Uorfi Javed: షారుఖ్ ఖాన్‌తో ఉర్ఫీ సెల్పీ - ఊహించని ట్విస్ట్, ఇలా కూడా చెయ్యొచ్చా?
Uorfi Javed: వెరైటీ డ్రెస్సులతో బాలీవుడ్‌లో తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకుంది ఉర్ఫీ జావేద్. ఇక తాజాగా ఈ భామ షారుఖ్ ఖాన్‌ను కలిశానంటూ ఒక సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Uorfi Javed Selfie With Shah Rukh Khan: కొందరు సెలబ్రిటీల ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తాయి. అందులో తాజాగా ఉర్ఫీ జావేద్, షారుఖ్ ఖాన్ కలిసి దిగిన సెల్ఫీ కూడా ఒకటి. ‘నా ఫెవరెట్’ను కలిశాను షారుఖ్‌తో సెల్ఫీని షేర్ చేసింది ఉర్ఫీ. దీంతో వెంటనే ఈ సెల్ఫీ.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలామంది ఉర్ఫీ చేసిన ప్రాంక్‌ను నిజం అనుకున్నారు. కానీ కొందరు మాత్రం ఇది ఫేక్ అని కనిపెట్టేశారు. ఈ ఫేక్ సెల్ఫీ పోస్ట్‌తో మరోసారి ఉర్ఫీ జావేద్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం అసలు ఉర్ఫీ ఇలా ఎలా చేసిందంటూ కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఉర్ఫీ ప్రాంక్..
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను ఒక్కసారి అయినా కలవాలని చాలామంది సెలబ్రిటీలకు కోరిక ఉంటుంది. అలాగే ఉర్ఫీకి కూడా ఉందని, ఫైనల్‌గా తన ఫేవరెట్ హీరోను కలిసిందని నెటిజన్లు అనుకున్నారు. కానీ ఒక సోషల్ మీడియాలో యాప్‌లో ఇది ఫిల్టర్ అని కనిపెట్టిన వారు దీనికి ఫేక్ సెల్ఫీ అని ట్యాగ్ ఇచ్చారు. అయితే ఉర్ఫీ.. ఒక ప్రాంక్ చేసిందని, దానిని చాలామంది నిజమని నమ్మేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. బాలీవుడ్‌లో ఉర్ఫీ జావేద్.. సినిమాలు ఏమీ చేయలేదు. కానీ తన గురించి ప్రేక్షకులతో పాటు ఫేమస్ సెలబ్రిటీలకు కూడా తెలుసు. తనకంటూ ఒక స్పెషల్ మార్క్‌ను క్రియేట్ చేసుకుంది.
నిరంతరం వార్తల్లో..
కొత్త కొత్త స్టైల్‌లో డ్రెస్సులు వేసుకుంటూ నెటిజన్లు ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది ఉర్ఫీ జావేద్. అసలు తను వేసుకునే దుస్తులు.. మరెవరూ ట్రై కూడా చేయలేరు అనే విధంగా ఉంటాయి. అలాంటి దుస్తులతో పబ్లిక్ ఈవెంట్స్‌కు కూడా హాజరు అవ్వడంతో అసలు ఉర్ఫీ ఎవరు అని బాలీవుడ్‌లో చర్చ మొదలయ్యింది. మెల్లగా ఆమె పేరు ఫేమస్ అయ్యింది. అంతే కాకుండా అప్పుడప్పుడు బాలీవుడ్ స్టార్లపై కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా చేయడం వల్ల ఉర్పీ వార్తల్లోకెక్కింది. తరచుగా ఎవరో ఒక బాలీవుడ్ స్టార్‌ను ఏదో ఒకటి అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంది ఈ భామ. ఇప్పుడు అదే విధంగా షారుఖ్‌తో సెల్ఫీ అంటూ ప్రాంక్ ప్లే చేసింది.
వెండితెరపై ఎంట్రీ..
వెరైటీ డ్రెస్సులతో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఉర్పీ జావేద్.. ఇప్పుడు వెండితెరపైకి అడుగు పెట్టడానికి సిద్ధమయ్యింది. దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘LSD 2’లో కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే చిత్ర నిర్మాతలు ఆమెను సంప్రదించగా, తను కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఆమె లీడ్ రోల్‌కు సరిగ్గా సరిపోతుందని మేకర్స్ మాత్రమే కాదు ఈ వార్త విన్న ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. మొత్తంగా ఇంతకాలం బుల్లితెరపై, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఉర్ఫీ.. ఈ సినిమాతో వెండితెర పైనా సత్తా చాటడానికి రెడీ అయ్యింది. ఏక్తా కపూర్ నిర్మాతగా 2010లో విడుదలయిన ‘LSD’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కనుంది. ఇందులో రాజ్ కుమార్ రావు, నేహా చౌహాన్, అన్షుమాన్ ఝా, నుష్రత్ భరుచ్చా కీలక పాత్రలు పోషించారు. ALT ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఏక్తా కపూర్, శోభా కపూర్, ప్రియా శ్రీధరన్ సంయుక్తంగా నిర్మించారు.
Also Read: వంటలక్కకు నిజంగా వంట వచ్చా? డాక్టర్ బాబుపై ప్రేమి విశ్వనాథ్ సీరియస్ - ఇది ఊహించలేదు అక్కో!