Tiger 3 Collection: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న‘టైగర్ 3’, మూడు రోజుల్లో వసూళ్ల సునామీ - ఎంత వచ్చిందంటే?
Tiger 3 Movie: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘టైగర్ 3’ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 250 కోట్లు వసూళు చేసింది.
Tiger 3 Worldwide Collection: బాలీవుడ్ కండల వీరుడు చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నారు. ఆయన తాజా చిత్రం ‘టైగర్ 3‘ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కత్రినా కైఫ్ హీరోయిన్ గా మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలుత కాస్త నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా, ఆ తర్వాత పుంజుకుంది. థియేటర్లకు ఆడియెన్స్ తాడికి పెరిగింది. నెమ్మదిగా ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
3 రోజుల్లో రూ. 250 కోట్లు సాధించిన ‘టైగర్ 3’
తొలి మూడు రోజుల్లోనే ‘టైగర్ 3’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 250 కోట్లు సాధించి వారెవ్వా అనిపించింది. ముమ్ముందు కూడా ఈ సినిమా భారీగా వసూళ్లు చేపట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ‘టైగర్ 3’ మూవీ తొలిరోజు ఓ రేంజిలో ఓపెనింగ్స్ అందుకుంది. నవంబర్ 12న ఈ సినిమా రూ. 44.50 కోట్లు వసూళు చేసింది. రెండో రోజు రూ.59 కోట్లు రాబట్టింది. ఇక మూడో రోజు వసూళ్లు రూ.42.50 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా 3 రోజుల్లోనే దేశ వ్యాప్తంగా రూ. 145 కోట్లు అందుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజుల్లో ఏకంగా రూ. 250 కోట్లు సాధించింది. తొలిరోజు రూ. 95.23 కోట్లు సాధించగా, రెండో రోజు 88.16 కోట్లు వసూళు చేసింది. మూడో రోజు 67.34 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా మూడు రోజుల్లో రూ. 250.73 కోట్లు అందుకుంది.
#Tiger3 ENTERS the elite ₹250 cr club in just 3 days at the WW Box Office.
— Manobala Vijayabalan (@ManobalaV) November 15, 2023
Yet another DOUBLE century adds to megastar #SalmanKhan career.
Day 1 - ₹ 95.23 cr
Day 2 - ₹ 88.16 cr… pic.twitter.com/xck2Y5xvSZ
సల్మాన్ ఖాన్ కు మంచి బూస్టింగ్ ఇచ్చిన ‘టైగర్ 3’
ఇక ‘టైగర్ 3’ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా చేశాడు. బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ గెస్ట్ రోల్స్ లో ఆకట్టుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత, యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించడంతో పాటు ఆయనే కథ అందించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సుమారు రూ. 300 కోట్లతో ఈ సినిమాను నిర్మించింది. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ లో వచ్చిన 'ఏక్తా టైగర్'తో ఈ స్పై యూనివర్స్ స్టార్ట్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్ గా వచ్చిన 'టైగర్ జిందా హై'భారీ సక్సెస్ అందుకుంది. తాజాగా దానికి కొనసాగింపుగా ‘టైగర్ 3’ వచ్చింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. గత కొంతకాలంగా వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న సల్మాన్ కు ఈ సినిమా మంచి ఊరట ఇచ్చినట్లు అయ్యింది.
View this post on Instagram
Read Also: బెదింపులకు భయపడను, దేశం విడిచి వెళ్లను- దీపికా పదుకొణె