By: ABP Desam | Updated at : 21 Apr 2022 11:38 AM (IST)
విజయ్ దేవరకొండ 11వ సినిమా ప్రారంభోత్సవంలో ఒక దృశ్యం
It's Official, Vijay Devarakonda and Samantha movie launched today: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించనున్న తాజా సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దీనికి శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకుడు. నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థలో 19వ చిత్రమిది. విజయ్ దేవరకొండ 11వ చిత్రమిది.
ముహూర్తపు సన్నివేశానికి 'ఉప్పెన' దర్శకుడు సానా బుచ్చిబాబు కెమెరా స్విచ్ఛాన్ చేయగా... దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడికి చిత్ర నిర్మాతలు స్క్రిప్ట్ అందజేశారు. ప్రముఖ దర్శకులు కొరటాల శివ, కె.ఎస్. రవీంద్ర (బాబీ) తదితరులు హాజరయ్యారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపొందుతోందని, ఈ నెలలో కశ్మీర్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని చిత్ర బృందం పేర్కొంది. ఆ తర్వాత విశాఖ, కేరళలోని అలెపీలో షూటింగ్ చేయనున్నారు (Kashmir Backdrop for Vijay Devarakonda Samantha Movie). ఇందులో కశ్మీర్ యువతిగా సమంత నటించనున్నారని సమాచారం. అయితే... ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు.
'లైగర్' తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రమిది. 'మహానటి' తర్వాత మరోసారి ఆయన సమంతతో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో 'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్ దేవరకొండ, 'రంగస్థలం' తర్వాత సమంత నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి 'ఖుషి' (Khushi Title For Vijay Devarakonda Samantha Movie) టైటిల్ ఖరారు చేసినట్టు భోగట్టా. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా టైటిల్ గురించి కూడా ఏమీ చెప్పలేదు. త్వరలో వెల్లడిస్తారేమో!
Also Read: డెలివరీ తర్వాత గ్లామరస్‌గా ఉండదు. కానీ, అందంగా ఉంటుంది - కాజల్ భావోద్వేగభరిత లేఖ
జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.
Also Read: 'ఓ మై డాగ్' రివ్యూ: సూర్య, జ్యోతిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
#VD11 Launched ❤️
— Mythri Movie Makers (@MythriOfficial) April 21, 2022
Our Heartthrob @TheDeverakonda & Queen @Samanthaprabhu2 reunite for a Family Entertainer under the direction of @ShivaNirvana 😊
Music by @HeshamAWMusic 💝
Shoot begins this month! #VD11Launch pic.twitter.com/rjAtG5Td0B
Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్
Akshay Kumar: అలా మాట్లాడితే నాకు నచ్చదు - సౌత్, నార్త్ కాంట్రవర్సీపై అక్షయ్ కుమార్ కామెంట్స్
SSMB28: మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదేనా?
Mehreen: బన్నీ సినిమా వదులుకున్నా, అది కానీ చేసుంటే - మెహ్రీన్ బాధ
Major Movie: 'మేజర్' లేటెస్ట్ అప్డేట్ - మే 24 నుంచే స్క్రీనింగ్
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!
MP Raghurama Krishn Raju : ఎంపీ రఘురామ అనర్హత పిటిషన్ పై విచారణ, ప్రివిలేజ్ కమిటీ ఎదుట మార్గాని భరత్ హాజరు!
Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు