Marco Sequel: మోస్ట్ వయలెంట్ హిట్ మూవీ 'మార్కో'కు సీక్వెల్ - ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరో
Unni Mukundan: మలయాళం బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'మార్కో'. 'ఈ మూవీ సీక్వెల్ ఎప్పుడు వస్తుంది' అన్న ప్రశ్నకు హీరో ఉన్ని ముకుందన్ సోషల్ మీడియా వేదికగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

Unni Mukundan About Marco Sequel: మలయాళ స్టార్ ఉన్న ముకుందన్ హీరోగా వచ్చిన రీసెంట్ మోస్ట్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'మార్కో'. గతేడాది డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు రూ.100 కోట్లు వసూళ్లు సాధించింది.
సీక్వెల్‌పై క్లారిటీ
ఈ మూవీ సీక్వెల్ వస్తుందంటూ గతంలోనే పలు రూమర్స్ వచ్చాయి. తాజాగా.. దీనిపై హీరో ఉన్ని ముకుందన్ కీలక ప్రకటన చేశారు. 'మార్కో 2' ఎప్పుడు వస్తుందంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ఈ సినిమాకు సీక్వెల్ చేయడం లేదని.. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆపేసినట్లు చెప్పారు. 'సారీ.. 'మార్కో'కు కొనసాగింపుగా పలు ప్రాజెక్టులు చేయాలనే ఆలోచనను విరమించుకున్నా. ఆ ప్రాజెక్టుపై ఎంతో వ్యతిరేకత వచ్చిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ మూవీ కంటే భారీ, ఉత్తమ చిత్రాలను మీకు అందించడం కోసం ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంటా.' అని స్పష్టం చేశారు.
అయితే, యాక్షన్ థ్రిల్లర్‌గా 'మార్కో' మూవీ తెరకెక్కగా.. వయలెన్స్ ఎక్కువగా ఉందంటూ అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. తెలుగులోనూ ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. మరోవైపు.. 'మార్కో' వయలెన్స్ విమర్శలపై గతంలోనే ముకుందన్ స్పందించారు. తాము అనుకున్న దానిలో కేవలం 30 శాతాన్ని మాత్రమే స్క్రీన్‌పై తీసుకు రాగలిగామని.. హింసను ఎంకరేజ్ చేయాలనుకోవడం లేదని అన్నారు. 'ప్రస్తుతం సినిమాల్లో హింస, యాక్షన్ భాగమైపోయింది. ఆడియన్స్ కూడా యాక్షన్ తరహా చిత్రాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.' అంటూ చెప్పారు.
Also Read: ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీ నుంచి బిగ్ సర్‌ప్రైజ్ - టీజర్ గ్లింప్స్.. రెబల్ వైబ్ కోసం వెయిటింగ్
ఈ మూవీకి హనీఫ్ దర్శకత్వం వహించగా.. ఉన్ని ముకుందన్‌తో పాటు సిద్ధిక్ జార్జ్, జగదీష్, అన్సన్ పాల్, యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా మలయాళం రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే.. సినిమాలో మితి మీరిన హింస ఉందని.. బ్యాన్ చేయాలనే వాదన కూడా సోషల్ మీడియాలో సాగింది. ప్రస్తుతం 'సోనీ లివ్'లో ఈ మూవీ అందుబాటులో ఉంది. 'అమెజాన్ ప్రైమ్' వీడియోలో 'హిందీ'లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఉన్ని ముకుందన్ మలయాళంలోనే కాకుండా తెలుగులోనూ జనతా గ్యారేజ్, భాగమతి చిత్రాలతో టాలీవుడ్ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. 'మార్కో'తో స్టార్ రేంజ్‌కు ఎదిగారు. ఓ పెద్ద కుటుంబం మార్కో (ఉన్ని ముకుందన్)ను పెంచుకుంటుంది. వారసత్వం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా.. ఇంటికి పెద్ద కొడుకైన జార్జ్ (సిద్ధిఖ్) తన సొంత తమ్ముడు విక్టర్‌తో సమానంగా మార్కోని కూడా చూసుకుంటాడు. అంధుడైన విక్టర్‌కు కూడా మార్కో అంటే ప్రాణం. అలాంటి విక్టర్‌ను కొందరు దాడి చేసి చంపేస్తారు. అసలు అతన్ని ఎవరు చంపారు?, హంతకులను మార్కో ఏం చేశాడు? అనేదే స్టోరీ.





















