అన్వేషించండి

Venkatesh - Ishwarya Rajesh: వెంకటేష్‌కు భార్యగా ఐశ్వర్య రాజేష్, చేతిలో గన్‌తో మీనాక్షి చౌదరి - అనిల్ రావిపూడి గట్టిగానే ప్లాన్ చేశాడండోయ్!

Venkatesh - Ishwarya Rajesh: వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో రాబోతున్న సినిమాకి ముహూర్తం ఖ‌రారు అయ్యింది. ఇక వెంకీ మామ‌కి భార్య‌గ ఐశ్వ‌ర్య రాజేశ్ న‌టించ‌నుంది.

Venkatesh - Ishwarya Rajesh New Cinema In SV Creations: వెంక‌టేశ్, అనిల్ రావిపూడి కాంబినేష‌న్ అంటేనే క్రేజీ కాంబినేష‌న్. ఇప్ప‌టికే వీళ్ల ఇద్ద‌రి కాంబోలో రెండు సినిమాలు వ‌చ్చాయి. అయితే, ఇప్పుడు మూడో సినిమా కూడా రాబోతుంది. సినిమా షూటింగ్ కి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు మేక‌ర్స్. వెంక‌టేశ్ స‌ర‌స‌న ఐశ్వ‌ర్య రాజేశ్ న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది సినిమా టీమ్. ఆమెకు వెల్ క‌మ్ చెప్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఉగాది పండగ సందర్భంగా 'Venky Anil3' 'SVC 58' వంటి వర్కింగ్ టైటిల్స్ తో ఆ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ పై అప్ డేట్ ఇచ్చారు. జులై 3 నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్న‌ట్లు ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఇక వెంక‌టేశ్ స‌ర‌స‌న ఆయ‌న భార్య‌గా ఐశ్వ‌ర్య రాజేశ్ న‌టించ‌నున్నారు. ఆమెకు సినిమాలోకి వెల్ క‌మ్ చెప్తూ, షూటింగ్ స్టార్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్తూ ఇన్ స్టా పోస్ట్ చేశారు. 

మూడో సినిమా.. 

అనిల్ రావిపూడి, వెంక‌టేశ్ కాంబినేష్ లో వ‌స్తున్న మూడో సినిమా ఇది. ఇంకా టైటిల్ ఖ‌రారు చేయ‌లేదు. అయితే, ఈ సినిమా యాక్ష‌న్ ట్ర‌యాంగిల్ గా తెర‌కెక్కుతున్న‌ట్లు అర్థం అవుతుంది. ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే కథతో ఈ సినిమా రాబోతోంది.  నిజానికి వెంకీ, అనిల్ రావిపూడి అంటే క్రేజీ కాంబినేష‌న్. న‌వ్వుల, పువ్వులు పూయిస్తారు వాళ్లిద్ద‌రు. టాలీవుడ్ లో వెంకటేశ్, అనిల్ రావిపూడిలను మోస్ట్ ఎంటర్టైనింగ్ కాబినేషన్ గా చెప్పుకుంటారు. 'ఎఫ్‌ 2', 'ఎఫ్ 3' చిత్రాలతో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించి, మంచి విజయాలను అందుకున్నారు. కానీ ఈ సారి డిఫ‌రెంట్ జోన‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు తెలుస్తోంది.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

ఇక ఈ సినిమాకి సంబంధించి రిలీజైన పోస్ట‌ర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. పోస్టర్ లో తాళి, గన్, గులాబీ పువ్వులను ఉంచారు. లవ్ స్టొరీ, మ్యారేజ్ తో పాటుగా యాక్షన్ కూడా కావాల్సినంత ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఐశ్వ‌ర్య రాజేశ్ పై రిలీజ్ చేసిన పోస్ట‌ర్ లో కూడా గ‌న్, తాళి పెట్టారు. కాగా.. ఐశ్వ‌ర్య‌ రాజేశ్ తో పాటు.. మీనాక్షి చౌదరీని ఎంపిక చేశారు. వీరిద్దరూ సీనియర్ హీరో వెంకటేశ్ తో జోడీ కట్టడం ఇదే తొలిసారి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు.  సినిమా ప్రారంభించిన తర్వాత నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇందులో వెంకటేష్ ఒక మాజీ  పోలీసాఫీసర్ గా కనిపిస్తే.. ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపుడి స్వయంగా చెప్పారు. స్క్రిప్ట్ ని శింగ‌ర‌కొండ ఆంజ‌నేయ స్వామి ద‌గ్గ‌ర పెట్టి పూజ చేసిన అనంత‌రం ఈ విష‌యాలు వెల్ల‌డించారు ఆయ‌న‌.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

Also Read: చ‌ర‌ణ్‌, రానా, అల్లు అర్జున్, ప్ర‌భాస్.. 140 మందితో వాట్సాప్ గ్రూప్ దాంట్లో ఏం మాట్లాడుకుంటామంటే? - మంచుల‌క్ష్మీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Jobs: జాబ్ కాలెండర్ ప్రకారమే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
జాబ్ కాలెండర్ ప్రకారమే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
MLC Kavitha: తిహార్ జైలులో కవితను కేటీఆర్, హరీష్ రావు - అప్పటివరకూ ఇద్దరూ ఢిల్లీలోనే మకాం!
తిహార్ జైలులో కవితను కేటీఆర్, హరీష్ రావు - అప్పటివరకూ ఇద్దరూ ఢిల్లీలోనే మకాం!
Andhra Pradesh: ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
UK Elections 2024: యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Emotional Speech About Jasprit Bumrah | బుమ్రా ఈ దేశపు ఆస్తి అంటున్న కోహ్లీ | ABP DesamVirat Kohli Emotional About Rohit Sharma |15 ఏళ్లలో రోహిత్ శర్మను అలా చూడలేదంటున్న విరాట్ కోహ్లీJagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Jobs: జాబ్ కాలెండర్ ప్రకారమే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
జాబ్ కాలెండర్ ప్రకారమే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
MLC Kavitha: తిహార్ జైలులో కవితను కేటీఆర్, హరీష్ రావు - అప్పటివరకూ ఇద్దరూ ఢిల్లీలోనే మకాం!
తిహార్ జైలులో కవితను కేటీఆర్, హరీష్ రావు - అప్పటివరకూ ఇద్దరూ ఢిల్లీలోనే మకాం!
Andhra Pradesh: ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
UK Elections 2024: యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
Electric Cars Sale Declined: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ - కారణం ఏంటి?
భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ - కారణం ఏంటి?
Anasuya Bharadwaj: అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
Viral News: నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
Telangana Politics: తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్
తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్
Embed widget