Klin Kaara Konidela: తిరుమల గుడిలో ఫేస్ రివీల్ అయ్యిందిగా - రామ్ చరణ్ కూతుర్ని చూశారా?
Ram Charan Daughter Face Reveal: రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుమార్తె క్లింకారా కొణిదెల ఫేస్ రివీల్ అయ్యింది. చూశారా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కుమార్తె (Ram Charan Daughter Name) క్లింకారా కొణిదెల (Klin Kaara Konidela Face Revealed) ఎలా ఉంటుందో చూశారా? మెగా మనవరాలి ముఖం ఎలా ఉంటుందో చూశారా? ఎక్కడ అండీ... చరణ్ గానీ, ఆయన సతీమణి - ప్రముఖ ఎంట్రప్రెన్యూర్ ఉపాసన గానీ అమ్మాయి ముఖం కనిపించకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నారని అనుకుంటున్నారా!? అయితే, అంత జాగ్రత్తలోనూ అమ్మాయి ముఖం బయట పడింది. తిరుమల గుడిలో చరణ్ కుమార్తె ఫేస్ రివీల్ అయ్యింది.
చూడండి... మెగా ప్రిన్సెస్ ఎలా ఉందో!?
రామ్ చరణ్ తన పుట్టినరోజు (Ram Charan Birthday) సందర్భంగా కుటుంబంతో కలిసి తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లారు. ఉపాసన, కుమార్తె క్లింకారాతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో లోపలికి వెళ్లే సమయంలో క్యూ లైనులో ఉన్నప్పుడు అమ్మాయి ఫేస్ కెమెరా కంటికి చిక్కింది.
ఆలయంలో అడుగు పెట్టినప్పటి నుంచి చీర కొంగుతో క్లింకారా ఫేస్ కవర్ చేస్తూ వచ్చారు ఉపాసన. మధ్యలో కొంగు కిందకు పడటంతో అమ్మాయి కనిపించింది. ప్రజెంట్ క్లింకారా ఫేస్ రివీల్ అయిన వీడియో, అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?
వరుణ్ తేజ్ పెళ్లి ఫొటోల్లో కొంచెం కనిపించింది!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ వెళ్లింది. అక్కడ అందరూ కలిసి ఫోటోలు దిగారు. అప్పుడు క్లింకారా ఫేస్ కవర్ చేశారు ఉపాసన. అయితే... స్విమ్మింగ్ పూల్ వాటర్ లో అమ్మాయి రిఫ్లెక్షన్ జూమ్ చేసి మరీ చూశారు ఫ్యాన్స్. ఇప్పుడు చాలా స్పష్టంగా అమ్మాయి ఫేస్ బయట పడింది.
అచ్చం రామ్ చరణ్ ఫేసే అంటోన్న ఫ్యాన్స్!
క్లింకారా కొణిదెల ముఖం బయట పడటంతో అమ్మాయి ఎలా ఉంది? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అమ్మాయి ముఖం అచ్చం తండ్రి రామ్ చరణ్ తరహాలో ఉందని అభిమానులు చెబుతున్నారు. కొన్ని రోజులు వెయిట్ చేస్తే తప్ప అమ్మాయి ఎలా ఉందో చెప్పడం కష్టం ఏమో!?
జరగండి జరగండి...
— ABP Desam (@ABPDesam) March 27, 2024
రామ్ చరణ్ బర్త్ డేకి శంకర్ స్టైల్ సాంగ్#RamCharan #Jaragandi #HBDRamCharan #GameChanger #KiaraAdvani #GlobalStarRamCharan #HBDGlobalStarRamCharanhttps://t.co/5o6TQhHLHs
రామ్ చరణ్, ఉపాసన దంపతులు జూన్ 20న తల్లిదండ్రులు అయ్యారు. ఆ రోజు క్లింకారా జన్మించింది. మా ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టిందని మెగాస్టార్ చిరంజీవితో పాటు ఫ్యాన్స్ సంబరాలు చేశారు. ఆమె జన్మించిన తర్వాత వరుణ్ తేజ్ పెళ్లి కావడం, చిరును పద్మ విభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించడం జరిగాయి. ఇటీవల చిరంజీవి సతీమణి సురేఖ 'అత్తమ్మ కిచెన్' పేరుతో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. మనవరాలి రాకతో మెగా ఇంట బోలెడు శుభ కార్యాలు జరుగుతున్నాయని చిరంజీవి ఆ మధ్య సంతోషం వ్యక్తం చేశారు.