By: ABP Desam | Updated at : 01 Mar 2022 06:55 PM (IST)
ఉదయ్ శంకర్, జెన్నిఫర్ ఇమ్మానుయేల్
యువ హీరో ఉదయ్ శంకర్ చేసిన సినిమాల సంఖ్య తక్కువే. అయితే... కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 'ఆటగదరా శివ', 'మిస్ మ్యాచ్' సినిమాలు చేసిన ఆయన... ఇప్పుడు విశాఖలో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నారు.
ఉదయ్ శంకర్ కథానాయకుడిగా గురు పవన్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. శ్రీరామ్ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి నారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో జెన్నిఫర్ ఇమ్మానుయేల్ కథానాయిక. ప్రస్తుతం విశాఖలో చిత్రీకరణ చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు వచ్చే సంక్రాంతి పెద్ద పండగే - 'ఆదిపురుష్' రిలీజ్ డేట్ వచ్చేసింది
ఫస్ట్ లుక్ చూస్తే... గత సినిమాలకు, ఈ సినిమాకు లుక్స్ పరంగా ఉదయ్ శంకర్ లో మార్పు కనిపించింది. యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాడు. ఫస్ట్ లుక్‌లో అతడితో పాటు నటుడు మధునందన్, హీరోయిన్ జెన్నిఫర్ ఉన్నారు. ఇదొక కమర్షియల్ థ్రిల్లర్ అని, అందమైన ప్రేమకథ కూడా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు.
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో గురు పవన్ పని చేశారు. ఈ సినిమాలో పూరి శైలి సన్నివేశాలు ఉంటాయో? లేదో? త్వరలో తెలుస్తుంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి వీవీ వినాయక్ హాజరయ్యారు.
పృథ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల పోషిస్తున్న ఈ సినిమాలో కథ, కథనాలు సరికొత్తగా ఉంటాయని... ప్రేక్షకులకు సినిమా కొత్త అనుభూతి ఇస్తుందని యూనిట్ అంటోంది. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధం మనోహర్, సంగీతం: గిఫ్టన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ మున్ద్రు.
Also Read: ఇసుక మాఫియాను టార్గెట్ చేసిన రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'?
Sending Happy #Mahashivratri wishes to everyone from #SriRamArts @UdayShankar4 #ProductionNo1 Team @AtluriNRao producer. directed by @GuruDepuru💐Shoot in Progress.@veerapanenisc @gskmedia pic.twitter.com/7NmYSqVuJZ
— GSK Media (@GskMedia_PR) March 1, 2022
Sensational director #VVVinayak launched 🎬hero @UsUday19 's upcoming thriller in @GuruDepuru's direction.
— GSK Media (@GskMedia_PR) February 10, 2022
Guruji #Sriram, #NallamalupuBujji attended the event as guests.@AtluriNRao @veerapanenisiva pic.twitter.com/FUtEZRA3C9
Animal Deleted Scene: ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ‘యానిమల్’ డిలీటెడ్ సీన్ - ఎందుకు డిలీట్ చేశారంటూ వాపోతున్న ఫ్యాన్స్!
Bobby Deol: కలలా అనిపిస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకున్న ‘యానిమల్’ విలన్ బాబీడియోల్
Trisha: ‘యానిమల్’ చిత్రానికి త్రిష షాకింగ్ రివ్యూ - నెటిజన్స్ ట్రోల్ చేయడంతో..
Santosham Film Awards: 'సంతోషం' అవార్డుల్లో కన్నడ స్టార్స్‌కు అవమానం - కొండేటిపై గరం గరం
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
DK Shiva Kumar: పార్క్ హయాత్‌లో డీకే శివకుమార్ కీలక భేటీలు, సీఎల్పీకి ముందే ఉత్కంఠ!
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
JC Prabhakar Reddy: తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు
CLP Meeting News: గచ్చిబౌలిలో సీఎల్పీ మీటింగ్, సీఎం ఎంపికపై ఉత్కంఠ, ప్రమాణ స్వీకారం నేడే ఉంటుందా?
/body>