![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tillu Square: అనుపమ చాలా కష్టాలు పడింది, తనని ఎవరూ బలవంతపెట్టలేదు - ‘టిల్లు స్క్వేర్’ దర్శకుడు మల్లిక్ రామ్
Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్’లో అనుపమ పరమేశ్వరన్‌ను లిల్లీ అనే పాత్రలో చూసి ప్రేక్షకులంతా షాక్ అయ్యారు. దీనిపై తనకు వస్తున్న నెగిటివిటీపై తాజాగా దర్శకుడు మల్లిక్ రామ్ స్పందించాడు.
![Tillu Square: అనుపమ చాలా కష్టాలు పడింది, తనని ఎవరూ బలవంతపెట్టలేదు - ‘టిల్లు స్క్వేర్’ దర్శకుడు మల్లిక్ రామ్ Tillu square director Mallik Ram explains how Anupama Parameswaran came on board for the movie Tillu Square: అనుపమ చాలా కష్టాలు పడింది, తనని ఎవరూ బలవంతపెట్టలేదు - ‘టిల్లు స్క్వేర్’ దర్శకుడు మల్లిక్ రామ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/87ebfd1699aec40ade6668ee857f2efc1711516911768802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mallik Ram about Anupama Parameswaran: త్వరలోనే సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన ‘టిల్లు స్క్వేర్’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాలో అనుపమ ముందెన్నడూ కనిపించనంత బోల్డ్ క్యారెక్టర్‌లో కనిపించింది. దీంతో తనపై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా అంతా తనపై నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టింది. తాజాగా ‘టిల్లు స్క్వేర్’ ప్రెస్ మీట్‌లో వారందరికీ గట్టి సమాధానం చెప్పింది అనుపమ. తాజాగా ఈ మూవీ దర్శకుడు మల్లిక్ రామ్ కూడా అనుపమతో నటించిన అనుభవం ఎలా ఉందో బయటపెట్టాడు.
కామెంట్స్ చదివాను..
‘‘టిల్లు స్క్వేర్.. కోసం హీరోయిన్స్‌ను వెతకడంలోనే 2 నెలలు లేట్ అయ్యింది. అప్పుడే చాలా రూమర్స్ ప్రారంభమయ్యాయి. అప్పుడు అనుపమ ఖాళీగా ఉందని తెలిసింది. వెంటనే షూటింగ్ ప్రారంభించాం’’ అని అనుపమ ఈ సినిమాలోకి ఎలా వచ్చిందో గుర్తుచేసుకున్నాడు మల్లిక్ రామ్. ఇక అనుపమపై, సినిమాపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌పై ఆయన స్పందించాడు. ‘‘జనాలు చేస్తున్న పిచ్చి కామెంట్స్ నేను కూడా చాలా చదివాను. ఇప్పుడు ఇంక చదవడం మానేశాను. నేను నిజాయితీగా కథ రాసుకొని సినిమా చేశాను. టిల్లుగా సిద్ధు, లిల్లీగా అనుపమ ఎలా సింక్ అవుతారు అనేదానిపై దృష్టిపెడతాను. కానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఏదో చేయాలి అన్నది కాదు’’ అంటూ వివరణ ఇచ్చాడు.
బలవంతపెట్టలేదు..
‘టిల్లు స్క్వేర్’ ప్రెస్ మీట్‌లో అనుపమ ఇచ్చిన ఘాటు సమాధానాలపై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు మల్లిక్ రామ్. ‘‘నేను అనుపమతో ఆఫ్ స్క్రీన్ కూడా మాట్లాడుతుంటాను. తను చిన్నప్పుడు చాలా కష్టపడిన బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చానని చాలాసార్లు చెప్పింది. ‘నా అదృష్టంకొద్దీ నాకు యాక్టింగ్ అనేది నేచురల్‌గా రావడం వల్ల నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. కెరీర్ బాగా వర్కవుట్ అయ్యింది. కానీ ఒకే రకాల పాత్రలు చేయడం వల్ల నేనేం కొత్తగా చేయలేకపోతున్నాను. నాకు ఉన్న బ్యాక్‌గ్రౌండ్ వల్ల నేను అడుగు ముందుకు వేయలేకపోతున్నానేమో. నాకు భయంగా ఉంది’ అని చెప్పింది. నువ్వు నమ్మితే చెయ్యి, ఎవరూ నిన్ను బలవంతపెట్టడం లేదు అన్నాను. నాకు చేయాలని ఉందని చెప్పింది. వచ్చి రీడింగ్ సెషన్స్‌లో కూర్చోమన్నాను. వచ్చింది, స్క్రిప్ట్ చదివింది’’ అని చెప్పుకొచ్చాడు.
ఎవరు చేసినా ఇంతే..
‘‘మా టీమ్ అంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌లాగా ఉంటాం. అదంతా అనుపమ చూసి వీరంతా నన్ను ఏం చేయరు. సినిమా తీద్దామంటున్నారు. ఒక క్యారెక్టర్ రాసుకున్నారు. నేను కాకపోతే ఇంకొక అమ్మాయి చేస్తుంది అనుకుంది అనుపమ చేసినా, శ్రీలిలా చేసినా లిల్లీ పాత్ర అలాగే ఉంటుంది. అలాగే చేస్తారు. తను సౌకర్యంగా ఫీల్ అయ్యింది. కొత్తగా చేయాలనుకుంది. దీంతో పాటు తను వేరే సినిమాల్లో కూడా డిఫరెంట్ పాత్రలు చేస్తోంది’’ అంటూ అనుపమ ‘టిల్లు స్క్వేర్’ సినిమాను ఒప్పుకోవడం వెనుక ఉన్న కథను వివరించాడు దర్శకుడు మల్లిక్ రామ్. ఇక మార్చి 29న ఈ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికీ కూడా చాలామంది అనుపమ ఫ్యాన్స్.. లిల్లీ పాత్రను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని సోషల్ మీడియా కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది.
Also Read: తిరుమల గుడిలో ఫేస్ రివీల్ అయ్యిందిగా - రామ్ చరణ్ కూతుర్ని చూశారా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)