News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Rana Daggubati In Thalaivar 170 : అవును, రజనీకాంత్ సినిమాలో రానా - ఇట్స్ అఫీషియల్!

Rana Daggubati In Rajinikanth Movie : సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్న విషయాన్నీ కన్ఫర్మ్ చేశారు. 

FOLLOW US: 
Share:

సిల్వర్ స్క్రీన్ మీద రానా దగ్గుబాటి (Rana Daggubati) హీరోగా కనిపించి ఏడాది పైనే అవుతోంది. 'విరాట పర్వం' తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. నిఖిల్ 'స్పై'లో కనిపించినా... అది అతిథి పాత్ర! త్వరలో ఆయన కొత్త సినిమా సెట్స్ వైపు అడుగు పెట్టనున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ఆయన కీలక పాత్ర చేస్తున్నారు. 

రజనీ 170వ సినిమాలో రానా దగ్గుబాటి
'విరాట పర్వం' తర్వాత రానా దగ్గుబాటి మరో సినిమా ప్రకటించలేదా? అంటే... ఓ సినిమా అనౌన్స్ చేశారు. 'హిరణ్యకశ్యప' చేస్తున్నట్లు తెలిపారు. అయితే... అది స్టార్ట్ కావడానికి టైమ్ పడుతుంది. అంత కంటే ముందు రజనీకాంత్ సినిమా స్టార్ట్ కానుంది. 

తమిళ స్టార్, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సూర్య హీరోగా నటించిన 'జై భీమ్' గుర్తుందా? ఆ సినిమా తీసిన దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ సినిమా (Thalaivar 170) చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమాలో రానా దగ్గుబాటి నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్లు మంజూ వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కూడా ఉన్నట్లు ఆల్రెడీ వెల్లడించినట్లు తెలిపారు. 

Also Read : మాటల మాంత్రికుడితో మెగాస్టార్ సినిమా?

అమితాబ్ బచ్చన్... ఫహాద్ ఫాజిల్ కూడా!
Thalaivar 170 Update : తలైవర్ 170లో అమితాబ్ బచ్చన్, 'పుష్ప'తో తెలుగు చిత్రసీమకు పరిచయమైన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil) కూడా నటించనున్నట్లు సమాచారం. అయితే... వాళ్ళు ఉన్నట్లు అధికారికంగా ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో రజనీ రిటైర్డ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్కౌంటర్ విధానం లేదా వ్యవస్థ మీద పోరాటం చేసే వ్యక్తిగా సూపర్ స్టార్ పాత్ర ఉంటుందట. 

Also Read 'జితేందర్ రెడ్డి' ఎవరో తెలిసింది - ఆయనతో పాటు శ్రియా శరణ్ కూడా!

రజనీతో లైకా ప్రొడక్షన్స్ సంస్థకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. వాళ్ళ కలయికలో వచ్చిన మొదటి సినిమా '2.0' రికార్డులు క్రియేట్ చేసింది. 'దర్బార్' సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, అందులో రజనీకాంత్ లుక్కు, యాక్షన్ సన్నివేశాలకు మంచి పేరు వచ్చింది. 'లాల్ సలాం'ను కూడా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చూస్తుంటే... రజనీతో మరిన్ని సినిమాలు చేసేలా ఉన్నారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 03 Oct 2023 11:27 AM (IST) Tags: Rana Daggubati Rajinikanth Latest Telugu News Thalaivar 170 Movie Thalaivar 170 Updates

ఇవి కూడా చూడండి

Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?

Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?

Tripti Dimri: నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన తృప్తి

Tripti Dimri: నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన తృప్తి

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్‌ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!

Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్‌ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!

టాప్ స్టోరీస్

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

Nara Lokesh: '3 నెలల్లో ప్రజా ప్రభుత్వం' - అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యమన్న నారా లోకేశ్

Nara Lokesh: '3 నెలల్లో ప్రజా ప్రభుత్వం' - అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యమన్న నారా లోకేశ్

Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్‌- తప్పులేదన్న సజ్జనార్‌

Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్‌- తప్పులేదన్న సజ్జనార్‌