అన్వేషించండి

Aranmanai 4 Trailer: 'అరణ్మనై 4' ట్రైలర్‌ - దెయ్యంగా మారి భయపెడుతున్న తమన్నా!

Aranmanai 4 Trailer: అరణ్మనై ఫ్రాంచైజ్‌ నుంచి వస్తున్న 'అరణ్మనై 4' మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యంది. సుందర్ సి స్వీయదర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో రాశీఖాన్నా, తమన్నా ఫీమేల్‌ లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు.

Tamanaah and Raashi Khanna Aranmanai 4 Trailer: తమిళ నటుడు సుందర్‌ సి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అరణ్మనై సీక్వెల్స్‌ డబ్బింగ్‌ చిత్రాలతో ఆయన తెలుగు ఆడియన్స్‌కి కూడా సుపరిచతమే. కొంతకాలం అరణ్మనై ఫ్రాంచైజీలతో ఆయన హారర్‌, థ్రిల్లర్‌ చిత్రాలతో అరిస్తున్నాడు. అంతేకాదు ఆయన స్వీయ దర్శకత్వం వహిస్తున్న నటిస్తున్న ఈ సీక్వెల్స్‌ ఒకదాని మించి ఒకటి హిట్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అరణ్మనై ఫ్రాంచైజ్‌ నుంచి వస్తున్న చిత్రం 'అరణ్మనై 4'. సుందర్ సి స్వీయదర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రాశీఖాన్నా, తమన్నా ఫీమేల్‌ లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు.

'ఆరణ్మనై 4' ట్రైలర్ ఎలా ఉందంటే..!

ఇందులో తమన్నా దెయ్యం పాత్రలో భయపెట్టనుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్‌ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి. ఇక చిత్రం ఏప్రిల్‌ 11న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో తమన్నా ఉరివేసుకుని చనిపోవడం.. ఆ తర్వాత దెయ్యంలా మారి తన చావుకు కారణమైన వారిపై పగ తీర్చుకోవడం వంటి హారర్‌ అంశాలతో ట్రైలర్‌ ఉత్కంఠగా సాగింది. అన్ని సీక్వెల్స్‌ లాగే ప్యాలెస్‌(విల్లా)సీన్ తో ట్రైలర్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత తమన్నా తన భర్త పిల్లలతో హ్యాపీగా గడుపుతున్న సీన్స్‌ ఆకట్టుకున్నాయి. అయితే సడెన్‌గా తమన్నా భర్త జాగింగ్‌ వెళ్తుండగా అతడు కాళ్లు పట్టుకుని దెయ్యం లాగిన సీన్ భయపెడుతుంది. ఆ వెంటనే తమన్నా ఓ బావిలో తాడుకు వెళాడుతూ ఆత్మహత్య చేసుకున్నట్టు చూపించారు. కాసేపటి లీడ్‌ యాక్టర్ సుందర్‌ సి ఎంట్రీ ఉంటుంది.

 

