అన్వేషించండి

Sivaji : ఆ కామెంట్స్‌తో మూడు రోజులు నిద్రపోలేదు - అనసూయ అంటే గౌరవం... మరోసారి శివాజీ రియాక్షన్

Sivajji Reaction : తనకు తెలిసిన వాళ్లే తనపై మహిళా కమిషన్‌కు కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు శివాజీ. మహిళల డ్రెస్సింగ్ కాంట్రవర్సీపై మరోసారి ఆయన రియాక్ట్ అయ్యారు.

Sivaji About Women Dressing Comments Controversy Issue : మహిళల డ్రెస్సింగ్ అంశంపై 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. దాదాపు కొన్ని రోజుల పాటు ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఈ అంశంపై ఆయన రియాక్ట్ అయ్యారు.

'3 రోజులు నిద్రపోలేదు'

మహిళల డ్రెస్సింగ్ గురించి ఆ రోజు చేసిన కామెంట్స్‌తో తాను మూడు రోజులు నిద్ర పోలేదని చెప్పారు శివాజీ. 'మహిళల డ్రెస్సింగ్ గురించి ఆ రోజు నేను చేసిన కామెంట్స్‌లో రెండు పదాలు తప్పులు దొర్లాయి. అవి వాడకుండా ఉండాల్సింది. ఇదే మాట నేను గతంలోనూ చెప్పాను. నేనెప్పుడూ కంట్రోల్ లేకుండా మాట్లాడలేదు. ఆ రోజు అలా ఎందుకు మాట్లాడానో నాకు తెలియడం లేదు. అన్నీ రోజులు మనవి కావు. ఆ పదాలు వాడిన తర్వాత చాలా మానసిక సంఘర్షణకు లోనయ్యా.

3 రోజులు నిద్రపోలేదు. ఇప్పటివరకూ కొన్ని వందల ప్రెస్ మీట్స్, డిబేట్స్‌ల్లో మాట్లాడాను. కానీ ఎప్పుడూ ఇలా నోరు జారలేదు. ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది. నా ఉద్దేశం ఏంటో ప్రజలు అర్థం చేసుకున్నారు.' అంటూ చెప్పారు.

'అనసూయ అంటే గౌరవం'

మహిళల డ్రెస్ ఆధారంగా వారి క్యారెక్టర్ నిర్ణయించకూడదని అన్నారు శివాజీ. 'నేను అనసూయను కూడా ఏమీ అనలేదు. ఆమెతో నాకు పరిచయం కూడా చాలా తక్కువ. నన్ను ఓసారి ఆమె ఇంటర్వ్యూ చేశారు. ఆ అమ్మాయి అంటే నాకు గౌరవం ఉంది. ఈ ప్రపంచంలో మగవారు ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్లను కించపరచాలని అనుకోరనేది నా వ్యక్తిగత అభిప్రాయం.

మహిళా కమిషన్ నన్ను విచారణకు పిలిచినప్పుడు వెళ్లాను. నాకు తెలిసిన వాళ్లే నాపై కంప్లైంట్ చేశారని తెలిసి చాలా షాక్ అయ్యాను. వారి పేర్లు ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్లంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది.' అని అన్నారు.

Also Read : మ్యూజిక్ డైరెక్టర్‌కు విశ్వక్ గోల్డ్ వాచ్ - రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశా అంటూ ఎమోషనల్

సినిమాల విషయానికొస్తే... ఇటీవల 'దండోరా' మూవీతో అలరించిన శివాజీ లేటెస్ట్‌గా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ'తో రాబోతున్నారు. మొదట ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అని ప్రకటించినా క్రేజ్ దృష్ట్యా థియేటర్లలోకి రిలీజ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత శివాజీ, లయ జంటగా కనిపించబోతున్నారు.

మూవీకి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా... చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్, అలీ, ధన్ రాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, కరణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. పంచాయతీ సెక్రటరీగా శివాజీ కనిపించనున్నారు. ఈటీవీ విన్ సమర్పణలో శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ నిర్మించగా... వంశీ నందిపాటి, బన్నీ వాస్ రిలీజ్ చేయనున్నారు. మార్చి 6న సినిమా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ బిగ్ హైప్ క్రియేట్ చేస్తోంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
Musician Deva : ఇండస్ట్రీలో విషాదం... ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవ కన్నుమూత
ఇండస్ట్రీలో విషాదం... ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవ కన్నుమూత
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
Vijay Deverakonda New Movie : రొమాంటిక్ కామెడీ జానర్‌లో విజయ్ దేవరకొండ - ఆ డైరెక్టర్‌తో కొత్త మూవీ ఫిక్స్
రొమాంటిక్ కామెడీ జానర్‌లో విజయ్ దేవరకొండ - ఆ డైరెక్టర్‌తో కొత్త మూవీ ఫిక్స్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget