అన్వేషించండి

అబ్బో ఎంత తేడా - తమన్నా చిన్ననాటి వీడియో వైరల్, స్కూల్ డేస్‌లో మిల్కీ బ్యూటీ ఎలా ఉందో చూడండి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది తమన్నా చిన్నప్పటి వీడియో కావడం విశేషం.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది తమన్నా చిన్నప్పటి వీడియో కావడం విశేషం. ఇంతకీ ఆ వీడియో ఎందుకంత వైరల్ అవుతుంది? అందులో ఏముంది? అనే వివరాల్లోకి వెళ్తే.. తమన్నా 2005లో 'శ్రీ' అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికంటే ముందు హిందీలో 'చాంద్ షా రోషన్ చెహర' అనే సినిమాలో నటించింది. తమన్నా మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన సమయంలో ఆమె వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే. చాలా చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మిల్కీ బ్యూటీ. అయితే తాజాగా తన మొదటి హిందీ సినిమా 'చాంద్ షా రోషన్' గురించి తమన్నా మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.

"ప్రస్తుతం నేను పదవ తరగతి చదువుతున్నాను. త్వరలోనే పరీక్షలు కూడా రాయబోతున్నాను" అంటూ ఆ వీడియోలో మాట్లాడింది. అయితే తన 13వ ఏటా తమన్నా ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందంటూ ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ నెట్టింట తెగ కామెంట్స్ చేస్తున్నారు. 13 ఏళ్ల వయసులోనే తమన్నా తన మొదటి సినిమాకు సైన్ చేసింది. కానీ ఈ సినిమా కాస్త ఆలస్యమవడంతో 15వ ఏటా తమన్నా ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ వీడియోలో 'నా వయసు కేవలం పదమూడున్నర ఏళ్లు మాత్రమే' అని తమన్నా తెలిపింది. తమన్నా నార్త్ ఇండియన్ అనే విషయం తెలిసిందే. నిజానికి నార్త్ హీరోయిన్స్ చిన్న వయసులోనే కాస్త పెద్దగా కనిపిస్తుంటారు అనే అభిప్రాయం ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amitha Tamannaah 🧿 (@amithaspeaks)

తమన్నా వీడియో చూసిన తర్వాత ఆ మాట నిజమే అన్నట్టు అనిపిస్తుంది అంటూ కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా సినీ ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలుగా అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతోంది తమన్నా. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో స్టార్ డం అందుకొని అందరు స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఆ మధ్యకాలంలో కెరీర్ పరంగా కాస్త డౌన్ అయిన తమన్నా రీసెంట్ గా మళ్లీ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్యూ కూడా చేస్తోంది.

ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమాలో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇటు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళాశంకర్' లో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ కి ఎక్కువ ప్రాధాన్య ఇస్తూ అక్కడే సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా మారుతుంది. రీసెంట్ గా తమన్నా నటించిన 'జీకర్దా' 'ఆఖరి సచ్' వంటి వెబ్ సిరీస్ లు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మొత్తం మీద ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోయిన్స్ వచ్చినా తమన్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది.

Also Read : అందుకే నన్ను మళ్ళీ పిలిచారు - ఈడీ విచారణపై క్లారిటీ ఇచ్చిన నవదీప్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 SRH VS RR: రాజస్తాన్‌తో మ్యాచ్, టాస్ ఓడిన సన్‌రైజర్స్ కెప్టెన్- ఫస్ట్ బ్యాటింగ్ SRH, జట్టులోకి ప్యాకెట్ డైనమైట్
రాజస్తాన్‌తో మ్యాచ్, టాస్ ఓడిన సన్‌రైజర్స్ కెప్టెన్- ఫస్ట్ బ్యాటింగ్ SRH, జట్టులోకి ప్యాకెట్ డైనమైట్
IPL 2025 SRH vs RR Top 5 players: ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
Bandi Sanjay: జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP DesamSRH vs RR IPL 2025 Match Preview | రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ | ABP DesamFan Touched feet of Virat Kohli | KKR vs RCB మ్యాచ్ లో కొహ్లీపై అభిమాని పిచ్చి ప్రేమ | ABP DesamVirat Kohli vs KKR IPL 2025 | 18వ సారి దండయాత్ర మిస్సయ్యే ఛాన్సే లేదు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 SRH VS RR: రాజస్తాన్‌తో మ్యాచ్, టాస్ ఓడిన సన్‌రైజర్స్ కెప్టెన్- ఫస్ట్ బ్యాటింగ్ SRH, జట్టులోకి ప్యాకెట్ డైనమైట్
రాజస్తాన్‌తో మ్యాచ్, టాస్ ఓడిన సన్‌రైజర్స్ కెప్టెన్- ఫస్ట్ బ్యాటింగ్ SRH, జట్టులోకి ప్యాకెట్ డైనమైట్
IPL 2025 SRH vs RR Top 5 players: ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
Bandi Sanjay: జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
NTR: 'దేవర'తో ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్ - జపాన్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఇక మాస్ జాతరే..
'దేవర'తో ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్ - జపాన్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఇక మాస్ జాతరే..
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
Allu Arjun: అట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?
అట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?
IPL 2025 CSK VS MI Updates: ఎల్ క్లాసికో పోరుకు రంగం సిద్ధం.. నేడు చెన్నైతో ముంబై ఢీ.. హార్దిక్ గైర్హాజరు.. అటు CSKలో దిగులు
ఎల్ క్లాసికో పోరుకు రంగం సిద్ధం.. నేడు చెన్నైతో ముంబై ఢీ.. హార్దిక్ గైర్హాజరు.. అటు CSKలో దిగులు
Embed widget