అన్వేషించండి

Upasana Konidela: నాకు, క్లిన్ కారాకు మధ్య కామన్‌గా ఉంది ఏంటి? చిరంజీవికి కోడలు ఉపాసన చిక్కు ప్రశ్న- మెగాస్టార్ జవాబు ఇదే

Upasana Konidela: మెగాస్టార్ చిరంజీవికి దక్కిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని తీసుకోవడం కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఈవెంట్ మొదలయ్యే ముందు ఏం జరిగిందో ఫన్నీ వీడియోను షేర్ చేశారు ఉపాసన.

Upasana Konidela: తెలుగు సినిమాను ఉన్నత స్థాయికి చేర్చిన నటుల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఇన్నేళ్లుగా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి ఆయన అందించిన సేవలను గుర్తుచేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్‌ను ప్రకటించింది. మే 9న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. పద్మవిభూషణ్‌ను అందుకోవడం కోసం తమ కుటుంబ సభ్యులందరినీ ఢిల్లీకి తీసుకెళ్లారు చిరంజీవి. రామ్ చరణ్, ఉపాసన, సుష్మిత, సురేఖ, చిరంజీవి ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఉపాసన.

ఇద్దరి తాతయ్యలు పద్మవిభూషణులు..

మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డ్ అందడం మెగా ఫ్యామిలీ మొత్తాన్ని గర్వపరిచే విషయం. అందుకే కుటుంబ సమేతంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడానికి వెళ్లారు చిరు. ఈవెంట్ మొదలయ్యే ముందు చిరంజీవితో కలిసి ఫన్ క్రియేట్ చేశారు ఉపాసన. ఆయనను ప్రశ్నలు అడుగుతూ వాటికి ఫన్నీగా సమాధానాలు ఇచ్చారు. ఆ వీడియోను మొత్తం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ముందుగా ‘‘నాకు, క్లిన్ కారాకు మధ్య కామన్‌గా ఉంది ఏంటి?’’ అని అడిగారు ఉపాసన. ‘‘క్లిన్ కారా.. నీకు మరో రూపం’’ అని చిరంజీవి సమాధానమివ్వగా.. ‘‘లేదు మావయ్య. మా ఇద్దరి తాతయ్యలు పద్మవిభూషణ్ అందుకున్నారు’’ అని ఉపాసన చెప్పగానే చిరు నవ్వారు.

ఇదే పెద్ద అవార్డ్..

ఉపాసన కొణిదెల తాతయ్య అయిన ప్రతాప్ సీ రెడ్డి కూడా మెడికల్ రంగంలో చేసిన సేవలకు పద్మవిభూషణ్ అందుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా పద్మవిభూషణ్ అందుకున్నారు. ఇది ఉద్దేశించి మెగాస్టార్‌ను ఆ ప్రశ్న అడిగారు ఉపాసన. ఇక ఈ వీడియోలో రామ్ చరణ్ కూడా ఉన్నారు. ‘‘ఏం మాట్లాడుకుంటున్నారు’’ అంటూ ఉపాసన, చిరంజీవిని అడుగుతూ ఫాలోవర్స్‌కు హాయ్ కూడా చెప్పారు. ఈవెంట్ కోసం రెడీ అవుతున్న చిరంజీవిని.. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటూ ఉపాసన అడిగారు. ‘‘ఇంత మంచి కోడలు క్లిన్ కారాను ఇచ్చిన తర్వాతే ఇదే నాకు పెద్ద అవార్డ్’’ అని సమాధానమిచ్చారు చిరంజీవి.

సోషల్ మీడియాలో యాక్టివ్..

ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీకి ఉపాసన చాలా క్లోజ్. ఈ విషయం పలు సందర్భాల్లో బయటపడింది కూడా. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ఉపాసన.. అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాలను, కుటుంబంలో జరిగే స్పెషల్ సందర్భాలను, ఈవెంట్స్‌ను షేర్ చేస్తూ ఉంటారు. అలాగే రామ్ చరణ్, ఉపాసన కలిసి చిరంజీవి పద్మవిభూషణ్ అందుకున్న మూమెంట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఉపాసన కంటే రామ్ చరణ్ ముందుగా పోస్ట్ చేశాడని ‘టైమ్‌కు పోస్ట్ చేశావు’ అంటూ ఫన్నీగా కామెంట్ కూడా పెట్టారు ఉపాసన.

Also Read: ఫాంటసీ ప్రపంచంలో విహరిస్తున్న టాలీవుడ్ హీరోలు - సరికొత్త అనుభూతిని పంచబోతున్న సినిమాలు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget