అన్వేషించండి

Thandel Collections Day 1 Prediection: నాగ చైతన్య కెరీర్‌లోనే హయ్యెస్ట్ - 'తండేల్' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు, ఎన్ని కోట్లో తెలుసా?

Thandel Box Office Collections: నాగచైతన్య 'తండేల్' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ సత్తా చాటుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ, హిందీ ప్రాంతాల్లోనూ ఇప్పటివరకూ 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు సమాచారం.

Thandel Day 1 Collection Prediction: నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'తండేల్' (Thandel). ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించగా.. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించారు. సముద్ర నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేమ కథతో పాటు సర్వైవల్ డ్రామాగా తెరకెక్కింది. శుక్రవారం (ఫిబ్రవరి 7) ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా.. బన్నీ వాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా నిలిచింది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర బృందం బిజీబిజీగా ఉంది.

అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఎంతంటే..?

ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన లభిస్తున్న ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ, హిందీ ప్రాంతాల్లోనూ ఇప్పటివరకూ 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు సమాచారం. సుమారు వెయ్యికి పైగా షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు, అమెరికాలోనూ భారీగానే అడ్వాన్స్ బుకింగ్ నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 300 లొకేషన్లలో.. 600 షోలను స్క్రీనింగ్ చేయనున్నారు. ఇప్పటికే దాదాపు 7 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సుమారుగా రూ.90 లక్షలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

అమెరికాలో ప్రీమియర్స్ ముగిసే సమయానికే 'తండేల్' భారీ కలెక్షన్లు రాబడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ కలిసి ఈ సినిమాకు దాదాపు రూ.2.70 కోట్లు వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే ఈ నెంబర్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. 

అటు, ఏపీ ప్రభుత్వం సైతం తాజాగా 'తండేల్' టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ధరలు పెంచుకునేలా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.50, అదే మల్టీఫ్లెక్స్‌ల్లో జీఎస్టీతో కలిపి రూ.75 పెంచుకునేలా వీలు కల్పించింది. సినిమా విడుదలైన నాటి నుంచి వారం పాటు అదనపు ధరలు అమల్లో ఉంటాయి. 

నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్ బడ్జెట్ సినిమాగా..

ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు మత్స్యకారులు వేటకు వెళ్లి.. పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకుడు చందూ మొండేటి భావోద్వేగాలకు ప్రేమకథను ముడిపెట్టి దేశభక్తి అంశాలను మేళవించి సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. కాగా.. నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్ బడ్జెట్ సినిమాకు 'తండేల్' తెరకెక్కింది. సుమారు రూ.75 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాత బన్నీ వాసు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. సముద్రంలో తుపానుకు సంబంధించిన సన్నివేశాలకే దాదాపు రూ.18 కోట్లు ఖర్చైందని.. ఇవి సినిమాకే హైలైట్‌గా ఉంటాయని తెలిపారు. అటు, శ్రీకాకుళం యాసలో మాట్లాడేందుకు ప్రత్యేక ట్యూషన్ తీసుకున్నానని.. ఇదొక మంచి ప్రేమకథగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందని నాగచైతన్య తెలిపారు.

అందుకే సాయిపల్లవి..

మరోవైపు, ఈ చిత్రంలో సాయిపల్లవి (Sai Pallavi) ఎంపిక తన నిర్ణయమే అని అల్లు అరవింద్ తెలిపారు. 'ముంబయి నుంచి వచ్చిన వైట్ స్కిన్ అమ్మాయిలు ఈ పాత్రకు జీవం తీసుకురాలేరనిపించింది. ఇది ఎన్నో భావోద్వేగాలతో కూడిన పాత్ర. ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఇలాంటి గొప్ప పాత్రను నిజాయతీగా చేయాలి. సాయిపల్లవి అయితేనే వంద శాతం న్యాయం చేయగలరని నాకు అనిపించింది. ఆమె అసాధారణ నటి. అందుకే ఆమెను ఎంపిక చేశాం. తాము అనుకున్నట్లుగానే ఈ పాత్రకు ఆమె వంద శాతం న్యాయం చేసింది.' అని పేర్కొన్నారు.

Also Read: Ajith Kumar - Trisha : 'విదాముయార్చి' కంటే ముందు అజిత్ - త్రిష జంటగా నటించిన 4 హిట్ సినిమాలు - ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Love Drama OTT : సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
Vishwanath And Sons : సూర్య కాళ్లపై పడ్డ డైరెక్టర్ వెంకీ - స్టార్ హీరో రియాక్షన్ చూశారా?... వీడియో వైరల్
సూర్య కాళ్లపై పడ్డ డైరెక్టర్ వెంకీ - స్టార్ హీరో రియాక్షన్ చూశారా?... వీడియో వైరల్
Jabardasth Venky Warning : వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget