The Goat Life: 'ఆడు జీవితం' గురించి షాకింగ్ విషయాలు - 31 కేజీలు తగ్గిన హీరో!
The Goat Life: పృథ్వీ రాజ్ సుకుమారన్.. నటించిన 'ఆడు జీవితం' సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పింది చిత్ర బృందం.
Shocking Facts about The Goat Life: పృథ్వీ రాజ్ సుకుమారన్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. మలయాళ స్టార్ హీరో అయినప్పటికీ ఎన్నో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక 'సలార్' సినిమాతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు ఆయన. అయితే, పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించిన సినిమా.. 'ది గోట్ లైఫ్' అకా 'ఆడు జీవితం' ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఈ సందర్బంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు ఆయన. తెలుగులో నిర్వహించిన ఇంటరాక్షన్ లో భాగంగా సినిమా యూనిట్ కొన్ని విశేషాలు పంచుకుంది.
16 ఏళ్ల తర్వాత..
సినిమా రిలీజ్ సందర్భంగా, ప్రమోషన్స్ లో భాగంగా.. సినిమా యూనిట్ తెలుగు వాళ్లతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేసింది. దాంట్లో ఈ విషయాలు చెప్పుకొచ్చారు. 'ఆడు జీవితం' సినిమా.. దాదాపు 16 ఏళ్ల తర్వాత సెట్స్ పైకి వచ్చిందట. 16 ఏళ్ల నుంచి ఈ సినిమాపై వర్క్ చేసి.. 2018లో షూటింగ్ స్టార్ట్ చేసినట్లు చెప్పారు. ఇక ఆ తర్వాత కరోనా రావడం, అదే టైంలో సినిమా యూనిట్ మొత్తం ఎడారిలో దాదాపు మూడు నెలలు చిక్కుకుపోవడంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. అలా అన్ని అడ్డంకులు దాటుకుని 2022లో సినిమా షూటింగ్ పూర్తి చేయగా.. ఏడాదిన్నర పాటు దానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన వర్క్ జరిగిందట. ఇక ఇప్పుడు ఎట్టకేలకు సినిమా రిలీజ్ కాబోతోంది.
సినిమా కోసం 31 కేజీలు తగ్గిన హీరో..
క్యారెక్టర్ కోసం చాలామంది హీరోలు ఎంతో డెడికేషన్ తో వర్క్ చేస్తారు. అలా ఈ సినిమా కోసం పృథ్వీ రాజ్ దాదాపు 31 కేజీలు తగ్గారట. సినిమాలో ఆయన ఒక స్లేవ్ పాత్ర పోషించారట. దీంతో దానికి తగ్గట్లుగా తన ఫిజిక్ ని మలుచుకున్నారట ఆయన. ఇక ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
నిజ జీవిత సంఘటన ఆధారంగా 'ఆడు జీవితం'
1990లో జీవనోపాధి కోసం సౌదీకి వలస వెళ్లిన నజీబ్ అనే కేరళ యువకుడి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఎడారి దేశానికి వలస వెళ్లిన అతడు అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడు, అతనికి ఎదురైన సమస్యల చుట్టూ ఈ సినిమా సాగనుంది. పాస్ పోర్టులు లాక్కోవటం... బానిసలుగా మార్చుకోవటం... ఇమ్మిగ్రేషన్ కష్టాలు... ఎడారిలో బానిస బతుకు.... ఇలా అక్కడ పడుతున్న కష్టాలను మొత్తం ఆడు జీవితం పేరుతో వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. జాతీయ పురస్కారం అందుకున్న బ్లెస్సీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ ఏడాది కాన్ చలన చిత్రోత్సవాల్లో సినిమా ప్రీమియర్ షోలు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని చాలామంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Also Read: బ్లాక్ బస్టర్ ‘జవాన్‘కు సీక్వెల్ - అదిరిపోయే హింట్ ఇచ్చిన అట్లీ