Swapna Varma: టాలీవుడ్‌లో విషాదం - ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్య
Swapna Varma Commits Suicide: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న స్వప్న వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Executive Producer Swapna Varma Commits Suicide: టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ(33) ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజులు క్రితం బలవన్మరణానికి పాల్పడిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసుంది. మాదాపూర్‌లో స్వప్ప ఒంటరిగా నివాసం ఉటుంది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల స్వప్ప ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వివరాలు.. స్వప్న వర్మ సొంతూరు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి. సినీరంగంలో పనిచేసేందుకు ఆమె మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న ఆమె గత సంవత్సరం నుంచి మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు.
అక్కడ తీగల హౌస్ అపార్ట్‌మెంట్ 101 ఫ్లాట్‌లో ఆమె నివసిస్తున్నరు. అయితే, గత ఆరు నెలలుగా ఎలాంటి ప్రాజెక్టు రావడ లేదు. దీంతో పనిలేకపోవడంతో స్వప్న ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజు క్రితం తాను నివసిస్తున్న ప్లాట్‌లోనే ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడినట్టు సమాచారం. ప్రస్తుతం స్వప్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: హీరో రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్ - అతడి ప్రియురాలు లావణ్యకు నోటీసులు జారీ..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

