Thippukuntannav Song Lyrics : 'కోర్ట్' జంట ఎనర్జిటిక్ స్టెప్పులు - రాము రాథోడ్ వాయిస్... ట్రెండింగ్ లిరిక్స్ చూశారా?
Band Melam Songs : కోర్ట్ జంట హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించిన 'బ్యాండ్ మేళం' మూవీ నుంచి ఎనర్జిటిక్ సాంగ్ వచ్చేసింది. జానపదం టచ్ చేసేలా ఎనర్జిటిక్ స్టెప్పులతో ట్రెండింగ్ లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

Harsh Roshan's Band Melam Thippukuntannav Song Telugu Lyrics : 'కోర్ట్' మూవీతో బిగ్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో హర్ష్ రోషన్, హీరోయిన్ శ్రీదేవి మరోసారి జంటగా నటించిన విలేజ్ లవ్ ఎంటర్టైనర్ 'బ్యాండ్ మేళం'. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఎనర్జిటిక్ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో రోషన్, శ్రీదేవి ఎనర్జిటిక్ స్టెప్పులేశారు.
బిగ్ బాస్ ఫేం, ఫేమస్ ఫోక్ సింగర్ రాము రాథోడ్ సాంగ్‌లో సందడి చేశారు. ఈ పాటకు ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ రాయగా... రాము రాథోడ్, అదితి భావరాజు పాడారు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించగా... వెంకటేశ్ కాపు కొరియోగ్రఫీ చేశారు. ఈ ట్రెండింగ్ లిరిక్స్ మీ కోసం...
పల్లవి
బెల్లం చుట్టూ ఈగ లెక్క... మంచం చుట్టూ దోమ లెక్క..
బెల్లం చుట్టూ ఈగ లెక్క... మంచం చుట్టూ దోమ లెక్క..
గుడి చుట్టూ భక్తుని లెక్క... బారు చుట్టూ తాగుబోతు లెక్క...
తిప్పుకుంటాన్నవ్... తిప్పుకుంటాన్నవ్... నన్నే నీ చుట్టూ తిప్పుకుంటాన్నవ్
యహె... తిప్పుకుంటాన్నవ్... తిప్పుకుంటాన్నవ్... నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పేస్కుంటాన్నవ్
చరణం 1
పచ్చని లంగా చుట్టి... ఎర్రెర్రని వోణీ వేసి
చెవులకు కమ్మలు పెట్టి... అరె కాళ్లకు పట్టీలు కట్టి
పచ్చని లంగా చుట్టి... ఎర్రెర్రని వోణీ వేసి
చెవులకు కమ్మలు పెట్టి... అరె కాళ్లకు పట్టీలు కట్టి
అరె కొబ్బరి కాయ బుట్ట పట్టుకుని కోవెలకే నువ్వు పోతూ..
నా తలకాయలో గత్తర లేపి గాబరా నన్నే చేస్తూ
సూర్యుని చుట్టూ భూమి లెక్క... పైసల చుట్టూ మనుషులు లెక్క...
తిప్పు అరె తిప్పు అబ్బ తిప్పుకుంటాన్నావ్.. తిపు తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పు తిప్పుకుంటాన్నవ్... అరె తిప్పుకుంటాన్నవ్
తిప్పుకుంటాన్నవ్ నన్నే నీ ఎనక తిప్పు తిప్పు తిప్పేస్కుంటాన్నవ్...
చరణం 2
కళ్లే ఎగరేస్తుంటావ్... ఇంతలో పళ్లే నూరుతు ఉంటావ్
అల్లరి చేస్తూ ఉంటావ్... అంతలో చల్లని మాటలు చెబుతావ్...
కళ్లే ఎగరేస్తుంటావ్... ఇంతలో పళ్లే నూరుతు ఉంటావ్
అల్లరి చేస్తూ ఉంటావ్... అంతలో చల్లని మాటలు చెబుతావ్...
అందరి కంటే చిన్న మొల్లిలా అలిగి నువ్వు కూర్సుంటావ్...
సందే దొరికితే పెద్ద మనిషిలా పెత్తనమే చేస్తుంటావ్...
ఎన్నో ఎన్నో వేషాలేషి దీపం చుట్టూ పురుగులు చేసి...
తిప్పు... ఏం తిప్పుతున్నావే...
తిప్పుకుంటాన్నవ్... తిప్పుకుంటాన్నవ్...
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పు తిప్పుకుంటాన్నవ్...
తిప్పుకుంటాన్నవ్ నన్నే నీ ఎనక తిప్పు తిప్పు తిప్పేస్కుంటాన్నవ్...
చరణం 3
కోడి చుట్టూ గద్ద లెక్క... చంద్రుని పట్టిన గ్రహణం లెక్క...
ఓయ్ కోడి చుట్టూ గద్ద లెక్క... చంద్రుని పట్టిన గ్రహణం లెక్క...
పంటల్లో తెగులు లెక్క... తగులుకోకు నువ్ నా ఎనక...
ఇడిసి పెట్టేసెయ్... ఇడిసీ పెట్టేసెయ్... నా వెంట పడకా...
ఇడిసి ఇడిసీ ఇడిసీ పెట్టేసెయ్
ఇడిసి పెట్టేసెయ్... ఇడిసీ పెట్టేసెయ్...
నన్నే నా మానాన ఇడిసి పెడితే పోతానోయ్...
Also Read : ఆ కామెంట్స్‌తో మూడు రోజులు నిద్రపోలేదు - అనసూయ అంటే గౌరవం... మరోసారి శివాజీ రియాక్షన్
























