News
News
X

Tees Maar Khan Controversy : త్యాగరాజస్వామి కీర్తనను అపవిత్రం చేసేలా ఆది, పాయల్ రొమాంటిక్ సాంగ్?

ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్‌ జంటగా నటిస్తున్న సినిమా 'తీస్ మార్ ఖాన్'. ఇటీవల హీరో హీరోయిన్స్ మీద చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ విడుదల చేశారు.

FOLLOW US: 

గాయని శ్రావణ భార్గవి (Sravana Bhargavi) పై ఏడు కొండల వెంకటేశ్వర స్వామి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం వరకూ వెళ్ళిన ఘటన మరువక ముందే అటువంటి వివాదం మరొకటి మొదలయ్యే సూచనలు కనబడుతున్నాయి. 'తీస్ మార్ ఖాన్' సినిమాలో సాంగ్ మీద కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

రొమాంటిక్ సాంగ్ 'సమయానికి...'
ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar), పాయల్ రాజ్‌పుత్‌ (Payal Rajput) జంటగా నటించిన సినిమా 'తీస్ మార్ ఖాన్'. ఇటీవల ఇందులోని రొమాంటిక్ సాంగ్ ఒకటి విడుదల చేశారు. సముద్ర తీరంలో చిత్రీకరించిన ఆ పాటకు మంచి స్పందన లభిస్తోంది. పాయల్ అందాలు హైలైట్ అయ్యాయని కొందరు అంటున్నారు. 'ధ్రువ' సినిమాలో 'పరేషానురా...' సాంగ్ పిక్చరైజేషన్‌ను కాపీ చేస్తూ ఈ సాంగ్ తీశారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. సాంగ్ ఎలా ఉందన్నది పక్కన పెడితే... సాంగ్ లిరిక్స్ కాంట్రవర్సీకి దారి తీసేలా ఉన్నాయి. 

త్యాగరాజస్వామి కీర్తనను అపవిత్రం చేశారా?
'తీస్ మార్ ఖాన్' సాంగ్ లిరిక్స్ గమనిస్తే... 'సమయానికి తగు మాటాడవా' అంటూ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వేరే వేరే పదాలు వస్తాయనుకోండి. సాయి కార్తీక్ సంగీతంలో రాకేందు మౌళి ఈ పాట రాశారు. సాంగ్ స్టార్టింగ్ మూడు పదాలు త్యాగరాజస్వామి కీర్తన నుంచి తీసుకోవడం సబబు కాదని కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

Also Read : రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: మాస్ మహారాజా రవితేజ సక్సెస్ అందుకున్నారా? లేదా?
 
Payal Romantic Song Lands In Trouble: త్యాగరాజస్వామి 'పంచరత్న' కీర్తనలు (Tyagaraja Swami Keerthanalu) పేరుతో ఐదు కీర్తనలు ఉంటాయి. వాటిని ఘన రాగ పంచ కీర్తనలు అని కూడా అంటారు. వాటిలో 'సాధించెనే...' అనే పంచరత్న కీర్తనలో 'సమయానికి తగు మాటలాడెనే' అనేది చరణంలో వస్తుంది. దానికి 'తీస్ మార్ ఖాన్'లో పాట పల్లవికి ఉపయోగించడం తగదని త్యాగరాజస్వామిని అభిమానించే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా 'తీస్ మార్ ఖాన్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇందులో స్టూడెంట్, రౌడీ, పోలీస్... మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయి కుమార్ పోషించారు. కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో విజన్ సినిమాస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 19న సినిమా విడుదల కానుంది. 

Also Read : సీనియ‌ర్ న‌రేష్‌కు ప‌విత్రా లోకేష్ చెల్లెలి వ‌రుస‌

Published at : 29 Jul 2022 04:00 PM (IST) Tags: Payal rajput aadi sai kumar Tees Maar Khan Movie Tyagaraja Swami Keerthanalu Samayanike Song Lyrics

సంబంధిత కథనాలు

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

PA Deepak: విశాఖ వాసి టాలెంట్‌కు హాలీవుడ్ ఫిదా, 2 గ్రామీలు సాధించిన పీఏ దీపక్ జర్నీ ఇదే

PA Deepak: విశాఖ వాసి టాలెంట్‌కు హాలీవుడ్ ఫిదా, 2 గ్రామీలు సాధించిన పీఏ దీపక్ జర్నీ ఇదే

Tollywood: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి - ఓటీటీలోకి 'షంషేరా'!

Tollywood: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి - ఓటీటీలోకి 'షంషేరా'!

Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!

Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..