అన్వేషించండి

The Greatest of All Time: విజయ్ ‘ది గోట్’లో దివంగత నటుడు విజయ్‌కాంత్ - అదెలా సాధ్యం అనుకుంటున్నారా?

The Greatest of All Time: విజయ్ హీరోగా నటిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజా అప్డేట్ ప్రకారం ఇందులో ఏఐ టెక్నాలజీతో వండర్స్ చేయనున్నారని తెలుస్తోంది.

Vijaykanth In The Greatest of All Time: ఈరోజుల్లో ప్రతీ రంగంలో టెక్నాలజీ అనేది విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఏఐతోనే అన్ని క్రియేట్ చేసేస్తున్నారు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. సింగర్స్‌ను క్రియేట్ చేశారు మేకర్స్. తాజాగా ఆ టెక్నాలజీతో చనిపోయిన యాక్టర్‌ను కూడా రీక్రియేట్ చేయాలని కోలీవుడ్ మూవీ మేకర్స్ సన్నాహాలు మొదలుపెట్టారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ప్రస్తుతం పాలిటిక్స్‌కు కాస్త పాజ్ ఇచ్చి ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The GOAT) మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఆ మూవీకి మరింత హైప్ క్రియేట్ చేయడం కోసం ఇటీవల మరణించిన సీనియర్ యాక్టర్‌ను ఏఐతో రీక్రియేట్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.

ఏఐ టెక్నాలజీతో..

విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది గోట్’ (The GOAT) కోసం హీరో ఫ్యాన్స్ అంతా తెగ ఎదురుచూస్తున్నారు. విజయ్ పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యే ముందు లాస్ట్ సెకండ్ మూవీ ఇదే అని వారంతా ఫీల్ అవుతూనే.. ఇది కచ్చితంగా తన కెరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత కూడా పాలిటిక్స్‌కు పాజ్ ఇచ్చి.. ఎట్టి పరిస్థితిల్లోనూ ముందుగా ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 5న విడుదల చేయాలని విజయ్ అనుకుంటున్నారు. మీనాక్షి చౌదరీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. తాజాగా మృతిచెందిన విజయ్‌కాంత్‌ను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా మూవీలో భాగం చేయాలని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.

దర్శకుడి రిక్వెస్ట్..

విజయ్‌కాంత్, విజయ్ చాలా క్లోజ్. అందుకే విజయ్ హీరోగా నటిస్తున్న ‘ది గోట్’లో విజయ్‌కాంత్‌ను ఏఐ ద్వారా రీక్రియేట్ చేస్తే ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతారని మేకర్స్ అనుకుంటున్నారట. అయితే విజయ్‌కాంత్‌ను ఏఐ ద్వారా రీక్రియేట్ చేస్తున్న విషయాన్ని స్వయంగా తన భార్య ప్రేమలతనే ప్రకటించారు. ‘ది గోట్’లో ఒక కీలకమైన సీన్‌లో విజయ్, విజయ్‌కాంత్ కలిసి కనిపించనున్నారని ఆమె తెలిపారు. ముందుగా అలా చేయడం తనకు ఇష్టం లేదని, కానీ దర్శకుడు వెంకట్ ప్రభు చాలాసార్లు తన సమ్మతం కోసం ఇంటికి వచ్చారని ప్రేమలత బయటపెట్టారు. తమిళంలో సైన్స్ ఫిక్షన్ సినిమాలు తెరకెక్కించడంతో గుర్తింపు తెచ్చుకున్న వెంకట్ ప్రభు.. విజయ్‌కాంత్ ఏఐను ఎలా ఉపయోగిస్తాడా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

డబుల్ రోల్..

అర్చన కల్పతి, కల్పతి ఎస్ అఘోరమ్, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేశ్ కలిసి సంయుక్తంగా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ను నిర్మిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది ఈ సినిమా. జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమ్గీ, అజయ్ రాజ్, అరవింద్ ఆకాశ్ వంటి నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా.. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలయిన ‘ది గోట్’ పోస్టర్స్ ద్వారా విజయ్ డబుల్ రోల్ అని, తను ఒక సైనికుడని తెలుస్తోంది.

Also Read: కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget