Kuberaa: నాది నాది నాదే ఈ లోకమంతా.. - ఇంట్రెస్టింగ్‌గా 'ట్రాన్స్ ఆఫ్ కుబేర' టీజర్
Trance Of Kuberaa: ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అవెయిటెడ్ మూవీ 'కుబేర'. ఈ మూవీ నుంచి తాజాగా ట్రాన్స్ ఆఫ్ కుబేర పేరిట ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Dhanush's Trance Of Kuberaa Special Video Released: ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన అవెయిటెడ్ మూవీ 'కుబేర'. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండగా.. ప్రమోషన్లలో భాగంగా మూవీ నుంచి టీం తాజాగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది.
ఆకట్టుకుంటోన్న 'ట్రాన్స్ ఆఫ్ కుబేర'
'ట్రాన్స్ ఆఫ్ కుబేర' పేరిట పాత్రలను పరిచయం చేస్తూ ఈ వీడియో రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. 'నాది నాది నాదే ఈ లోకమంతా.. నేల నాది, గింజ నాది, చేలు నాది' అంటూ సాగే లిరిక్స్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీలో ధనుష్ డిఫరెంట్ రోల్‌లో బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున ఈడీ అధికారి పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. >
Step into the world of #SekharKammulasKuberaa and feel it ♥️#TranceOfKuberaa is out now!
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) May 25, 2025
* Tamil - https://t.co/dmcgnRFdFQ
* Telugu - https://t.co/n4s6l1XUMB
In cinemas June 20, 2025.#Kuberaa #SekharKammulasKuberaa #KuberaaOn20thJune @dhanushkraja KING @iamnagarjuna pic.twitter.com/qWYyxKAy4D
Also Read: థియేటర్స్ బంద్ కుట్ర వెనుక ద్వారంపూడి... వైసీపీ ఆటలో 'ఆ నలుగురు' పావులు అయ్యారా?
జూన్ 20న రిలీజ్
ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూన్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో ధనుష్, నాగార్జున, రష్మికలతో పాటు జిమ్ సర్బ్, ప్రియాంశు ఛటర్జీ, దలీప్ తాహిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
ఫస్ట్ సింగిల్ అదుర్స్
ఈ మూవీ నుంచి ఇటీవలే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ అదరగొడుతోంది. 'వన్ డే హీరో నువ్వే ఫ్రెండు.. నీ కోసమే డప్పుల్ సౌండు.. అస్సల్ తగ్గక్ అట్టనే ఉండు.. మొక్కుతారు కాళ్లు రెండూ..' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకున్నాయి. 'పోయి రా.. పోయి రా.. పోయి రా.. మావా' (Poyiraa Maavaa) అంటూ ధనుష్ మాస్ డ్యాన్స్ వేరే లెవల్‌లో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమా అంటేనే ఎప్పుడూ ఓ స్పెషల్ క్రేజ్. కూల్ కూల్ 'హ్యాపీడేస్' నుంచి విలేజ్ లవ్ స్టోరీ 'ఫిదా', పొలిటికల్ హిట్ 'లీడర్', 'లవ్ స్టోరీ', 'గోదావరి' వంటి మూవీస్ ఎప్పటికీ ఎవర్ గ్రీనే. భిన్నమైన సోషల్ డ్రామాతో 'కుబేర' మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుండగా.. మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. అసలు స్టోరీ ఎలా ఉండబోతోంది అనే దానిపై చర్చ సాగుతోంది. మూవీలో ధనుష్ బిచ్చగాడి క్యారెక్టర్ కావడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. టీజర్‌లో నాగార్జున లుక్ డిఫరెంట్‌గా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. దీంతో మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.






















