Dil Raju: మెగా ఫ్యామిలీని దూరం చేసుకుంటున్న దిల్ రాజు? తెర వెనక కుట్ర జరుగుతోందా? ఏంటీ కొత్త వివాదం??
మెగా ఫ్యామిలీ అత్యంత సన్నిహితులలో 'దిల్' రాజు ఒకరు అని నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో వినిపించేది. అయితే ఇప్పుడు ఆయన ఆ కుటుంబానికి దూరం అవుతున్నారా? లేదంటే దూరం చేసుకుంటున్నారా?

మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి (Mega Family) అత్యంత సన్నిహితులైన నిర్మాతల్లో 'దిల్' రాజు (Dil Raju) ఒకరనేది నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో వినిపించేది. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందా? చిరు కుటుంబానికి రాజు దూరం అవుతున్నారా? లేదంటే మెగా ఫ్యామిలీని దూరం చేసుకుంటున్నారా? థియేటర్స్ బంద్ వివాదంలో ఆయన పేరు హైలైట్ కావడంతో ఇండస్ట్రీలో కొత్త పుకార్లకు బలం చేకూరుతోంది.
'గేమ్ చేంజర్'తో మెగా బంధానికి బీటలు!?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు ప్రొడ్యూస్ చేసిన 'గేమ్ చేంజర్' సంక్రాంతికి విడుదలైంది. అబౌవ్ ఏవరేజ్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదల సమయంలో 'దిల్' రాజు బిహేవియర్ డిస్కషన్ పాయింట్ అయింది. విక్టరీ వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో 'గేమ్ చేంజర్'ను పూర్తిగా పక్కన పడేశారని మెగా ఫ్యాన్స్ బాగా ఫీల్ అయ్యారు. కొన్ని స్టేజీల మీద 'గేమ్ చేంజర్'తో వల్ల తనకు బాగా లాస్ వచ్చినట్లు ప్రొజెక్ట్ చేశారు. అల్లు అరవింద్ ఒక సినిమాతో కోట్లు పోగొట్టుకున్నారని కామెంట్ చేసినప్పుడు నవ్వారు దిల్ రాజు. ఆ తరుణంలో ఆయన వ్యవహార శైలి మెగా అభిమానులతో మెగా ఫ్యామిలీ సభ్యులకు కూడా ఆగ్రహం తెప్పించిందట.
'గేమ్ చేంజర్' సినిమాకు 'దిల్' రాజుతో పాటు జీ స్టూడియోస్ కూడా నిర్మాణ భాగస్వామి. ఫిలిం మేకింగ్‌లో ఖర్చు చేసిన డబ్బులు అన్నీ జీ స్టూడియోస్‌వి అట. 'దిల్' రాజు కేవలం ఎగ్జిక్యూట్ చేశారట. అయితే తనను తాను సోలో ప్రొడ్యూసర్ అన్నట్టు ఆయన ప్రొజెక్ట్ చేసుకోవడం, తన డబ్బులు మొత్తం పోయాయన్నట్లు పైకి అర్థమయ్యేలా చేయడం వంటివి చిరంజీవి, రామ్ చరణ్ దగ్గరకు వెళ్లాయట.
నిర్మాణంలో ఎవరు ఎన్ని డబ్బులు పెట్టారు? ఎవరి వాటా ఎంత? అనేది కీలక సభ్యులకు తెలుసు కనుక 'దిల్' రాజు ప్రవర్తన వాళ్లను బాధించిందట. 'గేమ్ చేంజర్' మేకింగ్ కోసం 350 నుంచి 400 కోట్లు ఖర్చు అయితే నాన్ థియేట్రికల్ - థియేట్రికల్ రైట్స్ ద్వారా సుమారు 250 నుంచి 300 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ టాక్. ఆయనకు పోయినవి 50 కోట్లు అని, 'శాకుంతలం' లాస్ కూడా 'గేమ్ చేంజర్' లెక్కల్లో కలిపారని ఇన్‌సైడ్ గుసగుస. ఒక్క 'గేమ్ చేంజర్' వల్ల 200 కోట్ల లాస్ అని ఫేక్ లెక్కలు ప్రచారంలోకి తీసుకొచ్చి, కేవలం థియేట్రికల్ రెవెన్యూ గురించి మాత్రమే మాట్లాడుతూ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చిన డబ్బు ఏమైందనేది సైడ్ చేశారు.
