తిరుమల శ్రీవారి భక్తుల కోసం క్యూలైన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , వర్చువల్ రియాలిటీ సాంకేతికతలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారికి మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా ఈ ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించాలని సూచించారు.