Varun Tej: హారర్ కామెడీ సినిమాలో వరుణ్ తేజ్ లుక్ చూశారా... లీక్ చేసిన సీనియర్ ఆర్టిస్!
VT15 Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అందులో వరుణ్ తేజ్ లుక్ లీక్ అయ్యింది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తన కెరీర్‌లో తొలిసారి ఓ హారర్ కామెడీ ఫిల్మ్ చేస్తున్నారు. అదీ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో! ఇండో కొరియన్ హారర్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమాకు 'కొరియన్ కనకరాజు' టైటిల్ ఖరారు చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. అయితే... టైటిల్ న్యూస్ ఇంకా అనౌన్స్ చేయలేదు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో వరుణ్ తేజ్ లుక్ లీక్ అయ్యింది.
'కొరియన్ కనకరాజు'గా వరుణ్ లుక్!
Varun Tej's first look in Korean Kanakaraju movie: 'కొరియన్ కనకరాజు' సినిమాలో సీనియర్ ఆర్టిస్ట్ తులసి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల పూర్తి అయిన అనంతపూర్ షెడ్యూల్‌లో ఆవిడ పాల్గొన్నారు. అక్కడ వరుణ్ తేజ్‌తో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వరుణ్ లుక్ లీక్ అయ్యింది.
View this post on Instagram
హీరోగా వరుణ్ తేజ్ 15వ సినిమా 'కొరియన్ కనకరాజు'. అందుకని, VT15 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా భారీ ఎత్తున ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
నెక్స్ట్ షెడ్యూల్... ఛలో కొరియా!
ఇప్పటి వరకు హైదరాబాద్, అనంతపూర్... రెండు షెడ్యూల్స్ చేశారు. వరుణ్ తేజ్, హీరోయిన్ రితికా నాయక్ సహా ఇతర ప్రధాన పాత్రధారుల మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. అనంతపూర్‌లోని ప్రముఖ కియా గ్రౌండ్స్, గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు. ఆ సన్నివేశాలు సినిమాలో హైలైట్ అవుతాయని యూనిట్ అంటోంది.
Also Read: టాలీవుడ్ 'కింగ్ పిన్'కు పవన్ కళ్యాణ్ చెక్‌మేట్... చిన్న గూగ్లీకి హడల్... దెబ్బకు సెట్టయ్యారా?
హైదరాబాద్, అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న 'కొరియన్ కనకరాజు' టీమ్ త్వరలో ఇంటర్నేషన్ షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. ఆ షెడ్యూల్ కొరియాలో జరుగనుంది. ఇది ఇండో కొరియన్ హారర్ కామెడీగా రూపొందుతున్న సినిమా అనేది తెలిసిన విషయమే. కొరియా నేపథ్యంలో కొన్ని సీన్లు ఉంటాయట.
Also Read: మెగా ఫ్యామిలీని దూరం చేసుకుంటున్న దిల్ రాజు? తెర వెనక కుట్రలా... ఇండస్ట్రీలో ఏం జరుగుతోందా?
వరుణ్ తేజ్, రీతికా నాయక్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సత్య, తులసి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి రచన - దర్శకత్వం: మేర్లపాక గాంధీ, నిర్మాణ సంస్థలు: యూవీ క్రియేషన్స్ - ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్, సంగీతం: ఎస్. థమన్, ఆర్ట్ డైరెక్టర్: పన్నీర్ సెల్వం, కొరియోగ్రాఫర్లు: దినేష్ మాస్టర్, యష్ మాస్టర్.





















