అన్వేషించండి

Trikaala Release Date: సనాతన ధర్మంలో రహస్యాలపై సినిమా... శ్రద్ధా దాస్ 'త్రికాల' రిలీజ్ డేట్ ఫిక్స్

Shraddha Das Trikaala Release: మన భారతీయ సనాతన ధర్మంలోని రహస్యాల ఆధారంగా మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ 'త్రికాల' రూపొందించామని దర్శక నిర్మాతలు తెలిపారు. విడుదల తేదీ వెల్లడించారు.

మైథాలజీ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాల సంఖ్య పెరుగుతోంది. పురాణ ఇతిహాసాలు, హిందూ ధర్మంపై కథలకు ఆసక్తి పెరుగుతోంది. సనాతన ధర్మం గురించి ఎక్కువ వినబడుతోంది. ఇప్పటి వరకు భారతీయ సనాతన ధర్మం (Sanatan Dharma)లోని రహస్యాలు ఆధారంగా చేసుకుని, ఎవరు టచ్ చేయమని పాయింట్‌తో మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్‌గా 'త్రికాల' (Trikaala Movie) రూపొందించామని దర్శకుడు మణి తెల్లగూటి తెలిపారు. ఈ నెలాఖరున సినిమా విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే...

మే 29న శ్రద్ధా దాస్ 'త్రికాల' విడుదల
'త్రికాల' సినిమాలో హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das) ప్రధాన పాత్రధారి. ఇంకా ఈ సినిమాలో మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని ఇతర కీలక పాత్రలు పోషించారు. మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించగా... రాధిక, శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమాను చాగంటి ప్రొడక్షన్ విడుదల చేస్తోంది. మే 29న థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.

'త్రికాల' గురించి దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ… ''ప్రపంచమంతా చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగులా అవతరించే శక్తి చుట్టూ చిత్ర కథ సాగుతుంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్‌, పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ మధ్య కాలంలో మైథలాజీ అంశాలతో వచ్చిన థ్రిల్లర్స్ విజయాలు సాధించాయి. మా సినిమా కూడా అలాగే హిట్ అవుతుందని నమ్మకం ఉంది. మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అజయ్ పవర్‌ ఫుల్ పాత్ర, శ్రద్ధా దాస్ కొత్త లుక్ అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులకు మా సినిమా ఒక కొత్త అనుభూతి ఇస్తుందనే ధీమా ఉంది'' అని చెప్పారు.

Also Read: Kamal Haasan Reacts To Rajinikanth Jealousy Comment - రజనీకాంత్ 'జెలసీ' కామెంట్‌పై కమల్ హాసన్ రియాక్షన్... మాది పోటీయే

సంగీతం అందించిన 'యానిమల్' హర్షవర్ధన్!
తమ సినిమాకు 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారని నిర్మాతలు రాధికా - శ్రీనివాస్ తెలిపారు. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ… ''మన సంస్కృతి, ఆధ్యాత్మికత అంశాలతో మిళితమైన ఈ కథ ప్రేక్షకులకు నచ్చుతుంది. మా చిత్రానికి నార్త్ ఇండియాలో కూడా మంచి బిజినెస్ జరిగింది. హిందీ శాటిలైట్ & డబ్బింగ్ హక్కులు మంచి రేటుకు అమ్ముడు అయ్యాయి'' అని చెప్పారు.

Also ReadRavi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?

Trikaala Cast And Crew: శ్రద్ధా దాస్, మహేంద్రన్, అజయ్, ఆమని, సాహితి అవంచ, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి తదితరులు నటించిన ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణ‌ - విడుద‌ల‌: చాగంటి ప్రొడక్షన్, నిర్మాతలు: రాధిక - శ్రీనివాస్, సహ నిర్మాతలు: శ్రీ సాయిదీప్ చాట్లా - వెంకట్ రమేష్ దాడి, ఛాయాగ్రహణం: ప‌వ‌న్ చెన్న, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, నేపథ్య సంగీతం: షాజిత్ హుమాయున్, కథ - దర్శకత్వం: మణి తెల్లగూటి.

Also ReadNaga Vamsi Vs Asian Suniel - ఖతమ్ చేస్తా బిడ్డా... కొట్టుకోవడం ఒక్కటే తక్కువ - ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget