![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tiger Nageswara Rao Teaser : టైగర్ వేట షురూ - ఆంధ్రా రాబిన్ హుడ్‌గా మాస్ మహారాజా రవితేజ ఊచకోత
Ravi Teja's Tiger Nageswara Rao Teaser Review : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.
![Tiger Nageswara Rao Teaser : టైగర్ వేట షురూ - ఆంధ్రా రాబిన్ హుడ్‌గా మాస్ మహారాజా రవితేజ ఊచకోత Tiger Nageswara Rao teaser Ravi Teja's Pan India film based on Stuartpuram robber Tiger Nageswara Rao Teaser : టైగర్ వేట షురూ - ఆంధ్రా రాబిన్ హుడ్‌గా మాస్ మహారాజా రవితేజ ఊచకోత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/17/6a1b2a754893e6ceefd03c562f4914881692265462458313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వర రావు' (Tiger Nageswara Rao). అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా హిట్స్ 'కశ్మీర్ ఫైల్స్', 'కార్తికేయ 2' తర్వాత ఆయన నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. మధ్యలో రవితేజతో ధమాకా కూడా నిర్మించారు. ఈ చిత్రానికి వంశీ దర్శకుడు. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.
'టైగర్ నాగేశ్వరరావు' టీజర్ ఎలా ఉందంటే...
Tiger's Invasion Review : ఇప్పటి వరకు రవితేజ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. పవర్ ఫుల్ రోల్స్ కూడా చేశారు. అయితే... స్టూవర్టుపురం నాగేశ్వరరావు పాత్రలో ఆయన ఆహార్యం చాలా కొత్తగా ఉందని చెప్పాలి. ఆయన లుక్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. టైగర్ నాగేశ్వర రావును ఆంధ్రా రాబిన్ హుడ్ అని కొందరు అంటుంటారు. ఆ పాత్రలో రవితేజ ఎలా ఉన్నారో చూడండి.
''నాగేశ్వరరావు రాజకీయాల్లోకి వెళ్లి ఉంటే... వాడి తెలివితేటలతో ఎలక్షన్స్ గెలిచేవాడు. స్పోర్ట్స్ లోకి వెళ్లి ఉంటే... వాడి పరువుతో ఇండియాకు మెడల్ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్లి ఉంటే... వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. దురదృష్టవశాత్తూ వాడు ఒక క్రిమినల్ అయ్యాడు సార్'' అని మురళీ శర్మ చెప్పే డైలాగ్ కానీ, ఎనిమిదేళ్ళకు రక్తం తాగడం మొదలు పెట్టాడనే డైలాగ్ కానీ హీరోయిజం చూపించింది.
Also Read : మీరా జాస్మిన్‌కు తెలుగులో మరో ఛాన్స్ - ఈసారి యంగ్ హీరోతో...
రవితేజ సరసన ఇద్దరమ్మాయిలు!
'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao Biopic)లో రవితేజకు జోడీగా బాలీవుడ్ భామ నుపుర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj) నటిస్తున్నారు. తెలుగులో మహేష్ బాబు 'వన్ నేనొక్కడినే', అక్కినేని నాగ చైతన్య 'దోచేయ్', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాల్లో నటించిన కృతి సనన్ చెల్లెలు ఈ నుపుర్. ఆమె ఇంతకు ముందు హిందీలో ఓ సినిమా చేశారు. అక్షయ్ కుమార్, నుపుర్ సనన్ కలిసి ఓ మ్యూజిక్ వీడియోలో సందడి చేశారు. తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది.
Also Read : చిరంజీవి అభిమాని సినిమా - ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్
1970లలో దక్షిణ భారతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, స్టువర్టుపురం నాగేశ్వరరావు కథతో రూపొందిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : ఆర్. మది, సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar), ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, సంభాషణల రచయిత : శ్రీకాంత్ విస్సా, సహ నిర్మాత: మయాంక్ సింఘానియా.
విజయదశమి బరిలో 'టైగర్...' విడుదల
విజయదశమి కానుకగా అక్టోబర్ 20న 'టైగర్ నాగేశ్వరరావు' విడుదల (Tiger Nageswara Rao Release Date) కానుంది. ఈ సినిమా కంటే ఒక్క రోజు ముందు (అక్టోబర్ 19న)గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ 'భగవంత్ కేసరి' కూడా విడుదల కానుంది. ఆ సినిమాలో కాజల్ కథానాయిక. శ్రీ లీల కీలక పాత్రధారి. అలాగే... తమిళ స్టార్ హీరో విజయ్, 'విక్రమ్' దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందుతున్న 'లియో' కూడా అక్టోబర్ 19న థియేటర్లలోకి రానుంది. కొన్ని రోజుల క్రితం 'టైగర్ నాగేశ్వరరావు' వాయిదా పడుతుందని వార్తలు రాగా... వాటిని చిత్ర బృందం ఖండించింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)