అన్వేషించండి

Athammas Kitchen: అత్తమ్మ కిచెన్ - మార్కెట్‌లోకి చిరు సతీమణి సురేఖ రెసిపీలు

Chiranjeevi Wife Surekha: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ హోమ్ మేడ్ రెసిపీలతో ప్రొడక్ట్స్ తయారు చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. కానీ అది చేసింది చిరంజీవి కాదు.. మెగా కోడలు ఉపాసన.

Surekha Konidela: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే ఆయన సోషల్ మీడియాలో ఒక కవితతో విషెస్ తెలిపారు. చిరంజీవి మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీ అంతా సురేఖను విష్ చేయడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఉపాసన కొణిదెల.. తన కొత్త బిజినెస్ గురించి ప్రకటించారు. ‘అత్తమ్మ కిచెన్’ అనే పేరుతో తన అత్త సురేఖ రెసిపీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. దానికి సంబంధించిన గ్లింప్స్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసి, అసలు ‘అత్తమ్మ కిచెన్’ అంటే ఏంటో వివరించారు ఉపాసన కొణిదెల.

అత్తపై ప్రేమను చాటుకున్న కోడలు..

ఉపాసన కొణిదెల.. ఒక బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చారు. తన కుటుంబం నడిచిన బాటలోనే తాను కూడా నడిచి సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్ అయ్యారు. ఇప్పటికే ఎన్నో వ్యాపారాలలో సక్సెస్ సాధించిన ఉపాసన.. ఇప్పుడు కొత్తగా కిచెన్‌కు సంబంధించిన బిజినెస్‌లోకి అడుగుపెట్టనున్నారు. అది కూడా తన అత్త కిచెన్ రెసిపీలను ఆధారంగా చేసుకొని బిజినెస్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే తన అత్త సురేఖతో తన అనుబంధం ఎలా ఉంటుందో పలుమార్లు బయటపెట్టారు. ఇక తాజాగా సురేఖ పుట్టినరోజు సందర్భంగా ‘అత్తమ్మ కిచెన్’ అనే వెంచర్‌ను లాంచ్ చేసి మరోసారి అత్తపై ప్రేమను చాటుకున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

ఇన్‌స్టంట్‌ వంటకాల కోసం..

సురేఖ కొణిదెల వంటకాలంటే మెగా ఫ్యామిలీని అందరికీ ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. చిరంజీవి ఫారిన్ ట్రిప్స్‌కు వెళ్లినప్పుడు కూడా సురేఖ చేసిన ఆహారాన్ని వెంట తీసుకొని వెళ్తానని కూడా పలుమార్లు బయటపెట్టారు. ఇంటి నుండి దూరంగా ఉన్నా కూడా హోమ్ ఫుడ్ అనేది వారిని ఒక్క దగ్గర ఉన్నట్టు ఫీల్ అయ్యేలా చేస్తుందన్నదే సురేఖ ఫార్ములా. తన వంటకాలలో ఒక ట్రెడీషన్ ఉంటుందని కూడా మెగా ఫ్యామిలీ అంటుంటారు. ఇప్పటికే ‘అత్తమ్మ కిచెన్’ గురించి రామ్ చరణ్ హింట్ ఇచ్చారు. ఇప్పుడు సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఇది లాంచ్ అయ్యి అందరి ముందుకు వచ్చింది. కొణిదెల ఇంట్లో చేసే ఎన్నో వంటకాలను ‘అత్తమ్మ కిచెన్’ అనే పేరుతో పులిహోర, రసం, ఉప్మాలాంటివి ఇన్‌స్టంట్‌గా చేసుకోవడానికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి.

అందుకే స్పెషల్..

‘అత్తమ్మ కిచెన్’ ప్రొడక్ట్స్‌ను సోషల్ మీడియా నుండి మాత్రమే కాకుండా వెబ్‌సైట్ నుండి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన సమాచారాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఉపాసన. ఇక అత్త సురేఖకు ఉపాసన ఇచ్చిన ఈ స్పెషల్ గిఫ్ట్‌ను చూసి ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఇన్‌స్టంట్ ప్రొడక్ట్స్ అనేవి మార్కెట్లో ఎన్నో ఉన్నా.. స్పెషల్‌గా సురేఖ కొణిదెల రెసిపీలతో తయారు చేశారు కాబట్టి ‘అత్తమ్మ కిచెన్’ ప్రొడక్ట్స్ మరింత స్పెషల్‌గా ఉంటాయని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఉపాసన వేసిన ఈ ముందడుగుతో మెగా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు సమాచారం.

Also Read: సాయి ధరమ్ తేజ్ ‘గాంజా శంకర్’ టీమ్‌కు నోటీసులు - చట్టపరమైన చర్యలు తప్పవంటూ వార్నింగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
Golbal Star Ram Charan : అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
Posani Krishna Murali: సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Embed widget