అన్వేషించండి

Nagarjuna: ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదు, కోర్టు తీర్పును గౌరవిస్తా: నాగార్జున

Tollywood News | ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఒక్క అంగుళం భూమి కూడా కబ్జా చేయలేదని, అవాస్తవాలు ప్రచారం చేయవద్దని టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Tollywood Actor Nagarjuna tweet over N convention and mention court order | హైదరాబాద్: ఎన్ కన్వెన్షన్ సెంటర్ వివాదంపై టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున మరో ట్వీట్ చేశారు. ఎన్ కన్వెన్షన్ ను పక్కా పట్టా ఉన్న భూమిలో నిర్మించినట్లు మరోసారి స్పష్టం చేశారు. ఒక్క అంగుళం భూమి కూడా మేం ఆక్రమించలేదని, అయితే సెలబ్రిటీల విషయం వచ్చే సరికి భూతద్దంలో పెట్టి చూస్తారని నాగ్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ అంటూ కీలక విషయాలు పోస్ట్ చేశారు.

ఎన్ కన్వెన్షన్ లో కొన్ని ఎకరాల భూమి కబ్జా చేసి నిర్మించినట్లు హైడ్రా శనివారం కీలక ప్రకటన చేయడం తెలిసిందే. అందుకు నాగార్జున కౌంటరిస్తూ.. ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి తుమ్మిడికుంట చెరువు భూమిలో ఎలాంటి ఆక్రమణ జరగలేదని 24 ఫిబ్రవరి 2014న కోర్టు తీర్పు  (Sr.3943/2011) ఇచ్చినట్లు నాగార్జున స్పష్టం చేశారు. హైకోర్టులో ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. చట్టాలను తానెప్పుడూ గౌరవిస్తానని, ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి ఎలాంటి ఊహాగానాలు, అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరారు. వాస్తవాలు చెప్పడానికి తాను ఈ ట్వీట్ చేశానని, తమది పట్టా భూమి అని.. ఒక్క అంగుళం కూడా కబ్జా చేసింది కాదని నాగ్ స్పష్టం చేశారు.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా
మాదాపూర్ పరిధిలోని తుమ్మిడికుంట చెరువుకు చెందిన స్థలంలో నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని ఆరోపణలున్నాయి. గతంలోనే నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్.. జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు, హైడ్రా సిబ్బంది కలిసి శనివారం (ఆగస్టు 24న) ఉదయం ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు. అనంతరం కూల్చివేతలపై హైడ్రా ఓ ప్రకటన విడుదల చేసింది. అక్రమ నిర్మాణాలను, చెరువులు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను గతంలో ఇచ్చిన నోటీసుల మేరకు కూల్చివేసినట్లు తెలిపారు.

తుమ్మిడికుంట చెరువు భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు హైడ్రా పేర్కొంది. FTL పరిధిలో ఒక ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్‌లో 2 ఎకరాల 18 గుంటలు (మొత్తం 3 ఎకరాల 30 గుంటల) భూమిని ఆక్రమించి నిర్మించారని ఓ ప్రకటనలో హైడ్రా తెలిపింది. ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతులు ఇవ్వలేదని, ఏ కోర్టు సైతం స్టే ఇవ్వలేదని రంగనాథ్ తెలిపారు. 2014లో హెచ్ఎండీఏ ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL), బఫర్ జోన్‌లో నిర్మాణాలపై తొలిసారి నోటిఫికేషన్ ఇవ్వగా, 2016లో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది. 2014లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఓనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే చట్ట ప్రకారం చర్యలు ఉంటారని కోర్టు తెలిపినట్లు చెప్పారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఓనర్ సమక్షంలో ఎఫ్‌టీఎల్ పరిధిపై సర్వే చేశారని హైడ్రా తెలిపింది. దీనిపై ఎన్ కన్వెన్షన్ 2017లో మియాపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టును ఆశ్రయించగా.. కేసు పెండింగ్ లో ఉంది.  ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోకూడదని కానీ ఏ కోర్టులోనూ స్టే లేదని స్పష్టం చేసింది.  

Also Read: N Convention Demolition: నాగార్జున మంచి నటుడే, కానీ కక్కుర్తి ఎందుకు? ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నారాయణ ఘాటు వ్యాఖ్యలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
RBI Summer Internship: విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Parvathi Reddy: మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
Best in EV Scooters: ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
Embed widget