Tollywood News Today Top 5: నందమూరి వారసుడి సినిమా, దగ్గుబాటి ఫ్యామిలీ విరాళం, రాజ్ తరుణ్ లావణ్య కేసులో అప్డేట్ - నేటి సినీ విశేషాలివే
నందమూరి వారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా ప్రకటన నుంచి దగ్గుబాటి ఫ్యామిలీ భారీ విరాళం, రాజ్ తరుణ్ - లావణ్య కేసులో అప్డేట్ వరకు... నేటి టాప్ సినీ విశేషాలు చూడండి.
నందమూరి వారసుడు వచ్చాడు...
బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినిమా అనౌన్స్ చేశారోచ్!
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో లెజెండ్ ప్రొడక్షన్స్ సంస్థలో నందమూరి తేజస్విని నిర్మాతగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర (ఎస్‌ఎల్‌వి) సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న సినిమాను అధికారికంగా నేడు ప్రకటించారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ / ఫ్రాంచైజీలో చిత్రమిది. ఇందులో మోక్షజ్ఞ సూపర్ హీరోగా కనిపించనున్నారు. నందమూరి వారసుడికి పలువరు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్ చేశారు.
(మోక్షజ్ఞ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి)
మోక్షజ్ఞను చిత్రసీమలోకి ఆహ్వానిస్తూ... బాబాయ్ బాలకృష్ణతో గొడవలు అంటూ వచ్చే పుకార్లకు చెక్ పెడుతూ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ట్వీట్స్ చేశారు. (ఆ వార్త చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
భారీ విరాళం ప్రకటించిన దగ్గుబాటి హీరోలు...
మేము సైతం అంటూ ముందుకొచ్చిన వెంకటేష్, రానా
ఏపీ, తెలంగాణలో వర్షాలు కారణంగా వచ్చిన వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల సహాయం కోసం పలువురు టాలీవుడ్ ప్రముఖులు భారీ విరాళాలు ఇచ్చారు. ఆ జాబితాలో దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు చేరారు. ఈ రోజు వెంకటేష్, రానా భారీ విరాళం ప్రకటించారు. (వెంకీ, రానా ఎన్ని కోట్లు విరాళం ప్రకటించారనే పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
బాక్సాఫీస్ దగ్గర దళపతి విజయ్ ‘గోట్’ దూకుడు...
ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (ది గోట్). ఇందులో స్నేహ, మీనాక్షి చౌదరి కథానాయికలు. పాన్ ఇండియా రిలీజ్ అయ్యింది. తమిళంలో మంచి స్పందన లభించింది. కానీ, తెలుగులో ఆశించిన రిజల్ట్ రాలేదు. అయితే... ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు మంచి వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ యాక్షన్ సినిమా దాదాపుగా వంద కోట్ల వసూలు చేసిందని టాక్. (విజయ్ 'ది గోట్' కలెక్షన్స్ తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
బూతు బొమ్మలు కాదు... బాలయ్య సినిమా పడాల్సిందే
ఆహా ఓటీటీ రూపొందించిన ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్ ఫిల్మ్ 'బాలు గాని టాకీస్'. టికెట్ ఈ ఆటకే చెల్లును, మార్చబడదు... అనేది ఉప శీర్షిక. శివ రామచంద్ర వరపు, శ్రావ్య శర్మ జంటగా... ప్రముఖ గాయకుడు - సంగీత దర్శకుడు - నటుడు రఘు కుంచె కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేశారు.
(ఆ ట్రైలర్ ఎలా ఉంది? ఏమిటి? అనేది చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
రాజ్‌తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్...
సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
యువ కథానాయకుడు రాజ్ తరుణ్, లావణ్య కేసులో హైదరాబాద్ పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకు వచ్చారు. లావణ్య చెబుతున్నట్టు కొన్ని విషయాలు నిజమేనంటూ కోర్టులో ఛార్జ్‌షీట్ వేశారు. (పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)