Hari Hara Veera Mallu: పవన్ 'హరిహర వీరమల్లు' కచ్చితంగా చూడాల్సిందే! - ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు తెలుసా?
HHVM Facts: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'. ఈ పేరు వింటేనే ఫ్యాన్స్‌తో పాటు అందరికీ గూస్ బంప్స్. మరి ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూస్తే...

Interesting Facts About Hari Hara Veera Mallu: ప్రస్తుతం ఎవ్వరి నోట విన్నా ఒకటే మాట. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'. చాలా రోజుల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ మూవీ గురువారం థియేటర్లలోకి వస్తుండడంతో ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. పీరియాడికల్ అడ్వెంచరస్ డ్రామాలో పవర్ ఫుల్ యోధుడిగా పవన్ కల్యాణ్ కనిపించనుండగా... ట్రైలర్‌తోనే అంచనాలు అమాంతం పెంచేశారు. ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పరిశీలిస్తే...
ఫస్ట్ ఫాన్ ఇండియా మూవీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్క్రీన్‌పై కనిపిస్తేనే ఆయన ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్. 'బీమ్లా నాయక్' తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి పొలిటికల్‌గా బిజీగా మారారు పవన్. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. రీఎంట్రీ తర్వాత చేసిన ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ కూడా ఇదే కావడం అంచనాలు భారీగా పెరిగాయి. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌ను పవన్ స్వయంగా డైరెక్ట్ చేయడంతో పాటు దీని కోసం మార్షల్ ఆర్ట్స్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు.
స్టోరీపైనే అందరి దృష్టి
కోహినూర్ వజ్రం చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుందని పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి పునాది వేయగా... కొన్ని కారణాలతో ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత ఎఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. క్రిష్ అంటే ఎప్పుడు పవర్ ఫుల్ స్టోరీస్ రాసుకుంటారు. ఇక పవర్ స్టార్ అంటే స్టోరీ మామూలుగా రాయరని అర్థమవుతోంది. ఇంతకు ముందు గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యతో చేసిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఆ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.
పవర్ ఫుల్ కాంబో
ప్రొడ్యూసర్ ఎఎం రత్నం, పవన్ కల్యాణ్‌లది సూపర్ హిట్ కాంబో. 'ఖుషి'తో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన రత్నం... ఆ తర్వాత నిర్మించిన 'బంగారం' కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'హరిహర వీరమల్లు'తో రాబోతున్నారు. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో మూవీని నిర్మించగా... విజువల్ వండర్ క్రియేట్ చేసినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.
Also Read: సూర్య బర్త్ డే స్పెషల్ - వెంకీ అట్లూరి మూవీ నుంచి ఫస్ట్ లుక్ అదుర్స్
విలన్... హైలైట్ అంతే...
బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఇందులో ఔరంగజేబు రోల్‌లో నటిస్తున్నారు. 'యానిమల్' మూవీలో ఆయన నటన అద్భుతం. ఈ సినిమా చూసిన డైరెక్టర్ జ్యోతికృష్ణ వీరమల్లులో ఆయన రోల్‌ను ప్రత్యేకంగా పవర్ ఫుల్‌గా మార్చారు. ఈయన రోల్ కచ్చితంగా అందరికీ నచ్చుతుందని... పవర్ స్టార్ ఈక్వెల్ నటన అని అంటున్నారు.
పంచమిగా అందాల 'నిధి'
'హరిహర వీరమల్లు'లో హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. 2022లో వచ్చిన 'హీరో' మూవీ తర్వాత ఆమె తెలుగులో మరో మూవీ చేయలేదు. ఈ సినిమాలో పంచమి పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం భరతనాట్యం, గుర్రపు స్వారీలు శిక్షణ తీసుకున్నారట.
భారీ యాక్షన్ సీక్వెన్స్
ఈ మూవీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తాయట. ఈ సీన్స్ కోసం నాలుగు వెపన్స్‌తో మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు పవన్. ఇంటర్వెల్ సీక్వెన్స్ పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తుండగా... క్లైమాక్స్ కూడా అంతకు మించి ఉంటుందట.
ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బీజీఎం మూవీకే హైలైట్ అని తెలుస్తోంది. విజువల్స్, చారిత్రక కట్టడాలు అందరినీ ఆకట్టుకుంటాయనే టాక్ వినిపిస్తోంది. నాజర్, నర్గీస్ ఫక్రీ, అనుపమ్ ఖేర్ వంటి స్టార్స్ రోల్స్ కూడా గుర్తుండిపోతాయని తెలుస్తోంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ అందనుందని అర్థమవుతోంది.






















