అన్వేషించండి

రీల్ గర్ల్‌ఫ్రెండ్‌తో రియల్ లవ్ - ఆ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి ఫిక్స్?

కోలీవుడ్ అగ్ర హీరో విశాల్ పెళ్లికి సంబంధించి తాజాగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఒకప్పటి తమిళ హీరోయిన్ లక్ష్మీ మీనన్ ని విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.

కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లికి సంబంధించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు తెరపైకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మొదట్లో తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు రాగా..ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అభినయతో పెళ్లి జరగబోతుందని టాక్ కూడా వినిపించింది. ఇప్పుడు ఈ లిస్టులో లో మరో హీరోయిన్ పేరు కూడా చేరిపోయింది. ఒకప్పటి కోలీవుడ్ హీరోయిన్ లక్ష్మీ మీనన్ తో విశాల్ పెళ్లి ఫిక్స్ అయినట్లు ప్రస్తుతం కోలీవుడ్ మీడియా అంతా కోడైకొస్తోంది. తమిళంలో ప్రభు సోలామన్ డైరెక్ట్ చేసిన 'కుమ్కీ' అనే సినిమాతో ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ మీనన్.. ఆ తర్వాత 'జిగురుతాండ', 'కుట్టు బుల్లి', 'పాండియనాడు', 'నాన్ సికపు మన్మన్', 'కొంబన్' వంటి సినిమాల్లో నటించింది.

ఈ సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాయి. వీటితోపాటు విజయ్ సేతుపతికి జోడిగా 'రెక్కై' చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే స్టార్ హీరో అజిత్ నటించిన 'వేదాలం' సినిమాలో చెల్లెలి పాత్ర పోషించింది. ఇక 'వేదాలం' తర్వాత ఈ హీరోయిన్ కి తమిళంలో పెద్దగా అవకాశాలు రాలేదు. మళ్లీ చాలా కాలం తర్వాత ప్రస్తుతం రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న 'చంద్రముఖి 2' సినిమాలో నటిస్తోంది లక్ష్మీ మీనన్. 27 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్లో తెగ ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా హీరో విశాల్ తోనే ఆమె పెళ్లి జరగబోతుందని గట్టి టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నెట్టింట ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

అయితే దీనిపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోవడంతో కొంతమంది ఈ వార్తను కొట్టి పారేస్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించక తప్పదు. ఇదిలా ఉంటే విశాల్ తో లక్ష్మీ మీనన్ ఇప్పటికే  'పల్నాడు', 'ఇంద్రుడు' వంటి సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాల్లోనూ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా కుదరడంతో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత విశాల్ తో కలిసి లక్ష్మీ మీనన్ ఏ సినిమాలోనూ నటించలేదు. ఈ రెండు సినిమాల పరిచయంతోనే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైందని, ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఇంట్లో వాళ్లకు చెప్పకుండా దాచారని, త్వరలోనే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేయడంతోనే కోలీవుడ్ లో ఈ వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయని తెలుస్తోంది.

ఇక విశాల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం 'మార్క్ ఆంటోనీ' అనే సినిమాలో నటిస్తున్నారు. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ జె సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మినీ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : అక్షయ్‌తో కలిసి ‘OMG 2’ మూవీ చూసిన సద్గురు - ఆయన రివ్యూ ఇదే!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget