నేను ఎవరికీ భయపడను, మీ సపోర్ట్ నాకు అక్కర్లేదు - దర్శకుడు హరీష్ శంకర్ కౌంటర్
దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్లో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో బూతులు పెడుతున్నాడని ఓ మీడియా సంస్థ ట్వీట్ చేయగా, ఆ ట్వీట్ కి హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పందించారు.
టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరియర్ స్టార్టింగ్ లో పలు సూపర్ హిట్ సినిమాలను తీసిన ఈయన పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్' సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ సినిమాతో దర్శకుడిగా స్టార్ స్టేటస్ అందుకున్నాడు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న పవర్ స్టార్ కి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి ఆయన ఫ్యాన్స్ కి దేవుడు అయిపోయాడు. ఇక 'గబ్బర్ సింగ్' తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ తో ఇన్నేళ్ల తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే.
ముఖ్యంగా ట్విట్టర్లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయానికి స్పందిస్తూ ఉంటారు. ప్రతి సినిమా గురించి ట్వీట్స్ చేస్తారు. అయితే సోషల్ మీడియాలో హరీష్ శంకర్ ని విమర్శించే వాళ్ళు, తిట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటికే కొంతమంది నెటిజన్లు హరీష్ శంకర్ ని బూతులు తిడుతూ మరి ట్వీట్స్ చేస్తుండటంతో ఆ మధ్య అలాంటి వాళ్ళని బ్లాక్ చేశాడు. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తేరి మూవీకి రీమేక్ అని వార్తలు వచ్చినప్పుడు రీమేక్ వద్దని పవన్ ఫ్యాన్స్ కొంతమంది హరీష్ ని బూతులు తిడుతూ ట్యాగ్ చేసి ట్వీట్ చేయడంతో వాళ్ళని కూడా బ్లాక్ చేశాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తనని టార్గెట్ చేసే నెటిజన్స్ కి ఎప్పటికప్పుడు కౌంటర్లు కూడా ఇస్తూ ఉంటాడు హరీష్ శంకర్.
ఈ నేపథ్యంలోనే తాజాగా హరిష్ శంకర్ ట్విట్టర్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి బూతులు పెడుతున్నాడని, చాలా రోజుల నుంచి ఈ ఫేక్ అకౌంట్ ద్వారా తనను టార్గెట్ చేసిన వాళ్లపై బూతులు తిడుతున్నాడని, ఆ విషయం ఇప్పుడు రివీల్ అయిందని ఓ మీడియా సంస్థ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ పై హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పందించారు. "ఎక్స్ క్యూజ్ మీ.. నేను ఎవరికీ భయపడను సార్. అనాలనుకున్నప్పుడు నా అకౌంట్ లోనే పోస్ట్ చేస్తా, ఇంకో అకౌంట్ నాకు అక్కర్లేదు. వాళ్లు నన్ను సమర్థించినా నేను పరుష పదజాలాన్ని ప్రోత్సహించను. దయచేసి ఇలాంటి అర్థం లేని మాటలు ఆపండి. ఇలాంటి విషయాల్లో మీ మద్దతు నాకు అవసరం లేదు" అంటూ తన ట్వీట్ లో రాస్కొచ్చారు.
Excuse me first of all nenu evariki bhayapanu sir …. analakunnappudu naa acc lone post chestaa inko acc naaku akkarledu.. having said that i don’t encourage foul language even if they use to defend me… i wont encourage!!!
— Harish Shankar .S (@harish2you) September 20, 2023
Guys pls stop this nonsense i dont need ur support if… https://t.co/z19z3DP5bU
దీంతో హరీష్ శంకర్ చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ట్వీట్ కంటే ముందు ఓ నెటిజన్ హరీష్ శంకర్ ని 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్ 50% కంప్లీట్ అయింది అంట కదా అన్నా, ఇంకా క్వాలిటీ ఆ! దేవుడి మీద భారం వేసాం' అని ట్వీట్ చేస్తే.. "అంతే కదా తమ్ముడు అంతకుమించి నువ్వు ఏం చేయగలవు చెప్పు? ఈ లోగా కాస్త స్టడీస్, జాబ్, కెరియర్ మీద ఫోకస్ పెట్టు. వాటిని మాత్రం దేవుడికి వదిలేయకు, ఆల్ ది బెస్ట్" అని ఆ నెటిజన్ కి హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Also Read : ఓంకార్ హారర్ వెబ్ సిరీస్ 'మాన్షన్ 24'లో సత్యరాజ్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial