UV Creations: 'యూవీ క్రియేషన్స్' పేరుతో ఫేక్ ఆఫర్స్ - వార్నింగ్ ఇచ్చిన సంస్థ
UV Creations Alerts:

UV Creations Warns About Fake Offers: టాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'యువీ క్రియేషన్స్' వార్నింగ్ ఇచ్చింది. తమ సంస్థ పేరిట ఓ వ్యక్తి కొన్ని ఫేక్ ఆఫర్స్ సృష్టిస్తున్నాడని అలాంటి వాటిని నమ్మొద్దని హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన ఇచ్చింది.
అఫిషీయల్‌గా రివీల్ చేస్తాం
ఓ గుర్తు తెలియని వ్యక్తి 'యూవీ క్రియేషన్స్' ప్రతినిధి అని చెప్పుకుంటూ యాక్టర్స్, హీరోయిన్స్, వారి ప్రతినిధులను కలుస్తూ ఫ్రాడ్ ఆఫర్స్ ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సంస్థ తెలిపింది. 'UV క్రియేషన్స్‌కు సదరు వ్యక్తితో లేదో అతని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదు. మూవీస్, కాస్టింగ్‌కు సంబంధించి ఎలాంటి ప్రక్రియ అయినా మేము అధికారికంగానే రివీల్ చేస్తాం. సోషల్ మీడియా, అఫీషియల్ ఛానళ్ల ద్వారా మాత్రమే వివరాలు వెల్లడిస్తాం.
సినీ ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయినా ఎంగేజ్ అయ్యే ముందు అలర్ట్‌గా ఉండాలి. మా సంస్థకు నటీనటులు అవసరం అయితే ఇండస్ట్రీ సోర్సెస్ ద్వారా మాత్రమే షేర్ చేస్తాం. మా పేరును, బ్రాండ్‌ను దెబ్బతీసేలా వ్యవహించినా, మిస్ యూజ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.' అని పేర్కొన్నారు.
Please be cautious.. pic.twitter.com/hhyBqe3Qwm
— UV Creations (@UV_Creations) July 3, 2025
Also Read: మూవీ టైటిల్ మార్చగలమా? - అనుపమ సినిమాకు మెలిక పెట్టిన సెన్సార్... ఆగ్రహం వ్యక్తం చేసిన డైరెక్టర్
యూవీ క్రియేషన్స్ సంస్థ టాలీవుడ్‌కు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించింది. దాదాపు పదేళ్ల కిందట వంశీ, ప్రమోద్, విక్కీ ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 2013లో వచ్చిన ప్రభాస్ 'మిర్చి' మూవీతో ఈ బ్యానర్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. రెబల్ స్టార్‌తో సాహో, రాధే శ్యామ్ వంటి భారీ మూవీస్ నిర్మించింది ఈ సంస్థ. దీంతో ప్రభాస్ హోం బ్యానర్ అనే పేరు ఈ సంస్థకు వచ్చింది. మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, భాగమతి, ఎక్స్ ప్రెస్ రాజా వంటి మూవీస్ కూడా రూపొందించారు.
అలాగే, యూవీ కాన్సెప్ట్ అనే పేరుతో మరో బ్యానర్ స్టార్ట్ చేసి చిన్న సినిమాలను సైతం నిర్మించారు. ఇందులో 'ఏక్ మినీ కథ' అనే హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. లేటెస్ట్‌గా అనుష్కతో 'ఘాటి' మూవీ నిర్మిస్తుండగా... మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర'ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు 'బింబిసార' ఫేం వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు.
స్టార్ హీరోయిన్ అనుష్క లేడీ ఓరియెంటెడ్ మూవీ 'ఘాటి'కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ నెల 11న రిలీజ్ చేయనున్నారు. ఇక మెగాస్టార్ 'విశ్వంభర' విషయానికొస్తే ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మూవీ రిలీజ్‌పై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆగస్టులో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.






















