Nani Sujeeth Movie : నాని సరసన 'స్పిరిట్' బ్యూటీ? - టాలీవుడ్ ఎంట్రీ మూవీ అదేనా!
Nani : నేచరల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ 'ఓజీ' డైరెక్టర్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఆసక్తికరంగా మారగా... బాలీవుడ్ బ్యూటీని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Tripti Dimri Likely To Female Lead In Nani Sujeeth Movie : నేచరల్ స్టార్ నాని ప్రస్తుతం 'ది ప్యారడైజ్'తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా త్వరలోనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది. మరోవైపు... 'ఓజీ' డైరెక్టర్ సుజీత్‌తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. గతేడాది పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభం కాగా... త్వరలోనే షూటింగ్ ప్రారంభించే ఛాన్స్ ఉంది.
నాని సరసన బాలీవుడ్ బ్యూటీ
ఈ మూవీలో నాని సరసన హీరోయిన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్తున్న త్రిప్తి... సందీప్ రెడ్డి వంగా 'యానిమల్'తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ప్రభాస్ 'స్పిరిట్'లోనూ హీరోయిన్‌గా చేస్తున్నారు.
అయితే, ఈ మూవీలో ఆమెనే మెయిన్ హీరోయినా లేదా సెకండ్ హీరోయినా అనేది క్లారిటీ లేదు. ఒకవేళ నాని సినిమాలో త్రిప్తి డిమ్రినే హీరోయిన్ అనేది ఫిక్స్ అయితే అమెకు హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ మూవీ ఇదే అవుతుంది. మరి దీనిపై 'ది ప్యారడైజ్' టీం అఫీషియల్‌గా రియాక్ట్ కావాల్సి ఉంది. ఈ మూవీకి 'బ్లడీ రోమియో' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
Also Read : 'కోర్ట్' జంట ఎనర్జిటిక్ స్టెప్పులు - రాము రాథోడ్ వాయిస్... ట్రెండింగ్ లిరిక్స్ చూశారా?
నాని బర్త్ డే రోజున
మరోవైపు, నాని బర్త్ డే రోజున 'ది ప్యారడైజ్' నుంచి బిగ్ సర్‌ప్రైజ్ రానుంది. ఈ మూవీకి దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా... అనౌన్స్‌మెంట్ వీడియోతోనే బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది. జడల్‌గా నాని లుక్ వేరే లెవల్‌లో ఉంది. పాన్ ఇండియా స్థాయిలో పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రాబోతోన్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ 'ఆయా షేర్' ఈ నెల 24న రిలీజ్ చేయనున్నారు. వందల మంది డ్యాన్సర్లతో రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌లో ఈ పాట షూటింగ్ ఇటీవలే పూర్తైంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా... సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
ఈ మూవీలో 'శికంజి మాలిక్'గా మోహన్ బాబు కనిపించనుండగా... బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జ్యుయెల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నాని ఫ్రెండ్ బిర్యానీ పాత్రలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 26నే సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా... అనుకోని కారణాలతో వాయిదా పడింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ ఇలా 8 భాషల్లో రిలీజ్ కానుంది.
























