అన్వేషించండి

Varun Tej: ‘గేమ్ ఛేంజర్’పై వరుణ్ తేజ్ ఆసక్తికర అప్డేట్ - చెర్రీ ఫ్యాన్స్ సంబరాలు

Game Changer Movie Update: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీపై తాజాగా వరుణ్ తేజ్ ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు. దీంతో చరణ్ ఫ్యాన్స్ అంతా ఖుషీ అయ్యారు.

Varun Tej about Game Changer: దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో హీరోలుగా నటించినందుకు ఎన్‌టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్‌గా మారిపోయారు. కానీ ఈ చిత్రం విడుదలయ్యి దాదాపు రెండేళ్లు అవుతున్నా.. ఈ ఇద్దరు హీరోల నుండి ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడంతో ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఉందా? ఆగిపోయిందా? అని అభిమానుల్లో కలవరం మొదలయ్యింది. తాజాగా ‘గేమ్ ఛేంజర్’పై వరుణ్ తేజ్ ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు.

రోజూ అదే అడుగుతున్నాను..

వరుణ్ తేజ్ అప్‌కమింగ్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ట్రైలర్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలయ్యింది. ట్రైలర్ విడుదలయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత మూవీ టీమ్ అంతా ఫ్యాన్స్‌తో ముచ్చటించడానికి ముందుకొచ్చింది. అదే క్రమంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ తరపున స్పెషల్ రిక్వెస్ట్ అంటూ ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ గురించి అడిగాడు ఒక అభిమాని. ‘‘నిజం చెప్పాలంటే నేను కూడా రోజూ అదే అడుగుతున్నాను. ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయ్యిందనుకుంటా. అక్కడ నుండే పొద్దున ఫోన్ చేసి మాట్లాడా. త్వరలోనే మీకు అన్ని అప్డేట్స్ చాలా స్ట్రాంగ్‌గా వస్తాయి’’ అని సమాధానమిచ్చి రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు వరుణ్ తేజ్.

నా ఫేవరెట్ కో స్టార్..

ఈ ఫ్యాన్ మీట్‌లో హీరోయిన్ మానుషీ చిల్లర్‌తో కూడా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు అభిమానులు. వరుణ్ తేజ్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది అని అడగగా.. ‘‘నాకు చాలా మంచిగా అనిపించింది. నేను చెప్పినట్టుగానే తను నా ఫేవరెట్ కో స్టార్. తను సెట్‌లో నేను చాలా సౌకర్యంగా ఫీల్ అయ్యేలా చేశాడు. నేను మొదటిసారి తెలుగు మాట్లాడుతున్నాను. ఆ విషయంలో తను నాకు చాలా సాయం చేశాడు. తనతో కలిసి నటించడం చాలా ఫన్‌గా అనిపించింది. తను పనిని చాలా సులువు కూడా చేసేస్తాడు’’ అని చెప్పుకొచ్చింది మానుషి. మిస్ వరల్డ్‌గా కిరీటం దక్కించుకున్న తర్వాత హీరోయిన్‌గా హిందీలో రెండు చిత్రాల్లో నటించింది మానుషీ. ఇక ‘ఆపరేషన్ వాలెంటైన్’తో తెలుగు కూడా డెబ్యూకు సిద్ధమయ్యింది.

ఇవే తగ్గించుకుంటే మంచిది..

ఫ్యాన్ మీట్‌లో మానుషీని సింగిలా అని అడిగినందుకు వరుణ్ తేజ్ ఒక అభిమానికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ‘‘ఇవే తగ్గించుకుంటే మంచిది’’ అని ముక్కుసూటిగా చెప్పేశాడు. ఇక ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం పలుమార్లు పోస్ట్‌పోన్ అయిన తర్వాత ఫైనల్‌గా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. బాలీవుడ్ దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్.. ఈ మూవీని డైరెక్ట్ చేశారు. నవదీప్, రుహానీ శర్మ ఇందులో ఇతర కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ తెలుగు ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేయగా.. హిందీ ట్రైలర్ సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా విడుదలయ్యింది.

Also Read: ‘ఆపరేషన్ వాలెంటైన్’ ట్రైలర్: వరుణ్‌ను చూస్తే గర్వంగా ఉందన్న రామ్ చరణ్, ఆ సీన్స్ చూస్తే సెల్యూట్ చేస్తారు

టాప్ హెడ్ లైన్స్

Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget