News
News
X

సక్సెస్ కోసం లుక్ మార్చేస్తున్న హీరోలు - మార్పు మంచిదేనా?

మన హీరోలు సినిమా కోసం ఎలాంటి సాహసం చేయడానికైనా రెడీగా ఉంటున్నారు. ప్రేక్షకులను మెప్పించాడనికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తమ పాత్రల కోసం కంప్లీట్ లుక్ ని మార్చేసి ఆశ్చర్యపరుస్తున్నారు.

FOLLOW US: 
Share:
గత కొన్నేళ్లలో తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ప్రాంతీయ సినిమా నుండి పాన్ ఇండియా మూవీ అనే రేంజ్ కి వెళ్ళిపోయింది. దీంతో మన హీరోలు సైతం సినిమా కోసం ఎలాంటి సాహసం చేయడానికైనా రెడీ అవుతున్నారు. ఆడియన్స్ ను మెప్పించడానికి సరికొత్త కంటెంట్ తో విలక్షణమైన పాత్రలతో వస్తున్నారు. ఎప్పటికప్పుడు మేకోవర్ అవుతూ తమని తాము కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
సుధీర్ బాబు లుక్ ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఎప్పుడూ సిక్స్ ప్యాక్ బాడీతో మ్యాచో మ్యాన్ గా కనిపించే సూపర్ స్టార్ అల్లుడు.. ఒక్కసారిగా లడ్డూ బాబులా మారిపోయి అందరికీ షాక్ ఇచ్చాడు. 'మామా మశ్చీంద్ర' సినిమాలో తన పాత్ర కోసమే ఇలాంటి లుక్ లోకి మారిపోయాడు. ఈ చిత్రంలో దుర్గ అనే ఉబకాయుడుగా సుధీర్ నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింమ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మరో రెండు పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేయనున్నారు.
 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం 'రంగస్థలం' సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. చిట్టిబాబు అనే రూరల్ మాస్ యువకుడిగా.. రగ్గుడ్ లుక్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో చెవిటి వాడిగా నటించడానికి కూడా చెర్రీ వెనకాడలేదు. అందుకే ఈ సినిమాతో చరణ్ కు మంచి పేరు రావడమే కాదు.. ఎన్నో అవార్డులు వరించాయి. 
 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా 'పుష్ప: ది రైజ్' సినిమా కోసం తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన లుక్ లోకి మారి అందరినీ ఆశ్చర్య పరిచారు. పొడవాటి జుట్టు, గుబులు గడ్డంతో ఊర మాస్ అండ్ రగ్డ్ అవతార్ లో కనిపించారు. కూలీగా, లారీ డ్రైవర్ గా, ఎర్ర చందనం స్మగ్లర్ గా ఆకట్టుకున్నాడు బన్నీ. ఇప్పుడు 'పుష్ప: ది రూల్' సినిమాతో మరోసారి సరికొత్తగా ఆవిష్కరించుకోడానికి రెడీ అవుతున్నారు. 
 
న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్ లోనే తొలిసారిగా పూర్తి మేకోవర్ అయ్యారు. 'దసరా' సినిమా కోసం రఫ్ అండ్ రగ్గుడ్.. ఊర మాస్ అవతార్ లోకి మారిపోయాడు. చింపిరి జుట్టు, కోర మీసాలతో ఎన్నడూ లేని విధంగా కనిపించారు. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఈ రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 30న విడుదల కాబోతోంది.
 
లుక్ విషయంలో ప్రయోగాలు చేయని మాస్ మహారాజా రవితేజ.. ఇప్పుడు 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా కోసం రూట్ మార్చారు. తొలిసారిగా ఊర మాస్ అవతార్ లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్ లో చేతిలో కొరడాతో ఒంటి మీద చొక్కా లేకుండా కనిపించింది ఆశ్చర్య పరిచారు. మాస్ రాజా సరికొత్త మేకోవర్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.
 
చాక్లెట్ బాయ్ లా కనిపించే ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని.. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో మాసీ లుక్ తో షాక్ ఇచ్చారు. ఆ తర్వాత 'రెడ్' మూవీలోనూ రామ్ రఫ్ లుక్ లో కనిపించారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా చిత్రంలో సైతం రాపో ఊర మాస్ గెటప్ లో కనిపిస్తారని టాక్. 
 
విలక్షణ నటుడు అల్లరి నరేశ్ సైతం 'నాంది' సినిమాతో లుక్ మార్చి హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో చేస్తున్న చిత్రంలో లారీ డ్రైవర్ గా నటిస్తున్నారని టాక్. దీని కోసం నితిన్ కంప్లీట్ మేకోవర్ అవుతున్నారని తెలుస్తోంది. ఇలా టాలీవుడ్ లో చాలా మంది హీరోలు సక్సెస్ కోసం లుక్ మార్చేస్తున్నారు. 
Published at : 03 Mar 2023 07:26 AM (IST) Tags: Allu Arjun allari naresh raviteja Sudheer Babu Tollywood News ram Nithin Ram Charan RAPO Nani

సంబంధిత కథనాలు

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

Ameer Sultan on Rajinikanth: రజినీకాంత్‌కు అసలు ఆ అర్హత ఉందా? తమిళ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

Ameer Sultan on Rajinikanth: రజినీకాంత్‌కు అసలు ఆ అర్హత ఉందా? తమిళ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

Tamil Actresses: ఫెయిల్యూర్స్ దాటి సక్సెస్ వైపు - లేటైనా, లేటెస్టు హిట్స్‌తో దూసుకెళ్తున్న తమిళ భామలు!

Tamil Actresses: ఫెయిల్యూర్స్ దాటి సక్సెస్ వైపు - లేటైనా, లేటెస్టు హిట్స్‌తో దూసుకెళ్తున్న తమిళ భామలు!

Shalini Ajith Kumar: దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న అజిత్ దంపతులు, బోటులో రొమాంటిక్ ట్రిప్ - ఆ వార్తలకు పుల్‌స్టాప్!

Shalini Ajith Kumar: దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న అజిత్ దంపతులు, బోటులో రొమాంటిక్ ట్రిప్ - ఆ వార్తలకు పుల్‌స్టాప్!

టాప్ స్టోరీస్

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?

TSPSC :  పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్