సమాధి దగ్గర వెళ్లి ఎమోషనల్‌ అవుతున్న అతడు నా చెల్లిది ఆత్మహత్య కాదు అని అనడం ట్విస్ట్‌ ఇస్తుంది. ఈ సారి లాయర్‌ అవతారం ఎత్తిన సుందర్‌ చట్టపరంగా తన చెల్లి చావుకు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో పోలీసులు నీ లాయర్‌ తెలివితేటలు కోర్టు చూపించుకో.. ఇక్కడ కాదంటూ పోలీసు ఆఫీసర్‌ గొడవపడటం.. ఈ కేసు ఇన్వీస్టిగేషన్‌లో చేస్తుండగా రౌడీలతో ఫైట్స్‌ సన్నివేశాలతో ట్రైలర్‌ సాగింది. ఇక మధ్యలో రాశీఖన్నా పాత్ర ఎంట్రీ ఇస్తుంది. డాక్టర్‌ అయినా ఆమెను దెమ్మం అవహించడం.. దాంతో ఆమె ఒక్కసారిగా వయలెంట్‌గా మారడం ఇలాంటి సన్నివేశాలతో ట్రైలర్‌ ఆద్యాంతంగా ఆసక్తిగా సాగింది. ఇక ఇందులో తమన్నా ఎందుకు చనిపోయింది, ఆమె చావుకు కారణమేంటనే అంశం మూవీ ఆసక్తిని పెంచుతుంది. మొత్తానికి భయంకరమైన హారర్‌ సీన్స్‌, థ్రీల్లింగ్‌ అంశాలు ట్రైలర్‌ ఆసక్తిగా సాగింది. అరణ్మనై 4 చిత్రంలో కోవై సరళ, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిప్ హాప్‌ తమిఝా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను Avni Cinemax, Benzz Media సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR On HCU Lands: నిన్న సామాన్యుల ఇండ్లు కూల్చేశారు, నేడు మూగజీవాలకు ఆశ్రయం లేకుండా చేస్తారా? కేటీఆర్ ఫైర్
నిన్న సామాన్యుల ఇండ్లు కూల్చేశారు, నేడు మూగజీవాలకు ఆశ్రయం లేకుండా చేస్తారా? కేటీఆర్ ఫైర్
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
New Rules From April: UPI నుంచి IT వరకు, గ్యాస్‌ నుంచి TDS వరకు - ఈ రోజు నుంచి మీరు ఊహించనన్ని మార్పులు
UPI నుంచి IT వరకు, గ్యాస్‌ నుంచి TDS వరకు - ఈ రోజు నుంచి మీరు ఊహించనన్ని మార్పులు
Rajiv Yuva Vikasam Scheme: యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs KKR Match Highlights IPL 2025 | కేకేఆర్ ను మట్టి కరిపించిన ముంబై ఇండియన్స్ | ABP DesamDhoni Fan Frustration on Out | RR vs CSK మ్యాచ్ లో వైరల్ గా మారిన క్యూట్ రియాక్షన్ | ABP DesamMS Dhoni Retirement | IPL 2025 లో హోరెత్తిపోతున్న ధోని రిటైర్మెంట్ | ABP DesamSandeep Sharma x MS Dhoni in Final Overs | RR vs CSK మ్యాచ్ లో ధోనిపై Sandeep దే విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On HCU Lands: నిన్న సామాన్యుల ఇండ్లు కూల్చేశారు, నేడు మూగజీవాలకు ఆశ్రయం లేకుండా చేస్తారా? కేటీఆర్ ఫైర్
నిన్న సామాన్యుల ఇండ్లు కూల్చేశారు, నేడు మూగజీవాలకు ఆశ్రయం లేకుండా చేస్తారా? కేటీఆర్ ఫైర్
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
New Rules From April: UPI నుంచి IT వరకు, గ్యాస్‌ నుంచి TDS వరకు - ఈ రోజు నుంచి మీరు ఊహించనన్ని మార్పులు
UPI నుంచి IT వరకు, గ్యాస్‌ నుంచి TDS వరకు - ఈ రోజు నుంచి మీరు ఊహించనన్ని మార్పులు
Rajiv Yuva Vikasam Scheme: యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
Allu Arjun: అల్లు అర్జున్ పేరు మారుతుందా? న్యూమరాలజీని నమ్ముకుంటున్న ఐకాన్ స్టార్... కారణం ఇదేనా?
అల్లు అర్జున్ పేరు మారుతుందా? న్యూమరాలజీని నమ్ముకుంటున్న ఐకాన్ స్టార్... కారణం ఇదేనా?
Salman Khan: సల్మాన్ ఖాన్ హిస్టరీలో ఇదే చెత్త రికార్డా... భాయ్ సినిమా షోలు క్యాన్సిల్
సల్మాన్ ఖాన్ హిస్టరీలో ఇదే చెత్త రికార్డా... భాయ్ సినిమా షోలు క్యాన్సిల్
HCU lands Fact: హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
Gas Cylinder Price Cut: రూ.45 తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ రేటు - మీ నగరంలో కొత్త ధరలు ఇవీ
రూ.45 తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ రేటు - మీ నగరంలో కొత్త ధరలు ఇవీ
Embed widget