![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Priyamani: ఆ మతం వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నావని ట్రోల్ చేశారు: ప్రియమణి
ఇటీవల కస్టడీతో సినిమాతో మరోసారి తన టాలెంట్ నిరూపించుకున్న హీరోయిన్ ప్రియమణి.. తనపై వచ్చిన ట్రోలింగ్ పై స్పందించింది. బాడీ షేమింగ్ చేస్తూ తనను చాలా మంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేశారంటూ చెప్పింది
![Priyamani: ఆ మతం వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నావని ట్రోల్ చేశారు: ప్రియమణి They trolled me saying why married Muslim, This is my life My choice: Priyamani Priyamani: ఆ మతం వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నావని ట్రోల్ చేశారు: ప్రియమణి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/535ddacc9da490c13aa1eb167234bb7e1687850261108697_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Trolling on Priyamani : తెలుగుతో పాటు పలు హిందీ, తమిళం. మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించి, ప్రేక్షకుల హృదయాల్లో మంచి నటిగా ముద్ర వేసిన నటి ప్రియమణి (Priyamani). ప్రస్తుతం వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తోంది. ఈ క్రమంలో ఆమె జీవితంలో ఎదుర్కొన్న విమర్శలు, నెగెటివ్ కామెంట్స్ ట్రోలింగ్ పై తాజాగా పెదవి విప్పింది. ఇలాంటి పరిస్ఖితిని తాను చాలా సార్లు ఫేస్ చేశానని చెప్పుకొచ్చింది. బాడీ షేమింగ్ విషయంలోనూ తనపై విపరీతమైన ట్రోలింగ్ జరిగిందని ప్రియమణి తన ఆవేదనను వ్యక్తం చేసింది.
బాడీ షేమింగ్ ట్రోల్స్ తనకు కొత్తేం కాదని ప్రియమణి ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాను ప్రేమించిన ముస్తఫాను పెళ్లాడినపుడు కూడా ఆ నెగెటివ్ కామెంట్స్, విమర్శలు వెంటాడాయని తెలిపింది. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా తాను ముందుకు సాగిపోయినట్లు వెల్లడించింది. ఆన్ లైన్ ట్రోలింగ్‌ను నేను పెద్దగా పట్టించుకోను. బాడీ షేమింగ్, నా ఒంటి రంగు విషయంలో ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నా. ఇవన్నీ పక్కన పెట్టి ముస్తఫాను ప్రేమించి పెళ్లి చేసుకున్నపుడు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నాను అంటూ ప్రియమణి తన బాధను వ్యక్తం చేసింది.
తమ ఎంగేజ్మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసినపుడు.. నువ్వు ఓ ముస్లిం వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అంటూ ప్రశ్నించారు. అలాంటి కామెంట్లు చేసేవాళ్లందరికీ తాను చెప్పేది ఒకటే. ఇది నా జీవితం. ఎవరితో జీవితాన్ని పంచుకోవాలన్నది పూర్తిగా నా ఇష్టం. ట్రోల్స్‌కు అవసరం లేని అటెన్షన్ ఇచ్చి వాటి వల్ల బాధ పడటం నాకిష్టం ఉండదు. అందుకే నేను ఇలాంటివి పట్టించుకోను అని ప్రియమణి చెప్పింది.
ఏదేమైనా ఇలా తనపై వచ్చే ట్రోలింగ్ ను తాను ఏ మాత్రం పట్టించుకోనని ప్రియమణి తేల్చి చెప్పేసింది. తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్పుకొచ్చారు. తన జీవితంలో ఏం చేయాలన్నది కేవలం తన ఇష్టంపైనే ఆధారపడి ఉందని ప్రియమణి తెలిపింది.
Read Also: Adipurush Loss - ‘ఆదిపురుష్’ కలెక్షన్స్: ఆరంభంలో అదుర్స్, చివరికి డిజస్టర్ - నష్టం ఎంతో తెలుసా?
టాలీవుడ్ లో 'పెళ్లైన కొత్తలో(Pellaina Kotthalo)', 'గోలీమార్(Golimaar)', 'యమదొంగ(Yamadonga)' లాంటి హిట్ చిత్రాల్లో నటించి, గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి.. 2017లో బిజినెస్ మెన్ ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటించడం మాత్రం ఆపలేదు. 'నారప్ప', 'భామా కలాపం', 'విరాటపర్వం' మూవీస్ తో పాటు ఇటీవల వచ్చిన నాగచైతన్య 'కస్టడీ(Custody)'లోనూ కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ప్రియమణి షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న జవాన్‌లో ఓ కీ రోల్ పోషిస్తోంది. దక్షిణాదిన కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.
Read Also : Pawan Kalyan Lungi Look Bro : 'తమ్ముడు' కాదు 'బ్రో' - 'వయ్యారి భామ'ను గుర్తు చేసిన పవన్ కళ్యాణ్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)