వీరమల్లుతో మరింత ముదిరిన వివాదం!?
'గేమ్ చేంజర్' విడుదల తర్వాత మెగా ఫ్యామిలీతో 'దిల్' రాజు బంధానికి బీటలు వారితే... ఇప్పుడు 'హరిహర వీరమల్లు'తో అది మరింత ముదిరిందని ఇండస్ట్రీ వర్గాల గుసగుస. ఎవరు అవునన్నా కాదన్నా... 'దిల్' రాజు చేతిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో సింగిల్ స్క్రీన్లు / థియేటర్లు ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్‌లో ఆయన కింగ్ పిన్. ప్రజెంట్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (Telangana FDC) చైర్మన్ కూడా. ఆయనకు తెలియకుండా ఎగ్జిబిటర్లు సమావేశం కారనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. పర్సంటేజీ సిస్టం కోసం పట్టుబడుతున్న వారిలో 'దిల్' రాజు కూడా ఉన్నారని వినబడుతోంది. ఇక్కడ ఆయన ఎగ్జిబిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ అతిథిగా హాజరు కావడం మాత్రమే కాదు... 'వకీల్ సాబ్' ప్రొడ్యూస్ చేయడం ద్వారా జనసేన పార్టీని నడపడానికి అవసరమైన డబ్బులను తనకు రెమ్యూనరేషన్ రూపంలో 'దిల్' రాజు అందించారని గొప్పగా చెప్పారు. అటువంటిది ఇప్పుడు పవన్ 'హరిహర వీరమల్లు' సినిమా విడుదలకు ముందు థియేటర్లు బంద్ అంశాన్ని పైకి తీసుకురావడం పట్ల మెగా అభిమానులతో పాటు జనసేన శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. తమ హీరో సినిమా విడుదలకు ముందు కుట్రలు చేస్తున్నారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్పటికి అయితే థియేటర్స్ బంద్ వెనక్కి వెళ్లింది. కానీ, దీని వెనుక సూత్రధారులు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
వాస్తవానికి 'దిల్' రాజుకు ఇష్టమైన హీరో పవర్ స్టార్. ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల తాను ఆర్థికంగా నిలబడ్డానని ఆయన చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయనకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ అని 'దిల్' రాజు భార్య కూడా చెప్పారు. అటువంటి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ తనకు ఇష్టమైన హీరో సినిమా విడుదలకు ముందు ఎందుకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు? అనేది చాలా మందికి అంతుబట్టడం లేదు.
ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఫోనులు చేసి థియేటర్స్ బంద్ అంశాన్ని పైకి తీసుకువచ్చారని అటు ఇండస్ట్రీ, ఇటు మీడియా వర్గాలలోని వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న కథనంలో ఉంది. దాంతో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉన్న 'దిల్' రాజు ఈ వ్యవహారం వెనక సూత్రధారి కావచ్చనేది కొందరి అనుమానం. మరి దీని నుంచి ఆయన ఎలా బయట పడతారు? తన ప్రమేయం లేదని ఎలా చెబుతారు? మెగా కుటుంబంతో తనకు ఎటువంటి గొడవలు లేవని ఎలా నిరూపిస్తారు? అనేది చూడాలి. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న ఈ పుకార్లను చూసీ చూడనట్టు వదిలేస్తారా? లేదంటే పుకార్లను లైట్ తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి అయితే థియేటర్స్ బంద్ లేదని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది.
Also Read: ప్రవస్తి ఆరాధ్య ఏమిట్లు? కాంట్రవర్సీలోనూ కులం గోల... గూగుల్ చేస్తున్న నెటిజన్లు





















