అన్వేషించండి

Navdeep: అందుకే నన్ను మళ్ళీ పిలిచారు - ఈడీ విచారణపై క్లారిటీ ఇచ్చిన నవదీప్!

మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ని తాజాగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారించగా, తాజాగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన నవదీప్ ఈడి దర్యాప్తు గురించి మాట్లాడారు.

టాలీవుడ్ లో మాదాపూర్ డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పేరు ప్రముఖంగా వినిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే నవదీప్ నార్కోటిక్స్ పోలీసులతోపాటు ఈడీ విచారణకు హాజరవుతూ దర్యాప్తుకు సహకరించారు. సాధారణంగా నవదీప్ పేరు ఈ కేసులో బయటికి రావడంతో అతను కనబడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోతారని అందరూ అనుకున్నారు. కానీ నవదీప్ మాత్రం డ్రగ్స్ కేసుతో తనకి ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇస్తూ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అలాగే విచారణలో ఎక్కడా తడబడకుండా స్పష్టంగా సమాధానాలు ఇస్తున్నారు. మీడియా ముందు కూడా డక్స్ కేసుకు సంబంధించి వివరణ ఇస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారణలో పాల్గొన్న నవదీప్ తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నవదీప్ ని దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. డ్రగ్స్ దందాలో భాగంగా జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి నవదీప్ ను ఈడి అధికారులు ప్రశ్నించారు. విచారణకు వెళ్లిన నవదీప్ మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడకుండానే హడావిడిగా వెళ్లిపోయారు. దీంతో అతనిపై రకరకాల రూమర్స్ బయటకు వచ్చాయి. అయితే తాజాగా నవదీప్ సమర్పణలో 'సగిలేటి కథ' అనే సినిమా తెరకెక్కుతుండగా మీడియా వారి కోసం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్ లో సినిమాను ప్రదర్శించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో హీరో రవి మహాదాస్యం, హీరోయిన్ రిషిక, దర్శకుడు రాజశేఖర్ తోపాటు నవదీప్ పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే మీడియాతో ఇంటరాక్ట్ అయిన నవదీప్ ఈడి దర్యాప్తు గురించి మాట్లాడారు." టీఎస్ న్యాబ్ వాళ్ళు దేని గురించి అయితే క్లారిటీ తీసుకున్నారో అవే ప్రశ్నలు ఈడి వాళ్లు కూడా నన్ను అడిగారు. గతంలో 2017, 2022లో జరిగిన దాంతో మొన్న జరిగిన దానికి సంబంధమేంటని అడిగారు. వాళ్ళు ఏదైతే అడిగారో దానికి నేను సమాధానం చెప్పి వచ్చేసాను. అది విచారణ అంతే. నన్ను మళ్ళీ రమ్మని వాళ్ళు చెప్పలేదు. 2017 లో సిట్ పిలిచారు. విచారణ చేశారు. 2020లో ఈడి వాళ్లు పిలిచారు, ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. రెండు వేరు వేరు శాఖలు కాబట్టి ఈ రెండుసార్లు పిలవాల్సి వచ్చింది" అంటూ క్లారిటీ ఇచ్చాడు నవదీప్.

కాగా రీసెంట్ గా తెలంగాణ నార్కోటిక్ పోలీసులు నవదీప్ ను విచారించగా ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా? అనే కోణంలో విచారణ జరిపినట్టు తెలుస్తోంది. ఈ విచారణలో మనీ లాండరింగ్, డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లతో నవదీప్ కి ఉన్న సంబంధాలు, వారి మధ్య జరిగిన లావాదేవిలు, నవదీప్ ఫోన్ కాల్ డాటా, మెసేజ్లను ఈడీ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇక కెరియర్ పరంగా నవదీప్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఓవైపు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు. రీసెంట్ గానే 'న్యూసెన్స్' అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నవదీప్ త్వరలోనే 'లవ్ మౌలి' అనే సినిమాతో రాబోతున్నాడు.

Also Read : వెంకటేష్ 'సైంధవ్' టీజర్‌కు ముహూర్తం ఖరారు - ఎప్పుడంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget