సిసిరోలియో ఈ పాటను ఆకట్టుకునేలా అద్భుతంగా పాడారు. భాను మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ బాగుంది. అలాగే మీనాక్షి చౌదరి తో పాటు ఐశ్వర్యతో వెంకటేష్ లవ్లీ కెమిస్ట్రీ చూడ్డానికి బాగుంది. మొత్తానికి సెకండ్ సాంగ్ కూడా విడుదలైన నిమిషాల్లోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
A melody that will leave you blushing and a rhythm that will have you vibing all day long 😍🫶#SankranthikiVasthunam second single #Meenu Lyrical Video out now ❤️
— Sri Venkateswara Creations (@SVC_official) December 19, 2024
— https://t.co/nC9CAwQnNJ
A #BheemsCeciroleo Musical 🎶
Lyrics by @IananthaSriram
Vocals by Bheems,… pic.twitter.com/qBMOldYi2p
భార్య ముందే వెంకీమామ లవ్ స్టోరీ...
ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీసు అధికారిగా నటించగా, ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్, ప్రేయసిగా మీనాక్షి చౌదరి నటించారు. తాజా 'మీనూ' పాటలో వెంకటేష్ తన భార్యకు ప్రియురాలి గురించి వివరించడం కనిపిస్తోంది. అలాగే వీళ్ళిద్దరూ కలిసి వివిధ ప్రాంతాల్లో తిరగడం, మంచి లైఫ్ టైం మెమరీలను క్రియేట్ చేయడం ఈ సాంగ్ లో చూడొచ్చు. అంతేకాకుండా ఈ పాటలో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, హీరో ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ఒప్పుకోకపోవడం. పైగా తన మొదటి ముద్దు భార్యకు మాత్రమే అని చెప్పడం చూడొచ్చు.
గ్లోబల్ టాప్ 20లో 'గోదారి గట్టు' సాంగ్
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి 'గోదారి గట్టు' అనే పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రమణ గోగుల పాడిన ఈ ఫస్ట్ సాంగ్ తోనే ప్రేక్షకుల దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు 'సంక్రాంతికి వస్తున్నాం' టీం. ఇక ఈ పాట ఏకంగా గ్లోబల్ టాప్ 20 వీడియోల లిస్టులో ఉండడం మరో విశేషం. ఇదిలా ఉండగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read: అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు