Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ వర్క్స్ షురూ... త్వరలో పవన్ కళ్యాణ్ కూడా!
Ustaad Bhagat Singh Latest Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. శుభ ముహూర్తంలో డబ్బింగ్ పనులు ప్రారంభించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందిన తాజా సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). తెలుగు సినీ ప్రియులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రమిది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటి? అంటే... సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు. ముందుగా శుభ ముహూర్తంలో డబ్బింగ్ పనులు ప్రారంభించారు.
త్వరలో పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతారు!
పవన్ కళ్యాణ్ త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొంటారని 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం ఇతర ఆర్టిస్టుల డబ్బింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు హరీష్ శంకర్.
హరీష్ శంకర్ అంటే పంచ్ డైలాగులకు పెట్టింది పేరు. మాస్ మెచ్చే సంభాషణలు రాయడంలో ఆయన దిట్ట. అందుకే పవన్ అభిమానులు ముద్దుగా 'కల్ట్ కెప్టెన్' అని పిలుస్తున్నారు. అందుకు తగ్గట్టుగా 'ఉస్తాద్ భగత్ సింగ్'ను కల్ట్ సినిమాగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు.
#UstaadBhagatSingh dubbing begins on an auspicious note ✨
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) January 27, 2026
Get ready for the POWERFUL DIALOGUES penned by our CULT CAPTAIN 🔥🔥
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna @ThisIsDSP @rparthiepan @DoP_Bose #AnandSai @Venupro @MythriOfficial @SonyMusicSouth… pic.twitter.com/wwvWeyXKVv
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి రాజీ పడకుండా భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Also Read: మొగుడా? పెళ్ళామా? భార్యగా సమంత... భర్తగా విశాల్... ఇద్దరు చేస్తున్న పని ఒక్కటేనా?
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన 'దేఖ్ లేంగే సాలా' పాట చార్ట్ బస్టర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా నటించిన ఈ చిత్రానికి రచన - దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్, నిర్మాతలు: నవీన్ యెర్నేని - రవి శంకర్ యలమంచిలి, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, కథనం: కె. దశరథ్ - రమేష్ రెడ్డి, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ - చంద్ర మోహన్, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: ఆనంద్ సాయి, సీఈఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు: ఆర్. చంద్రశేఖర్ - దినేష్ నరసింహన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పై, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్ & నబకాంత్ - పృథ్వీ.





















