Varun Tej: శరవేగంగా మెగా హీరో వరుణ్ తేజ్ క్రేజీ ప్రాజెక్ట్ - ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్‌లో...
VT15 Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ 'VT15'. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Varun Tej's VT15 Movie Update: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'VT15' వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వరుణ్ తన కెరీర్‌లోనే ఫస్ట్ టైం ఓ హారర్ కామెడీ జానర్‌లో చేస్తున్నారు. ఇండో కొరియన్ హారర్ కామెడీగా రూపొందుతోన్న ఈ మూవీకి 'కొరియన్ కనకరాజు' టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
శరవేగంగా షూటింగ్
ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ జరుగుతోంది. వరుణ్ ఇతర నటీనటులపై కీలక సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఇండియాతో పాటు విదేశాల్లోనూ 3 మేజర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసి గ్రాండ్ విజువల్స్ క్యాప్చర్ చేశారు. తాజా షెడ్యూల్‌లో ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. వరుణ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా చేస్తుండగా... సీనియర్ నటి తులసి, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ థమన్ మ్యూజిక్ అందిస్తుండగా... 'తొలిప్రేమ' తర్వాత సూపర్ హిట్ కాంబో రిపీట్ కానుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. త్వరలోనే మూవీకి సంబంధించి ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.
Also Read: నిర్మాతగా సుకుమార్ భార్య తబిత... పదేళ్ళ క్రితం వచ్చిన బోల్డ్ సినిమాకు సీక్వెల్!






















