అన్వేషించండి

Dil Raju: ప్రొడ్యూసర్ల సమ్మె - అసలు విషయం చెప్పిన దిల్ రాజు

నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ సమ్మె గురించి క్లారిటీ ఇచ్చారు.

టాలీవుడ్ నిర్మాతలు షూటింగులు బంద్ చేయాలనుకుంటున్నారని రెండు రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. శని, ఆదివారాలు నిర్మాతలంతా కలిసి హైదరాబాద్ లో ఓ హోటల్ లో మీటింగ్ పెట్టుకొని సినిమా ప్రొడక్షన్, నష్టాలు, రెమ్యునరేషన్స్ వంటి విషయాలపై చర్చించుకున్నారు. ముందుగా ఈరోజు నుంచి షూటింగులు బంద్ అని వార్తలొచ్చాయి. ఆ తరువాత ఆగస్టు 1 నుంచి బంద్ అని అన్నారు. 

ఈ విషయాలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన నిర్మించిన 'థాంక్యూ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు దిల్ రాజు. ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్ నిర్మాతల సమ్మె గురించి మాట్లాడారు. నిర్మాతలంతా కలిసి మాట్లాడుకున్న విషయం నిజమేనని.. అయితే బంద్ గురించి ఇంకా ఏం అనుకోలేదని చెప్పారు. మీడియాలో మాత్రం డేట్ తో సహా బంద్ గురించి వార్తలొస్తున్నాయని వ్యంగ్యంగా అన్నారు. 

ఇండస్ట్రీని ఎలా కాపాడుకోవాలనే చర్చ మాత్రమే సాగుతుందని.. ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నిర్మాతలంతా ఒకే తాటిపైకి వస్తారని స్పష్టం చేశారు. ఇది నిర్మాతల సమస్య కాదని.. ఇండస్ట్రీ సమస్య అని చెప్పారు. నిర్మాత నష్టపోతే అందరి జీవితాలు నష్టాల్లో పడతాయని.. నిర్మాతల బాధలను హీరోలు, టెక్నీషియన్స్ అర్ధం చేసుకుంటారని నమ్ముతున్నట్లు చెప్పారు. ఒక సినిమా ఆపాలంటే, నిర్మాత.. హీరోలతో, దర్శకులతో మాట్లాడాలని.. దానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. 

ఇక 'థాంక్యూ' సినిమా విషయానికొస్తే.. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాను విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేశారు. ఇందులో రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అలానే అవికా గోర్ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.   

Also Read: శ్రీనువైట్లకు షాక్ - విడాకులకు అప్లై చేసిన భార్య!

Also Read: రామ్ చరణ్ సినిమాతో శంకర్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today November 9th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్స్‌లో నీతూ డ్రామా? ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్స్‌లో నీతూ డ్రామా? ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్!
Jagadhatri Serial Today Nov 9:పిల్లాడి ఏడుపు అడ్డుపెట్టుకుని కుటుంబాన్ని కలిపిన జగధాత్రి..కౌషికిని దగ్గరకు తీసుకున్న సుధాకర్‌,కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్: పిల్లాడి ఏడుపు అడ్డుపెట్టుకుని కుటుంబాన్ని కలిపిన జగధాత్రి..కౌషికిని దగ్గరకు తీసుకున్న సుధాకర్‌,కమలాకర్‌
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Windows Password Reset: ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
ల్యాప్‌టాప్ Password మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Embed widget