Saindhav Teaser: వెంకటేష్ 'సైంధవ్' టీజర్‌కు ముహూర్తం ఖరారు - ఎప్పుడంటే?
Saindhav Teaser Date: శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న 'సైంధవ్' మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర టీజర్ ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కెరియర్ లో 75వ చిత్రం గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది 'సైంధవ్'(Saindhav). 'హిట్', 'హిట్ 2' సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ మేకర్స్ మూవీ పై మరింత క్యూరియాసిటీని పెంచేస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించి ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహం నింపగా తాజాగా మరో బిగ్ అప్డేట్ తో వచ్చేసింది మూవీ యూనిట్. ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు సినిమా నుంచి పెద్ద అప్డేట్ రాబోతుందంటూ మేకర్స్ ముందుగా ప్రకటించినట్టుగానే సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఇంతకీ అప్డేట్ ఏంటంటే, 'సైంధవ్' నుంచి టీజర్ రాబోతోంది.
'సైంధవ్' మూవీ టీజర్ ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'చంద్రప్రష్టనగరం ప్రతిష్టాత్మకమైన మిషన్ తో మీకోసం ఎదురు చూస్తోంది' అనే క్యాప్షన్ తో విడుదల చేసిన పోస్టర్లో వెంకటేష్ చేతిలో గన్ పట్టుకొని వైల్డ్ లుక్ లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీని అనౌన్స్ చేసిన సమయంలో విడుదలైన గ్లిమ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ఇప్పుడు అక్టోబర్ 16న విడుదల చేయబోయే టీజర్ పై మరింత ఆసక్తి పెరిగింది. వెంకటేష్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుండగా ఇప్పటికే సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం.
The city of Chandraprastha awaits you with an ambitious mission❤️🔥#SAINDHAV Teaser on OCT 16th💥#SaindhavOnJAN13th @VenkyMama @Nawazuddin_S @arya_offl @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt @vboyanapalli @tkishore555 @maniDop #Venky75 pic.twitter.com/DcOamopXgS
— Sailesh Kolanu (@KolanuSailesh) October 12, 2023
చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బాగ్రాఫ్ లో సాగే సీక్రెట్ మిషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో వెంకటేష్ కి జోడిగా జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుండగా.. రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, జయప్రకాష్ కీలకలు పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాతోనే నవాజుద్దీన్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే తమిళ హీరో ఆర్య కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
నిజానికి ముందుగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆరోజు ప్రభాస్ నటిస్తున్న 'సలార్' మూవీ రిలీజ్ ఉండడంతో సంక్రాంతికి సినిమా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా కిషోర్ తాళ్లూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ మణికంధన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
Also Read : పెళ్లి తర్వాత నాలో వచ్చిన మార్పు అదే - వారానికి మూడు సార్లు బిర్యానీ తింటా : రానా దగ్గుబాటి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial