అన్వేషించండి

Varun Tej Lavanya Tripathi Marriage : విదేశాలు వెళ్ళిన వరుణ్ తేజ్ & లావణ్య - పెళ్ళికి నాలుగు రోజుల ముందు!

Varun Lavanya marriage : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి సందడి మొదలైంది. గురువారం రాత్రి కాబోయే దంపతులు ఇటలీ ప్రయాణమయ్యారు.

Varun Tej and Lavanya Tripathi marriage pics : కొణిదెల వారి కుటుంబంలో పెళ్లి  సందడి మొదలైంది. త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, 'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైన లావణ్యా త్రిపాఠి చేతిలో చెయ్యి వేసి ఏడు అడుగులు వేసే సమయం దగ్గరకు వచ్చింది. నవంబర్ 1న ఈ హీరో హీరోయిన్లు ఇద్దరూ పెళ్లి చేసుకొనున్నారు. అందుకోసం విదేశాలకు వెళ్లారు. 

ఇటలీ వెళ్ళిన వరుణ్ & లావణ్య
Varun Tej Lavanya Tripathi Wedding Date : ఇటలీలో నవంబర్ 1న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి ఇటలీకి వాళ్లిద్దరూ ప్రయాణం అయ్యారు. వారితో పాటు వరుణ్ చెల్లెలు నిహారికా కొణిదెల, కుటుంబ సభ్యులు కొందరు ఉన్నారు. 

Also Read రెండో పెళ్ళికి 'ఎస్' చెప్పిన అమలా పాల్ - వరుడు ఎవరంటే?

మెగా ప్రిన్స్ & సొట్ట బుగ్గల సుందరి వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. కొణిదెల, త్రిపాఠి, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇటలీ వెళతారు. వరుణ్ తేజ్ సన్నిహితులలో ఒకరైన యువ హీరో నితిన్, నిహారిక & లావణ్య త్రిపాఠికి సన్నిహితురాలైన రీతూ వర్మ కూడా ఈ పెళ్లికి హాజరు కానున్నారని సమాచారం. 

నవంబర్ 5న భాగ్య నగరంలో రిసెప్షన్!
పెళ్ళైన నాలుగు రోజులకు కొత్త జంట హైదరాబాద్ వస్తారు. వివాహానికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించడంతో సిటీలో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నవంబర్ 5న జరగబోయే ఆ వేడుకకు ఆల్రెడీ ఆహ్వానాలు కూడా పంపారు. కార్ పాస్ కూడా ఇవ్వడం విశేషం. 

జూన్ 9న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరిగింది. 'మిస్టర్'లో తొలిసారి వాళ్ళిద్దరూ జంటగా నటించారు. ఆ తర్వాత 'అంతరిక్షం' చేశారు. లావణ్యకు ముందు తానే ప్రపోజ్ చేసినట్లు వరుణ్ తేజ్ ఓసారి చెప్పారు. జీవితంలో సరైన సమయంలో తాను సరైన వ్యక్తిని కలిసినట్టు ఆయన పేర్కొన్నారు.

Also Read చిరంజీవి కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - ఆ పేరు సినారే ఓ పుస్తకం కూడా రాశారండోయ్

వరుణ్ తేజ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు వస్తే... 'ఆపరేషన్ వేలంటైన్' షూటింగ్ పూర్తి అయ్యింది. ఆ సినిమా డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ 50 కోట్లకు నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడు కావడం గమనార్హం. 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేయనున్న సినిమా 'మట్కా' చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget