అన్వేషించండి

Tamannaah: విజయ్ వర్మతో మనస్పర్థలు? వైరల్ అవుతోన్న తమన్నా కామెంట్స్

ఇంతకాలంగా ఇండస్ట్రీలో ఉన్నా.. తమన్నా పర్సనల్ లైఫ్‌పై ఎప్పుడూ పెద్దగా ఫోకస్ పడలేదు. కానీ విజయ్ వర్మతో ప్రేమ వ్యవహారం తన పర్సనల్ లైఫ్‌పై కూడా ఫోకస్ పడేలా చేసింది.

సీనియర్ హీరోయిన్లు, అప్‌కమింగ్ హీరోలు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం ఒక విధమైన ట్రెండ్‌లాగా మారిపోయింది. ఆ లిస్ట్‌లోకి తాజాగా తమన్నా, విజయ్ వర్మ కూడా చేరారు. వీరిద్దరూ ఎక్కువకాలం పాటు వారి రిలేషన్‌షిప్‌ను మీడియా నుంచి దాచిపెట్టలేకపోయారు. ప్రేమలో పడిన కొన్నిరోజులకే ముందుగా తమన్నా.. తన ప్రేమ గురించి అందరికీ చెప్పేస్తే.. విజయ్ వర్మ కాస్త ఆలస్యంగా ఈ విషయాన్ని అందరి ముందు ఒప్పుకున్నాడు. ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా.. ఇద్దరూ కలిసి కనిపించడంతో వీరు ప్రేమ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారని ప్రేక్షకులు భావిస్తున్నారు. కానీ తమన్నా తాజాగా చేసిన కామెంట్స్ విజయ్ వర్మను సూచిస్తున్నట్టుగా ఉన్నాయని, అవి కొంచెం నెగిటివ్‌గా ఉన్నాయని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

నాకు సరిహద్దులు ఉన్నాయి

ఇంతకాలంగా ఇండస్ట్రీలో ఉన్నా.. తమన్నా పర్సనల్ లైఫ్‌పై ఎప్పుడూ పెద్దగా ఫోకస్ పడలేదు. కానీ యాక్టర్ విజయ్ వర్మతో ప్రేమలో పడిందని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ అంతా తన ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. ‘మనుషులు ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ మన అనుకునే వ్యక్తుల దగ్గర నుంచి అలాంటి మాటలు విన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. కానీ చివరిగా నీ గురించి నువ్వేం చెప్పుకుంటున్నావో అదే ముఖ్యం’ అంటూ వ్యాఖ్యలు చేసింది. అసలు తమన్నా ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది, విజయ్ వర్మతో తనకు ఏమైనా మనస్పర్థలు వచ్చాయా అని ప్రేక్షకుల్లో అనుమానం మొదలయ్యింది. ‘నా కెరీర్ పట్ల నాకు చాలా సరిహద్దులు ఉన్నాయి. నేను ఎప్పుడూ ముక్కుసూటిగానే ఉండేదాన్ని, మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడేదాన్ని, నిజమే చెప్పేదాన్ని. మొదట్లో నా తల్లిదండ్రులు ఏమనుకుంటారో అన్న ఆందోళన ఉండేది. కానీ బ్యూటీ ఏంటంటే నేను మారాను, నాతో పాటు వారూ మారారు. దానిని నేను విజయంగా భావిస్తాను. కానీ ఈరోజుల్లో నా దగ్గర వారి అనారోగ్యం తప్పా నా సంతోషాన్ని ఏదీ దూరం చేయడం లేదు.’ అని తెలిపింది తమన్నా.

నాతో అలా మాట్లాడొద్దు అంటూ ఫైర్ అయిన విజయ్

మరోవైపు విజయ్ వర్మ కూడా తమన్నా గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు కాస్త ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఇటీవల విజయ్ వర్మ, తమన్నా ఇద్దరూ వేర్వేరుగా ముంబాయ్ ఎయిర్‌పోర్టులో కనిపించారు. దీంతో వీరిద్దరూ మాల్దీవ్స్ వెకేషన్‌ను వెళ్లారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు వీరిద్దరూ దీనిపై స్పందించలేదు. కానీ తాజాగా విజయ్ వర్మ ఒక ఈవెంట్‌కు హాజరయినప్పుడు ‘మాల్దీవ్స్‌కు వెళ్లి బాగా ఎంజాయ్ చేశారా’ అని ఒక జర్నలిస్ట్ అడగగా.. ‘నాతో అలా మాట్లాడొద్దు’ అంటూ విజయ్ వర్మ సీరియస్ అయ్యాడు. అసలు విజయ్ వర్మకు ఈ టాపిక్ గురించి మాట్లాడడం ఇష్టం లేదా లేక అసలు వీరిద్దరూ కలిసి వెకేషన్‌కే వెళ్లలేదా అని కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఇంతలో తమన్నా కూడా అలా ఇన్‌డైరెక్ట్‌గా వ్యాఖ్యలు చేయడంతో అసలు వీరిద్దరి మధ్య ఏమైంది అన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో ఎక్కువయిపోయింది.

Also Read: పవన్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్, ఆ మూడు ఒకేసారి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget