By: ABP Desam | Updated at : 12 Sep 2023 05:28 PM (IST)
Image Credit: The Vaccine War/Twitter
సినిమాలు అనేవి నిజ జీవితాలకు దగ్గరగా ఉంటే ప్రేక్షకులకు మరింత ఎక్కువగా నచ్చుతాయి. అందుకే బయోపిక్స్ లాంటి చిత్రాలకు ఇప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఇక బయోపిక్స్ అన్నీ ఒక లెవెల్ అయితే.. తాజాగా వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది వ్యాక్సిన్ వార్’ అనే చిత్రం మరో లెవెల్‌లో ఉన్నట్టు అనిపిస్తోంది. ఇప్పటికే వివేక్ అగ్నిహోత్రి అనే పేరు ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే చిత్రంతో దేశమంతటా మారుమోగిపోయింది. ఇప్పుడు అలాంటి మరో రియాలిస్టిక్ కాంట్రవర్సీ చిత్రంతో వివేక్.. ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమదుతున్నాడు. తాను తెరకెక్కించిన ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది.
ఇండియా యొక్క మొదటి బయో సైన్స్ చిత్రం..
సైఫై, బయోపిక్.. ఇలాంటి రెండు వేర్వేరు జోనర్ల సినిమాలను ఇప్పటివరకు ఇండియన్ మూవీ లవర్స్ చూశారు. కానీ ఎప్పుడూ చూడని విధంగా ‘ఇండియా యొక్క మొదటి బయో సైన్స్ చిత్రం’గా ‘ది వ్యాక్సిన్ వార్’ను తెరకెక్కించారు వివేక్ అగ్నిహోత్రి. ఈ సినిమా పోస్టర్ విడుదలయినప్పటి నుండి కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఇండియా పడిన కష్టాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఈ మూవీ కోసం వివేక్ ఎంత రీసెర్చ్ చేశాడు అనే విషయం ట్రైలర్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. ముందుగా ‘ఇండియన్ సైంటిస్టుల దగ్గర రీసెర్చ్ కోసం కనీసం రూ.1 లక్ష కూడా లేవు అంట కదా’ అనే డైలాగుతో ‘ది వ్యాక్సిన్ వార్’ ట్రైలర్ మొదలయ్యింది.
మెప్పిస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ ట్రైలర్..
సరైన వనరులు, పెట్టుబడి లేకపోయినా కూడా ఇండియన్ శాస్త్రవేత్తలు కోవిడ్ కోసం వ్యాక్సిన్ కనుక్కోవాలని ధృడంగా ఎలా నిర్ణయించుకున్నారు, ఆ నిర్ణయానికి తగినట్టుగా ఎలా ముందుకు వెళ్లారు అనే విషయాన్ని ‘ది వ్యాక్సిన్ వార్’లో చూపించినట్టుగా అర్థమవుతోంది. ఇండియన్ సైంటిస్టుల దగ్గర సరైన వనరులు లేకపోవడం వల్ల ప్రజలతో పాటు మీడియా కూడా వారిని నమ్మలేదు. ‘ఇండియా వ్యాక్సిన్ తయారు చేయలేదు’ అంటూ మనల్నీ మనమే విమర్శించుకున్న అంశాన్ని కూడా ఈ ట్రైలర్‌లో స్పష్టంగా చూపించారు వివేక్ అగ్నిహోత్రి. అయినా కూడా శాస్త్రవేత్తలు ఎక్కడా తగ్గకుండా, ఎవరికి తెలియకుండా పరిశోధనలు మొదలుపెట్టడం, వ్యాక్సిన్ తయారు చేసే విషయంలో వారి ధృడ సంకల్పం గురించి సినిమాలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. పైగా ఇప్పటికీ కోవిడ్ అనేది నేచురల్‌గా సంభవించిందా? లేక ఏదైనా పరిశోధన వల్ల బయటికి వచ్చిందా? అనే విషయం చర్చనీయాంశంగా ఉంది. సినిమాలో దీని గురించి కూడా ఒక సెపరేట్ ఎపిసోడ్ ఉండనున్నట్టు అర్థమవుతోంది. కేవలం మగవారు మాత్రమే కాదు.. ఆడవారు కూడా సైంటిస్టులుగా ఈ పరిశోధనల్లో ఎంత కష్టపడ్డారో ట్రైలర్‌లో చూపించారు.
విడుదల ఎప్పుడంటే..
వ్యాక్సిన్ తయారు చేసే సమయంలో దాని చుట్టూ పలు రాజకీయ కుట్రలు కూడా జరిగాయి. ఇక కాంట్రవర్సీలు అనేవి దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఫేవరెట్ జోనర్ అని చాలామందికి తెలిసిన విషయమే. అందుకే వ్యాక్సిన్ చుట్టూ జరిగిన రాజకీయ కుట్రల గురించి కూడా ‘ది వ్యాక్సిన్ వార్’లో చర్చించినట్టుగా తెలుస్తోంది. వివేక్ తెరకెక్కించిన ఈ బయో సైన్స్ చిత్రంలో నానా పాటేకర్, పల్లవి జోషి, సప్తమి గౌడ వంటి తదితరులు సైంటిస్టులుగా నటించారు. సీనియర్ నటి రైమా సేన్.. జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 28న ‘ది వ్యాక్సిన్ వార్’ కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళంలో కూడా విడుదల కానుంది.
Also Read: ఇండియాలోనే మొదటిసారి అత్యధిక పారితోషికం తీసుకున్న తెలుగు నటి ఈమే - ఎంతో తెలిస్తే గుండె ఆగుద్ది!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి
Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్
Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్
Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?
Vijay Antony: మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>