Telugu Movies: TFPC జనరల్ బాడీ మీటింగ్‌లో నిర్మాతలు చర్చించబోయే అంశాలు ఇవే
Telugu Film Producers Council Members To Meet On Thursday: ఈ నెల 21న... అనగా గురువారం తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సభ్యులు సమావేశం కానున్నారు. అందులో చర్చించబోయే అంశాలు ఇవే.
ఈ నెల 21న... అనగా గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (Telugu Film Producers Council - TFPC) జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. అందులో చర్చించబోయే అంశాలను ఒక పత్రికా ప్రకటనలో TFPC గౌరవ కార్యదర్శి టి. ప్రసన్న కుమార్, మరో గౌరవ కార్యదర్శి మోహన్ వడపట్ల తెలిపారు.
నిర్మాతలు చర్చింబోయే అంశాలు ఏంటంటే...
- ఓటీటీ (డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్మకాల గురించి)
- వీపీఎఫ్ ఛార్జీలు
- థియేటర్లలో టికెట్ ధరలు
- ఉత్పత్తి వ్యయం
- పని పరిస్థితులు & రేట్లు.
- ఫైటర్స్ యూనియన్ సమస్యలు & ఫెడరేషన్ సమస్యలు.
- మేనేజర్ ల పాత్ర
- నటులు / టెక్నీషియన్ల సమస్యలు
నిర్మాణ వ్యయం పెరగడం, సరైన విజయాలు లేక నష్టాలు పెరగడంతో సినిమా షూటింగులు బంద్ చేయాలని రెండు మూడు రోజులుగా నిర్మాతలు చర్చిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వార్తలు అందుతున్న సంగతి తెలిసిందే. అయితే... ఆ వార్తల్లో పూర్తి వాస్తవాలు లేవని 'దిల్' రాజు తెలిపారు.
Also Read : ప్రొడ్యూసర్ల సమ్మె - అసలు విషయం చెప్పిన దిల్ రాజు
నిర్మాతలు అందరూ సమావేశమై కూలంకుషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని, బంద్ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఇండస్ట్రీని ఎలా కాపాడుకోవాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయని 'దిల్' రాజు పేర్కొన్నారు.
Also Read : ఎన్టీఆర్ ఏడాది క్రితమే హైదరాబాద్ శివార్లలో ఆ ల్యాండ్ కొన్నారు - ఇప్పుడు అక్కడ
View this post on Instagram