అన్వేషించండి

Bro Movie Second Single : తమన్ వాయిస్‌లో 'జాణవులే' - బాగుంది 'బ్రో'

Jaanavule Lyrical Video from BRO Telugu Movie : 'బ్రో' సినిమాలో రెండో పాటను నేడు విడుదల చేశారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో కలిసి ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా 'బ్రో' (Bro The Movie). దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. జూలై 28న విడుదల అవుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఈ రోజు రెండో పాట విడుదల చేశారు. 

తమన్ గొంతులో 'లవ్ యు బేబీ'
సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), కేతికా శర్మ (Ketika Sharma)పై తెరకెక్కించిన 'జాణవులే...' పాటను ఈ రోజు తిరుపతిలో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. సంగీత దర్శకుడు ఎస్. తమన్ ఈ పాటను స్వయంగా పాడటం విశేషం. ఫిమేల్ లిరిక్స్ కె. ప్రణతి పాడారు. చాలా రోజుల తర్వాత తమన్ లవ్లీ పెప్పీ నంబర్ పాడటంతో కొత్తగా ఉంది. 

'బేబీ... లవ్ యు బేబీ
యు ఆర్ సో హాట్ బేబీ
లెట్స్ గో క్రేజీ బేబీ 

బేబీ... లవ్ యు బేబీ
యు ఆర్ సో క్యూట్ బేబీ
లెట్స్ టై నాట్ బేబీ'
అంటూ సాగిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. జానపద గీతాలు, మాస్ మంచి పాటలతో పేరు తెచ్చుకున్న ఆయన... మధ్యలో కొన్ని ప్రేమ గీతాలు కూడా రాశారు. మళ్ళీ మరో ప్రేమ గీతంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  

'బ్రో' సినిమాలో సాయి ధరమ్ తేజ్, కేతికా శర్మ ప్రేమికులుగా కనిపించనున్నారని అర్థం అవుతోంది. మరి, మరో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ పాత్ర ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : వాటీజ్ థిస్ బేబీ - విజయ్ దేవరకొండకు దూరంగా రష్మిక

''కమాన్ కమాన్ డ్యాన్స్ బ్రో... 
యమా యమా బీట్స్ బ్రో... 
జిందగీనే జూకు బాక్స్ బ్రో...

రచ్చో రచ్చ రాక్స్ బ్రో... 
మజా పిచ్చ పీక్స్ బ్రో...
మనల్ని ఆపే మగాడు ఎవడు బ్రో'' 
అంటూ సాగిన 'బ్రో' సినిమాలో మొదటి పాట 'మై డియర్  మార్కండేయ'ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను రేవంత్, సింగధ శర్మ పాడారు. ఆ పాటలోనే  బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు.

Also Read 'బేబీ' రివ్యూ : ఆనంద్, విరాజ్ - ఇద్దరిలో వైష్ణవి చైతన్య ఎవరి పిల్ల? లేడీ అర్జున్ రెడ్డి అనే సినిమానా?

'బ్రో' సినిమాలో సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, 'వెన్నెల' కిశోర్, సుబ్బరాజు, పృథ్వీరాజ్ (30 ఇయర్స్ పృథ్వీ), నర్రా శ్రీను, యువ లక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ ప్రధాన తారాగణం. ఇంకా ఈ చిత్రానికి కళా దర్శకత్వం : ఏ.ఎస్. ప్రకాష్, కూర్పు : నవీన్ నూలి, పోరాటాలు : సెల్వ, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరి, ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్, సంగీతం :  ఎస్.ఎస్. థమన్,  సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల,  నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & జీ స్టూడియోస్, నిర్మాత : టీజీ విశ్వప్రసాద్, కథనం & మాటలు : త్రివిక్రమ్ శ్రీనివాస్, రచన & దర్శకత్వం : పి. సముద్రఖని. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget