అన్వేషించండి

Praneeth Hanumanth: సోషల్‌ మీడియా కీచకుడు ప్రణీత్‌ హనుమంతుపై 'పోక్సో'‌ చట్టం - మరో ముగ్గురిపై కేసు

తండ్రికూతుళ్ల వీడియో అసభ్యకరంగా చర్చ జరిపిన యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతును తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హజరుపరిచారు.

Posco Case Filed on Youtube Praneeth Hanumanthu: సోషల్ మీడియా కీచకుడు, యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతును నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తండ్రికూతుళ్ల వీడియోపై అసభ్యకర కామెంట్స్‌ చేసినందుకుగానూ అతడిపై కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రణీత్‌ను నిన్న (జూలై 10) తెలంగాణ పోలీసులు బెంగుళూరులో అరెస్ట్‌ చేశారు. పీటీ వారెంట్‌ కింద హైదరాబాద్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అతడిని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. అతడిని విచారించిన అనంరతం కాసేపటి క్రితం నాంపల్లి కోర్టులో హజరుపరిచారు. అతడిపై పోక్సో చట్టంతో పాటు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రణీత్‌తో పాటు మరో ముగ్గురు డల్లాస్‌ నాగేశ్వరరావు, బుర్రా యువరాజ్‌, సాయిలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 

యూట్యూబర్‌గా వీడియోలు చేస్తూ కాంట్రవర్సల్‌ కామెంట్స్‌ చేస్తున్న ప్రణీత్‌ హనుమంతుపై నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం తండ్రికూతుళ్ల అనుబంధాన్ని తీవ్ర స్థాయిలో అతడు అపహాస్యం చేశాడు. ఓ వీడియో అప్పుడే ఇంటికి వచ్చిన తండ్రి దగ్గరికి ఓ రెండేళ్ల కూతురు పరుగెత్తుకుంటు వస్తుంది. అప్పుడు అతడు తన బెల్ట్‌ తీస్తూ సీరియస్‌గా కనిపిస్తాడు. ఆ తర్వాత ఆ బెల్ట్‌ని ఊయలగా చేసి కూతురికి ఊపుతాడు. ఇదే వీడియో ప్రణీత్‌తో పాటు మరో ముగ్గురు యూట్యూబ్‌ అసభ్యకరంగా చర్చ చేసి తండ్రీ కూతుళ్ల బంధంపై విషం చిమ్మారు. ఆ చిన్నారి తండ్రీతో ఆడుకుంటున్న వీడియోను తన స్నేహితులతో కలిసి వికృతమైన లైంగిక కోణంలో వక్రదృష్టితో చూపించి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించారు.

అతడి వికృత చేష్టలపై మొదట మెగా హీరో సాయి దుర్గా తేజ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేస్తూ ప్రణీత్‌ హనుమంతుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలను ట్యాగ్‌ చేశాడు. ఇక సాయి దుర్గా తేజ్‌ ట్వీట్‌పై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిపై అతడిపై చర్యలకు ఆదేశించారు. దీంతో యూట్యూబర్‌ ప్రణీత్‌ కేసు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు సీరియస్‌ తీసుకున్నారు. అతడి కోసం గాలించగా.. నిన్న బెంగళూరులో పట్టుబడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకుని కాన్సిట్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చి అతడిపై పోక్సో చట్టంతో పాటు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారించారు. విచారణ అనంతరం తాజాగా నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రణీత్‌ పాటు ఈ వీడియోలో నీచంగా మాట్లాడిన అతడి ముగ్గురు స్నేహితులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 

ప్రణీత్‌ కఠిన శిక్ష విధించాలి డిమాండ్స్‌

ప్రణీత్‌ హనుమంతును కఠినంగా శిక్షించాలంటూ సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు సైతం డిమాండ్‌ చేస్తున్నారు. డార్క్ హ్యూమర్ కావచ్చు, మరొకటి కావచ్చు భవిష్యత్తులో యూట్యూబర్ లేదా మరొక వ్యక్తి ఎవరైనా ఇలాంటి కామెంట్స్‌, వీడియోలు చేయకుండ ఉండాలంటే ప్రణీత్‌పై కఠిన శిక్ష విధించాలంటున్నారు. ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ప్రణీత్ ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడి సభ్యసమాజం తలదించుకునేలా చేశాడంటూ అతడిపై మండిపడుతున్నారు.  

Also Read: కూతురు క్లింకార, భార్య ఉపాసనతో ముంబైకి రామ్‌ చరణ్‌ - టాలీవుడ్‌ నుంచి ఒకేఒక్కడు.. ఎందుకో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Investment Tips: NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
Embed widget