Adipurush Loss - ‘ఆదిపురుష్’ కలెక్షన్స్: ఆరంభంలో అదుర్స్, చివరికి డిజస్టర్ - నష్టం ఎంతో తెలుసా?
'ఆదిపురుష్' మంచి వసూళ్లను రాబడుతుందని అంతా అనుకున్నారు. కానీ విడుదలైన మొదటి సోమవారం నుంచే కలెక్షన్లు పడిపోవడం ప్రారంభమయ్యాయి. దీంతో ఇప్పుడు అందరిదృష్టీ కొత్తగా విడుదల కాబోయే ఆదిపురుష్ మూవీపైనేనని టాక్
Adipurush Struggling at Box Office : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' జూన్ 16 గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుందని మేకర్స్ అంచనా వేశారు. దానికి తోడు పీవీఆర్ (PVR) ఐనాక్స్ వంటి థియేటర్లు సైతం కిక్కిరిశాయి. అయితే ఈ సినిమా 10 రోజుల బిజినెస్‌లో దాదాపు రూ.274 కోట్లు మాత్రమే వసూలు చేసి ప్రభాస్ ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. రూ.300 కోట్ల మార్కును టచ్ చేయడానికి కూడా చాలా కష్టపడిందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.
ఓవరాల్‌గా ఉత్తరాదిలో రూ.100 కోట్ల బాక్సాఫీస్ నష్టాన్ని చవిచూసిందని, దక్షిణాదిలో కూడా ఇదే నష్టమని మిరాజ్ సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ శర్మ అన్నారు. ఇప్పటి వరకు చేసిన బిజినెస్ కంటే రెట్టింపు బిజినెస్ చేసే అవకాశం ఈ సినిమాకి ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బలమైన మార్కెటింగ్ కారణంగా, ఈ చిత్రం అన్ని భాషలలో మొదటి వారాంతంలో 200 కోట్ల రూపాయలను రాబట్టగలిగింది. అయితే, నాల్గవ రోజు నుంచి మాత్రం నెగిటివ్ పబ్లిసిటీ వల్ల కలెక్షన్లు బాగా పడిపోయాయని థియేటర్ యజమానులు అంటున్నారు. కాగా ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదలైంది.
'ఆదిపురుష్' చిత్రం విడుదలకు ముందు, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నిరుపేద పిల్లల కోసం 10వేల టిక్కెట్లను బుక్ చేశారు. గాయని అనన్య బిర్లా కూడా కొన్ని రోజుల తర్వాత అదే విషయాన్ని ప్రకటించారు. తెలుగు నటుడు మంచు మనోజ్ వివిధ అనాథ శరణాలయాలకు చెందిన 2వేల5వందల మంది చిన్నారుల కోసం 'ఆదిపురుష్' ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు . నిర్మాత అభిషేక్ అగర్వాల్ 10వేలకు పైగా 'ఆదిపురుష్' టిక్కెట్లను నిరుపేద పిల్లలు, వృద్ధాశ్రమాలలో నివసించే వారికి విరాళంగా ప్రకటించారు.
కేవలం రూ.112 కే ‘ఆదిపురుష్’..
‘ఆదిపురుష్’ సినిమా కలెక్షన్లు పెంచడం కోసం మేకర్స్ రకరకాల స్టంట్ లు చేస్తున్నారు. ముందునుంచీ కూడా మూవీ ప్రమోషన్స్ ను కూడా వినూత్నంగా చేసుకుంటూ వచ్చారు. అయితే అవన్నీ సినిమా రిలీజ్ అయ్యేంతవరకే పనిచేశాయి. రిలీజ్ తర్వాత అంచనాలు అన్నీ తలకిందులు అయ్యాయి. మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టిన ‘ఆదిపురుష్’ సినిమా రెండో రోజు నుంచీ వసూళ్లు పడిపోయాయి. సినిమాలో నెగిటివ్ ప్రభావం వలన ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయారు. దీంతో కలెక్షన్లను పెంచేందుకు టికెట్ ధరలను తగ్గించారు మేకర్స్. అయినా కూడా కూడా కలెక్షన్లలో ఏమాత్రం తేడా రాలేదు. దీంతో టికెట్ రేట్లను మరింత తగ్గించారు మేకర్స్. మొన్నటి వరకూ టికెట్ రేటు తగ్గినా 3డి గ్లాసెస్ కోసం విడిగా డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. అయితే ఈసారి ఏకంగా 3డి గ్లాసెస్ తో కూడా కలిపి కేవలం రూ.112 కే ‘ఆదిపురుష్’ సినిమా అంటూ ప్రకటించారు. మరి ఈ ట్రిక్ తో అయినా సినిమా కలెక్షన్లు పెరుగుతాయోమో చూడాలి.
Read Also : Adipurush: ‘ఆదిపురుష్’కు కలెక్షన్స్ కష్టాలు, చౌకగా 3D టికెట్లు - మరీ అంత తక్కువా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial